పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల వేళ ముడి చమురు ధర భారీగా పెరుగుతోంది. దీంతో స్టాక్ మార్కెట్లు బలహీనమైన సెంటిమెంట్ ను ఎందుర్కుంటున్నాయి. అయినప్పటికీ ఫార్మా రంగం మాత్రం పాజిటివ్ గా ముందుకెళ్తోంది. ఈ రంగం బలమైన కొనుగోళ్ల ఊపుతో సోమవారం ఫార్మా స్టాక్‌లు 20 శాతం వరకు పెరిగాయి. ఫార్మా స్టాక్‌ల ర్యాలీతో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ను 1.65 శాతం మేర పెరిగింది. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌లో టోరెంట్ ఫార్మాస్యూటికల్స్, మ్యాన్‌కైండ్ ఫార్మా ఒక్కొక్కటి 3 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. సిప్లా, డివిస్ లాబొరేటరీస్, లారస్ ల్యాబ్స్, ఆల్కెమ్ లాబొరేటరీస్, సాయి లైఫ్ సైన్సెస్ షేర్లు ఒక్కొక్కటి 2 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి.

Advertisement

జైడస్ లైఫ్‌సైన్సెస్, అరబిందో ఫార్మా, అజంతా ఫార్మా షేర్లు 1 శాతం కంటే ఎక్కువ లాభాలను నమోదు చేశాయి. ఇతర ఫార్మా స్టాక్‌లలో, ఆర్‌పిజి లైఫ్ సైన్సెస్, థైరోకేర్ టెక్నాలజీస్, హెస్టర్ బయోసైన్సెస్, వన్‌సోర్స్ స్పెషాలిటీ ఫార్మా, న్యూలాండ్ లాబొరేటరీస్ షేర్లు 7 శాతం వరకు పెరిగాయి. మొదటి త్రైమాసిక ఫలితాలు బాగుండడంతో తత్వ చింతన్ ఫార్మా కెమ్ షేరు ధర 20 శాతం పెరిగింది. షేరుకు రూ.1,714.10 కు పెరిగింది. ఇది 52 వారాల గరిష్ట స్థాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం తీవ్రతరం కావడం, ముడి చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో ప్రపంచ మార్కెట్లు క్షీణించి, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఫార్మా స్టాక్స్‌లో ర్యాలీ కనిపించింది.

Advertisement

స్థిరమైన దేశీయ డిమాండ్, కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్/యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడియంట్ సెగ్మెంట్ యాక్టివిటీలో కోలుకోవడంతో కంపెనీల ఆదాయాలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. Q1 FY27లో దేశీయ, కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్/యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడియన్స్ విభాగాలు వరుసగా 12.7 శాతం, 9.9 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గ్లోబల్ ప్లేయర్‌ల నుంచి పెరుగుతున్న డిమాండ్ కూడా కంపెనీలకు కలిసొస్తుంది.

CDMO/API సెగ్మెంట్ కీలక వృద్ధి ఇంజిన్‌గా మిగిలిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. భారతీయ CDMO ప్లేయర్‌లు బలమైన స్ట్రక్చరల్ క్యాపెక్స్ సైకిల్, పెప్టైడ్‌లు, ADCలు, అత్యంత శక్తివంతమైన APIల వంటి విభిన్న సామర్థ్యాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా ప్రయోజనం పొందుతారని అంచనా వేస్తున్నారు. ఫార్మా స్టాక్ లు ర్యాలీ అవుతున్న నేపథ్యంలో పెట్టుబడులు పెట్టొచ్చు అని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. వాల్యూవేషన్ ఎక్కువగా ఉంటే పెట్టుబడి పెట్టకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.