ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ రే డాలియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత మార్కెట్ ర్యాలీపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు 1929 నాటి తీవ్ర పతనం, 2000 నాటి డాట్-కామ్ (Dot-com) బబుల్‌కు ముందు కనిపించిన సంకేతాలనే గుర్తుచేస్తున్నాయని ఆయన హెచ్చరించారు. ది డైరీ ఆఫ్ ఎ సీఈఓ పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో స్టీవెన్ బార్ట్‌లెట్‌తో మాట్లాడుతూ డాలియో ఈ వ్యాఖ్యలు చేశారు.
మార్కెట్లు ప్రస్తుతం అమెరికా చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడి బబుల్‌ను ఎదుర్కొంటున్నాయని ప్రముఖ ఇన్వెస్టర్ జెరెమీ గ్రాంథమ్ చేసిన వ్యాఖ్యలతో ఆయన ఏకీభవించారు. ఏఐ సాంకేతికత పట్ల పెట్టుబడిదారుల విపరీతమైన ఉత్సాహం కంపెనీల విలువలను (Valuations) అసాధారణంగా పెంచేసిందని.. ఈ విభాగానికి చెందిన కంపెనీలు భారీగా మూలధనాన్ని ఆకర్షిస్తున్నాయని ఆయన విశ్లేషించారు.
ప్రధానమైన ఏఐ, టెక్నాలజీ కంపెనీలు భారీ విలువలతో పబ్లిక్ మార్కెట్లలోకి అడుగుపెడుతున్న తరుణంలో ఈ హెచ్చరికలు వెలువడటం గమనార్హం. ఇప్పటికే స్పేస్‌ఎక్స్ (SpaceX) చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ (IPO) నమోదు చేయగా.. ఆంత్రోపిక్ (Anthropic), ఓపెన్‌ఏఐ (OpenAI) వంటి సంస్థలు 1 ట్రిలియన్ డాలర్ల మార్కును సమీపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మార్కెట్‌లో ప్రస్తుతం నెలకొన్న ఈ బబుల్ పగిలిపోవడానికి పెరుగుతున్న వడ్డీ రేట్లు, విపరీతంగా పెరిగిన స్టాక్ జారీలు (Stock Issuances) ప్రధాన కారణాలుగా మారవచ్చని డాలియో అభిప్రాయపడ్డారు.
Robert Kiyosaki: 2026లో చరిత్రలోనే అతి పెద్ద మార్కెట్ క్రాష్.. హెచ్చరించిన రాబర్ట్ కియోసాకి..
గతంలో వచ్చిన ఆర్థిక చక్రాలను (Market Cycles) పరిశీలిస్తే.. వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీల షేర్ల కోసం ఇన్వెస్టర్లు అధిక ధరలు చెల్లించడానికి సిద్ధపడిన ప్రతిసారీ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. అటువంటి సమయాల్లో లాభాలను పిండుకోవడానికి మరిన్ని కంపెనీలు ఒకేసారి తమ షేర్లను విక్రయించడానికి పోటీ పడటం వల్ల సరఫరా పెరిగి.. క్రమంగా మార్కెట్ తీవ్ర బలహీనతకు లోనవుతుందని డాలియో వివరించారు.
ఇదిలా ఉంటే రాబర్ట్ కియోసాకి కూడా ఇదే తర ఈ సంవత్సరం అతి పెద్ద మార్కెట్ క్రాష్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాబర్ట్ కియోసాకి గతంలో వేసిన అంచనాలే సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోన్నాయి. రాబర్ట్ కియోసాకి కొద్ది సంవత్సరాలుగా మార్కెట్ క్రాష్ గురించి పదేపదే చెబుతున్నారు. కియోసాకి తక్షణ మార్కెట్ కదలికల కంటే, అప్పుల భారం, కరెన్సీ విలువ, ఆర్థిక వ్యవస్థలోని దీర్ఘకాలిక సమస్యల గురించి హెచ్చరిస్తుంటారని కొంత మంది వాదిస్తున్నారు. ఆయన అంచనాలను జాగ్రత్తగా మాత్రమే చూడాలని కోరుతున్నారు. అయితే ఆయన ఇచ్చే సూచనలు పనికి వస్తాయని చెబుతున్నారు.
ముఖ్యంగా సంపాదించిన డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మనకు ఆదాయం ఇస్తోందో.. అందులో పెట్టుబడి పెట్టాలని ఆయన సూచిస్తున్నారు. ఆలాగే బంగారంపై పెట్టుబడి పెట్డడం సురక్షితమని ఆయన పేర్కొంటున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- Robert Kiyosaki: 2026లో చరిత్రలోనే అతి పెద్ద మార్కెట్ క్రాష్.. హెచ్చరించిన రాబర్ట్ కియోసాకి..
- స్టాక్ మార్కెట్ క్లోజింగ్ బెల్.. చివరి నిమిషంలో అంతా తలకిందులు.. తీవ్ర నష్టాలతో ముగిసిన షేర్ మార్కెట్..
- క్లోజింగ్ ఆక్షన్ సెషన్ అంటే ఏమిటి.. నిఫ్టీ పతనమైతే.. సెన్సెక్స్ ఎందుకు పెరుగుతోంది..
- పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. ఈ కంపెనీ స్టాక్ మీద ఓ కన్నేసి ఉంచండి.. రూ. 15 వేల కోట్ల ఆర్డర్ వచ్చింది..
- Multibagger Stock: ఐదేళ్లలో 3,250 శాతం రాబడి ఇచ్చిన డిఫెన్స్ స్టాక్ ఇదే..!
- 20 నిమిషాల్లో 26 లక్షల షేర్లు అమ్మకం.. కుప్పకూలిన రూ.49 వేల కోట్ల విలువైన కంపెనీ షేర్లు.. కారణం ఇదే..