ఉద్యోగం చేసే దాదాపు అందరికి ఫీఎఫ్ అకౌంట్ ఉంటుంది. ఫీఎఫ్ ఖాతాలోకి నెలనెలా కొంత మొత్తం జమ చేస్తారు. ఉద్యోగులు జమ చేస్తున్న మొత్తానికి కేంద్ర వడ్డీ చెల్లిస్తుంది. అయితే చాలా మందికి పీఎఫ్ డబ్బులు కట్ అవుతున్నాయా లేదా తెలియదు. కొన్ని కంపెనీలు ఉద్యోగుల పీఎఫ్ కు సంబంధించి ఎలాంటి సమాచారం ఉద్యోగులకు ఇవ్వవు. దీంతో పీఎఫ్ కట్ అవుతుందా.. కట్ అయితే ఎంత కట్ చేస్తున్నారని తెలియకుండా పోతుంది. అందుకే పీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు మీ పే స్లిప్ లో పీఎఫ్ యూఏఎన్ నంబర్ ఉంటుంది. దాన్ని మీరు తెలుసుకోవాలి.
పే స్లిప్స్ లేని వారు.. కనీసం యూఏఎన్ నంబర్ తెలుసుకుంటే మీరు.. మీ పీఎఫ్ ఖాతాకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. మీరు పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడం చాలా సులభం. మొదటగా మీరు https://www.epfindia.gov.in/site_en/ వెబ్ సైట్ కు వెళ్లాలి. అక్కడ సర్వీస్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై కర్సర్ పెడితే ఎంప్లాయిస్ అని వస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మెంబర్ యూఏఎన్ / ఆన్ లైన్ సర్వీస్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. మొదటగా మీరు యూఏఎన్ నంబర్ ను యాక్టివేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. యూఏఎన్ నంబర్ ఎంటర్ చేసి పాస్ వర్డ్ టైప్ చేస్తే లాగిన్ అవుతుంది. అక్కడ మీరు పాస్ బుక్ పై క్లిక్ చేస్తే మీరు నెలనెలా ఎంత చెల్లిస్తున్నారు. మీకు ఎంత వడ్డీ వచ్చింది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత మీరు వెబ్ సైట్ వెళ్లాల్సిన అవసరం ఉండదు. మీ మొబైల్ లో ఉమాంగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో ఈపీఎఫ్ఓ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి యూఏఎన్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత సడ్మిట్ చేస్తే మీ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీరు మీ పాస్ బుక్ చెక్ చేసుకోవచ్చు. పాస్ బుక్ డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు.
మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా మీరు పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. పీఎఫ్ ఖాతాకు లింక్ అయి ఉన్న నంబర్ ద్వారా మీరు 996604442 ఫోన్ చేయాలి. రెండు రింగ్ ల తర్వాత ఫోన్ కట్ అవుతుంది. ఆ తర్వాత పీఎఫ్ బ్యాలెన్స్ మీకు మెసేజ్ వస్తుంది. ఎస్ఎంఎస్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899' నంబరుకు మెసేజ్ చేయాలి.'EPFOHO UAN' అని టైప్ చేసి దాని పక్కనే మీ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసి మెసేజ్ పంపిస్తే చివరిగా మీ ఖాతాలో జమ అయిన మొత్తం, ప్రస్తుత బ్యాలెన్స్ వంటి వివరాలను ఈపీఎఫ్‌ఓ పంపిస్తుంది. అయితే మీరు ఉమాంగ్, మిస్ట్ కాల్, ఎస్ఎంఎస్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తనిఖీ చేయాలనుకుంటే.. యూఏఎన్ నంబర్ యాక్టివేట్ అయి ఉండాలి.
More Articles
- EPFO: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ గరిష్ట వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు..!
- EPFO: పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్.. క్లెయిమ్ చేయకుండానే బ్యాంకు ఖాతాల్లో జమ కానున్న నిధులు..!
- EPFO: కంపెనీ మారితే పీఎఫ్ ఖాతాను ఎలా బదిలీ చేసుకోవాలి..!
- EPS: ఎంప్లాయ్ పెన్షన్ స్కీమ్ కనీస పెన్షన్ రూ.1000 నుంచి రూ.7500 పెంపు..!
- EPFO: పీఎఫ్ కాంట్రిబ్యూషన్ తగ్గించుకుంటున్నారా అయితే లక్షల్లో నష్టపోతారు..!
- EPFO: ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఆటోమేటిక్గా నిధుల బదిలీ..!