కార్పొరేట్ కంపెనీల్లో లే ఆఫ్స్ కామన్ అయిపోతున్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కలవరపెడుతున్నాయి. పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇక లైఫ్ సేఫ్ అనుకోవడానికి వీలు లేదని ప్రస్తుతం పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగులను తీసేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, మెటా, కాగ్నిజెంట్ తో పాటు చాలా కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటించాయి. తాజాగా వీసాలో కూడా ఉద్యోగుల తొలగింపులు చేశారు.

Advertisement

వీసా మాజీ ఉద్యోగి ఒకరు, కంపెనీ ఇటీవల జరిపిన ఉద్యోగ తొలగింపుల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అద్భుతమైన పనితీరు కనబరిచిన ఉద్యోగులు కూడా లే ఆఫ్స్ లో ఉద్యోగం కోల్పోయారని వివరించారు. నిరంతరం అద్భుతమైన సమీక్షలు పొంది, మంచి పనితీరు కనబరిచే వ్యక్తిగా పేరు పొందిన ఒక మేనేజర్ కూడా ఉద్యోగం కోల్పోయారని వివరించారు. ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తమకు షాక్‌కు గురి చేసిందన్నారు. భారీ కార్పొరేట్ పునర్నిర్మాణాల సమయంలో చాలా మంది ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోతున్నారని ఆ ఉద్యోగి తెలిపారు. ఈ పోస్ట్ కు సంబంధించి చాలా మంది నెటిజన్లు స్పందించారు.

Advertisement

కేవలం పనితీరు మాత్రమే ఉద్యోగులను తొలగింపుల నుంచి కాపాడి ఉండకపోవచ్చని కొంత మంది కామెంట్ చేశారు. ఆ మేనేజర్‌కు గతంలో సానుకూల స్పందన, విజయవంతమైన సమీక్షలు ఉన్నప్పటికీ, కంపెనీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించే ప్రయత్నాల వల్ల ఆయన కూడా ప్రభావితమయ్యారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. టెక్నాలజీ, ఆర్థిక సేవల రంగాలలో ఉద్యోగ భద్రతపై చాలా మంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత పనితీరు కంటే వ్యాపార ప్రాధాన్యతల ఆధారంగానే ఉద్యోగ తొలగింపులు జరుగుతాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Advertisement

మాజీ ఉద్యోగి చేసిన నిర్దిష్ట ఆరోపణలపై వీసా కంపెనీ ఎక్కడా స్పందించలేదు. అయితే చాలా కంపెనీలు టెక్నాలజీని ఉపయోగించడం వల్ల ఉద్యోగులను తొలగిస్తున్నాయి. చాలా కంపెనీలు ఏఐపై దృష్టి సారించాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఏఐపై భారీ పెట్టుబడులతో పాటు కంపెనీలు తమ ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. సాఫ్ట్ వేర్ కంపెనీల్లోనే కాకుండా.. బ్యాకింగ్, ఆటో, ఎడ్యుకేషన్ రంగంలో కూడా లే ఆఫ్స్ కొనసాగుతున్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.