ఉద్యోగం చేస్తున్న దాదాపు అందరికీ ఈపీఎఫ్ఓ ఖాతా ఉంటుంది. ఖాతాదారుడు, యజమాని నెలకు కొంత మొత్తం పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం మనం చెల్లించే మొత్తంపై వడ్డీ చెల్లిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈపీఎఫ్ గరిష్ట పరిమితి రూ.15 వేలు ఉండేది. తాజాగా ఈపీఎఫ్ గరిష్ట వేతన పరిమితి రూ.25 వేలకు పెంచేందుకు కేంద్ర కార్మిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గత 12 ఏళ్లుగా ఈపీఎఫ్ గరిష్ట వేతన పరిమితి రూ.15 వేలుగా ఉంది. ఈ 12 సంవత్సరాల్లో జీవన వ్యయం పెరిగినప్పటికీ వేతన పరిమితి పెరగలేదు. ఉద్యోగ సంఘాలు వేతన గరిష్ట పరిమితిని పెంచాలని ఎప్పటి నుంచో కోరుతున్నాయి.

Advertisement

దీనిపై కేంద్ర ప్రభుత్వం పలుమార్లు చర్చించినట్లు తెలిసింది. కార్మిక శాఖ గరిష్ట వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ గరిష్ట వేతన పరిమితిని త్వరలో పెంచేందుకు కార్మిక శాఖ సిద్ధమవుతోంది. కేంద్రం ఇప్పటికే ఈపీఎఫ్-26, ఈపీఎస్-26 తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గరిష్ఠ వేతన పరిమితి పెంచేందుకు ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతించినట్లు వార్తలు వస్తున్నాయి. కార్మిక శాఖ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకు కొంత సమయం పడుతుందని భావిస్తున్నారు.

Advertisement

ఈపీఎఫ్ గరిష్ఠ వేతన పరిమితి రూ.25 వేలకు పెరగడం వల్ల ఉద్యోగి పీఎఫ్‌ ఖాతాలో జమయ్యే మొత్తం పెరగనుంది. గరిష్ట వేతన పరిమితి రూ.15 వేలు ఉన్నప్పుడు ఉద్యోగి వేతనం నుంచి 12% చొప్పున అంటే రూ.1,800 జమ చేసేవారు. గరిష్ట వేతన పరిమితిరూ.25 వేలకు పెంచితే.. ఇందులో 12% చొప్పున అంటే ఖాతాలో జమ అయ్యే మొత్తం రూ.3 వేలకు పెరిగే అవకాశం ఉంది.
ఉద్యోగి చందాతో సమానంగా యజమాని 12 శాతం మొత్తాన్ని ఉద్యోగి ఈపీఎఫ్‌ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. చాలా వరకు కంపెనీల్లో ఉద్యోగి ఖాత నుంచి చందాదారుడు, యజమాని చందా కట్ చేస్తున్నారు. ఒక వేళ ఒక ఉద్యోగికి రూ.25 జీతం వస్తే.. గరిష్ట వేతన పరిమితి పెంచితే.. ఆ ఉద్యోగి జీతంలో రూ.6 వేలు కట్ అవుతుంది.

Advertisement

కాగా మీరు చెల్లించిన మొత్తం 8.33 శాతం పింఛను నిధికి జమ అవుతుంది. మిగతాది ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. గరిష్ఠ వేతన పరిమితి రూ.25 వేలకు పెరగడం వల్ల చందాదాదురు చెల్లించే మొత్తం పెరుగుతుంది. ఫలితంగా పదవీ విరమణ తర్వాత చేతికి వచ్చే పింఛనూ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో కనీస పింఛన్ పై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కనీస పెన్షన్ రూ.1000 గా ఉంది. దీన్ని రూ.7500లకు పెంచాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది.ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ 1995 ప్రకారం పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.1000 ఇస్తున్నారు. అయిత రూ.1000 తో ఎలా బతుకుతారని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ పెన్షన్ కంటే.. రాష్ట్రాల్లో ఇచ్చే పింఛన్లు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి. కనీస పెన్షన్ రూ.1000 నుంచి రూ.7,500 లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.