ఎస్‌బిఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓకు భారీ డిమాండ్ వచ్చింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ 140.11 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 22.51 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు 3.59 రెట్లు, వాటాదారులు 9.51 రెట్లు, ఉద్యోగులు 4.65 రెట్లు సబ్‌స్క్రైబ్ చేశారు. ఈ కంపెనీ తన ఐపిఓ ప్రారంభానికి ఒక రోజు ముందు సోమవారం యాంకర్ అలాట్‌మెంట్ ద్వారా రూ.2,663 కోట్లు సమీకరించి, ఒక్కో షేరుకు రూ.574 చొప్పున 46.3 మిలియన్ల షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించింది.

Advertisement

యాంకర్ కేటాయింపులో పాల్గొన్న ప్రముఖ సంస్థాగత పెట్టుబడిదారులలో బ్లాక్‌రాక్, గోల్డ్‌మన్ సాక్స్, హెచ్డ్పీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా , నోమురా ఇండియా, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ ఉన్నాయి. కంపెనీ తన ఐపీఓ ధరను ఒక్కో షేరుకు రూ.545-574 మధ్యగా నిర్ణయించింది. రూ.9,813 కోట్ల విలువైన ఈ ఐపీఓలో కంపెనీ ప్రమోటర్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అముండి ఇండియా హోల్డింగ్స్ వారు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా షేర్లు విక్రయిస్తున్నారు.

Advertisement

జూలై 21న మంగళవారం ఎస్‌బిఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఎస్‌బిఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ షేర్లు గ్రే మార్కెట్‌లో దాదాపు 18 శాతం ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. ఈ ఇష్యూకు గ్రే మార్కెట్ ప్రీమియం ఒక్కో షేరుకు రూ. 103గా ఉంది. ఐపీఓ అప్పర్ ప్రైస్ బాండ్ ప్రైస్ రూ.564 ఉండగా.. ఈ స్టాక్ రూ.677కు లిస్ట్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఐపీఓకు అప్లయి చేసుకున్న వారికి షేర్లు కేటాయించారు. జూలై 20లోగా డీమ్యాట్ ఖాతాలకు షేర్లను జమ చేయనున్నారు.

Advertisement

ఎస్‌బిఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ కంపెనీని 1992లో స్థాపించారు. ఎస్బీఐ, అముండిల ఉమ్మడి సంస్థ అయిన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్‌కు పెట్టుబడి నిర్వాహణ సంస్థగా పనిచేస్తుంది. 2025 నాటికి, ఈ కంపెనీ దాదాపు రూ. 16.32 లక్షల కోట్ల ఆస్తుల (ఏయూఎం) నిర్వహిస్తోంది. ఈ కంపెనీకి భారతదేశ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో 15.5 శాతం మార్కెట్ వాటా ఉంది. ఈ ఐపీఓల ఒక లాట్ వచ్చిన వారికి లిస్టింగ్ రోజు రూ.2500 పైగా లాభం వచ్చే అవకాశం ఉంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.