స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలంటే ఈక్విటీ మార్కెట్లపై మంచి అవగాహన ఉండాలి. లేకుంటే నష్టపోయే అవకాశం ఉంది. అయితే మంచి ఫండమెంటల్ స్టాక్ ల్లో పెట్టుబడి పెడితే మల్టీబ్యాగర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీల్లో గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ కంపెనీ ఉంది. గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ కంపెనీ గురువారం ట్రేడింగ్ లో భారీగా పెరిగింది. ఈ స్టాక్ ప్రైస్ 7 శాతం పెరిగింది. బుధవారం నాటి ముగింపు ధర రూ.223.20తో పోలిస్తే, ఈ రోజు గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ షేర్లు రూ.225.40 వద్ద ప్రారంభం అయింది. ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.238.58ని తాకింది.
ఆర్థిక సంవత్సరం 2027 (FY27) మొదటి త్రైమాసికంలో ఈ కంపెనీ బలమైన ఆర్థిక పనితీరును కనబరిచింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఉన్న రూ.4,924.35 కోట్ల ఆదాయంతో పోలిస్తే, కార్యకలాపాల ద్వారా వచ్చిన ఏకీకృత ఆదాయం 7 శాతం పెరిగి రూ.5,281.95 కోట్లకు చేరింది. స్థిరమైన వ్యాపార వృద్ధిని ప్రతిబింబిస్తూ, మొత్తం ఆదాయం కూడా 7 శాతం పెరిగి రూ.5,295.01 కోట్లకు చేరుకుంది. ఎబిట్డా గత ఏడాదిలోని రూ.142.62 కోట్ల నుంచి పెరిగి రూ.217 కోట్లకు పెరిగింది. 52 శాతం పెరిగింది.
కంపెనీ నికర లాభం (PAT) విషయంలో బలమైన వృద్ధి కనిపించింది. నికర లాభం 74 శాతం పెరిగింది. రూ.123.74 కోట్లకు చేరింది. బలహీనమైన మార్కెట్ సెంటిమెంట్లు ఉన్నప్పటికీ గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ షేర్ సానుకూల రాబడులను ఇచ్చింది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ఒక వారంలో 8.50 శాతం పెరిగింది. ఒక నెలలో 9.44 శాతం వరకు లాభపడింది. ఈ స్టాక్ గత సంవత్సరం కాలంలో 27 శాతం లాభాన్ని ఇచ్చింది. ఈ స్టాక్ మూడు సంవత్సరాలలో 292 శాతం రాబడి ఇవ్వగా.. ఐదు సంవత్సరాలలో 1,107 శాతం మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది.
వ్యూహాత్మక సోర్సింగ్, నిర్వహణ సామర్థ్యాలు తమ లాభదాయకత వృద్ధి ఆదాయ వృద్ధిని మించి కొనసాగిందని ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కనుభాయ్ జె. ఠక్కర్ పేర్కొన్నారు. నికర లాభంలో గణనీయమైన పెరుగుదలను ప్రతిబింబిస్తూ గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలోని రూ.2.43 నుంచి ఒక్కో షేరుపై ఆదాయం (EPS) 71 శాతం పెరిగి రూ.4.16కు చేరింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- Indo-MIM: లిస్టింగ్ రోజే భారీ లాభాలను అందించిన స్టాక్.. 45 శాతం ప్రీమియంలో లిస్ట్ అయిన ఇండో ఎంఐఎం షేర్లు..
- నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. పెట్టుబడిదారులను వణికిస్తున్న అమెరికా మార్కెట్..
- స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ.. సెన్సెక్స్ 888 పాయింట్లు, నిఫ్టీ 264 పాయింట్లు జంప్..
- స్టాక్ మార్కెట్ జోష్.. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా జంప్.. 24,200 దాటిన నిఫ్టీ.. మెరిసిన షేర్లు ఇవే..
- zepto IPO: ఐపీఓ వాల్యూవేషన్ను సవరించిన జెప్టో.. ఎందుకంటే..!
- లాభాల్లో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్.. ఐటీ, మెటల్ రంగాల దూకుడుతో నిఫ్టీ, సెన్సెక్స్ జోష్..