మీకు సీకేవైసీ అంటే ఏమిటో తెలుసా.. సీకేవైసీ అంటే సెంట్రల్ నో యువర్ కస్టమర్. ఇది 14 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఇది బ్యాంక్, ఇతర ఆర్థిక ఖాతాలను సులభంగా, పారదర్శకంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. పదే పదే బ్యాంకుల్లో కేవైసీ లేకుండా సీకేవైసీని తీసుకొచ్చారు. ఈ 14 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య వివిధ బ్యాంకులలో ఖాతా తెరిచే ప్రక్రియను సరళతరం చేస్తుంది. ఆర్థిక లావాదేవీలను సులభతరం చేస్తుంది. ఇతర ఆర్థిక సంస్థలలో ఖాతాలను తెరవడంలో సహాయపడుతుంది.

Advertisement

CKYC నంబర్ అనేది 'సెంట్రల్ KYC రికార్డ్స్ రిజిస్ట్రీ' (CKYCR)లో భద్రపరిచి ఉంటుంది. మీ KYC వివరాలు ఒకసారి నమోదైన తర్వాత, ఆర్థిక సంస్థలు మీ అనుమతితో అవసరమైనప్పుడు ఆ వివరాలను పొందవచ్చు. దీనివల్ల ప్రతిసారీ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం ఉండదు. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలన్నా, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలన్నా కేవైసీ అడుగుతారు. ఇందుకు కోసం ఆధార్, పాన్ కార్డులు పట్టుకుని డాక్యుమెంట్ల జిరాక్స్‌లు సమర్పించాల్సి ఉంటుంది. ఇలా ప్రతిసారి చేయాలన్న ఇబ్బంది. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 14 అంకెలతో కూడిన 'సెంట్రల్ కేవైసీ' (CKYC) నంబర్ తీసుకొచ్చింది.

Advertisement

దీనివల్ల కాగితపు పని తగ్గుతుంది. సమయం వృథా కాదు. సీకేవైసీ నంబర్‌ను పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. సీకేవైసీ నంబర్ సమాచారం కోసం మీ బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థను సంప్రదించవచ్చు. లేదా 7799022129 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చు. దీని ద్వారా మీరు మీ CKYC నంబర్‌ను తెలుసుకోవచ్చు. మీరు https://www.ckycindia.in/ckyc/index.php లింక్ ద్వారా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. CKYC స్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ సూచిస్తోంది.

సీకేవైసీ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. మీరు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి డీ మ్యాట్ ఖాతా ఓపెన్ చేయాలంటే.. కేవైసీ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలంటే.. ఇక్కడ కేవైసీ చేయాలి. అయితే సీకేవైసీ నంబర్ ఉంటే.. ఎక్కడ కేవైసీ అవసరం లేకుండా సీకేవైసీ నంబర్ చెబితే సరిపోతుంది. సీకేవైసీలో మీ వివరాలు అన్ని సెంట్రల్ కేవైసీ రికార్డ్స్ రిజిస్ట్రీ సేవ్ ఉంటుంది. సి-కేవైసీ అనేది భారతీయ ఆర్థిక వ్యవస్థలో కస్టమర్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉపయోగపడనుంది.

Advertisement

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.