కంపెనీలపై కచ్చితమైన అవగాహన, ఆ కంపెనీలో ఏం జరుగుతుంది.. భవిష్యత్ లో ఆ కంపెనీ ఎలా పని చేయబోతుందో తెలుసుకుంటే స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించడం సులభమని చెబుతున్నారు. మల్టీబ్యాగర్ స్టాక్ పట్టుకుంటే సెట్ అయిపోవచ్చని చెబుతున్నారు. మార్కెట్ లో కొన్ని స్టాక్స్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇస్తాయి. అలాంటి వాటిలో క్యూపిడ్ స్టాక్ ఒకటి.జూలై 2021లో ఒక్కో షేరు ధర రూ.2.43గా ఉన్న క్యూపిడ్ ప్రస్తుతం రూ.213 వద్ద ట్రేడ్ అవుతోంది.
మార్కెట్ పరిస్థితులు బలహీనంగా ఉన్నప్పటికీ ఈ పెన్నీ స్టాక్ సానుకూల ధోరణిని కొనసాగించింది. ఇది ఒక వారంలో 7 శాతం రాబడి ఇవ్వగా.. ఒక నెలలో ఏకంగా 41.43% రాబడిని అందించింది. ఈ స్టాక్ గత ఏడాది కాలంలో 871.62 శాతం భారీ రాబడిని అందించింది. క్యూపిడ్ షేర్లు మూడేళ్లలో 8,522 శాతం, ఐదేళ్లలో 8,664.61 శాతం మేర పెరిగాయి. ఐదేళ్ల క్రితం ఈ స్టాక్‌లో పెట్టిన రూ.లక్ష పెట్టుబడి పెడితే.. అది నేడు దాదాపు రూ.87 లక్షలకు పెరిగి ఉండేది. మూడేళ్ల క్రితం పెట్టిన అంతే మొత్తంలోని పెట్టుబడి విలువ ఇప్పుడు సుమారు రూ.84 లక్షలుగా ఉండేది.
అలాగే నెల రోజుల క్రితం పెట్టిన పెట్టుబడి విలువ ఇప్పుడు రూ.1.33 లక్షలకు చేరేది. ఏడాది క్రితం ఈ స్టాక్ లో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే దాని విలువ ఇప్పుడు రూ.8.4 లక్షలుగా ఉండేది. FY27 మొదటి త్రైమాసికంలో రూ.150 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించే దిశగా సాగుతున్నట్లు క్యూపిడ్ జూన్ చివరలో ప్రకటించింది. కంపెనీ చరిత్రలోనే అత్యుత్తమ త్రైమాసిక పనితీరులలో ఒకటిగా ఇది నిలవనుంది. ఇన్ విట్రో డయాగ్నోస్టిక్స్ (IVD) వ్యాపారంలో స్థిరమైన పురోగతిని సాధిస్తున్నట్లు కూడా క్యూపిడ్
ప్రకటించింది.
అయితే ప్రతి పెన్నీ స్టాక్ ఇలానే పెరుగుతుందని భావించవద్దని నిపుణులు చెబుతున్నారు. కొన్ని స్టాక్ ల్లోనే ఇది సాధ్యమని చెబుతున్నారు. కొన్ని స్టాక్ ల ప్రైస్ కావాలని పెంచుతారని.. అప్పుడు వాటి వలలో పడొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- Multibagger Stock: ఆరు నెలల్లోనే 206 శాతం రాబడి ఇచ్చిన మల్టీబ్యాగర్ స్టాక్..
- Multibagger stock: ఐదేళ్లలో 354 శాతం రాబడి ఇచ్చిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Money Management: సంపాదిస్తే సరిపోదు గురూ.. పొదుపు కూడా చేయాలి..!
- Focused Mutual Funds: రిస్క్ తో రివార్డు కావాలనుకుంటున్నారా.. అయితే అందులో పెట్టుబడి పెట్టండి..!
- పెట్టుబడిదారులకు పండగే పండగ.. మార్కెట్లోకి రూ.15 వేల కోట్ల IPOలు.. టాప్ కంపెనీ IPOs ఏవంటే..
- SBI Funds Management IPO: గ్రే మార్కెట్లో అదరగొడుతున్న ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ షేర్లు..!