ఉద్యోగం చేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగికి దాదాపు పీఎఫ్ ఖాతా ఉంటుంది. ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెలా పీఎఫ్ ఖాతాలో కొంత మొత్తం జమ చేస్తారు. అలాగా యాజమాన్యం కూడా కొంత మొత్తం ఉద్యోగి పేరుపై పీఎఫ్ ఖాతాల జమ చేస్తుంది. ఈ జమ చేసిన మొత్తానికి కేంద్ర ప్రభుత్వం వడ్డీ కూడా చెల్లిస్తుంది. ప్రస్తుతం పీఎఫ్ నిధులపై 8.25 శాతం చెల్లిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ డబ్బులను వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ ఎఫ్ ఖాతాలోని డబ్బులు అత్యవసరమైనప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే కొంత మొత్తం వారికే విత్ డ్రా చేసుకునే అవకాశం.
పీఎఫ్ ఖాతా ఉన్నవారికి మరో ప్రయోజనం ఉంది. అదే ఉచిత బీమా. అవును ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా ఉద్యోగి ఇన్సూరెన్స్ పొందవచ్చు. పీఎఫ్ ఖాతాదారుడు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే గరిష్ఠంగా రూ.7 లక్షల ఉచిత బీమా వస్తుంది. ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ద్వారా పీఎఫ్ చందాదారులకు ఉచిత బీమా కల్పిస్తున్నారు. అయితే ఉద్యోగం చేస్తూ.. నెల నెలా పీఎఫ్ చెల్లించిన వారే ఈ బీమా పథకానికి అర్హులు. ఉద్యోగంలో ఉన్నప్పుడు మరణిస్తేనే బీమా సొమ్ము వస్తుంది.
బీమా ఎంత వస్తుందనే.. ఉద్యోగి వస్తున్న జీతం, పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తంపై అధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం కింద సర్వీసులో ఉన్న ఉద్యోగి మరణిస్తే.. అతని నామినీకి కనీస బీమా మొత్తం రూ.2,50,000 నుంచి గరిష్టంగా రూ.7 లక్షల వరకు వస్తుంది. ఒకవేళ ఉద్యోగం చేస్తూ పీఎఫ్ చెల్లిస్తున్న క్రమంలో.. సంవత్సరంలోపే ఉద్యోగి మరణిస్తే నామినీకి కనీసం రూ.50,000 బేస్ ప్రొటెక్షన్ వస్తుంది. ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకానికి ఉద్యోగి ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. కంపెనీ యజమాని మాత్రమే మీ బేసిక్ జీతం, ప్లస్ డీఏ నుంచి 0.5% అంటే నెలకు గరిష్ఠంగా రూ.75 మించకుండా చెల్లిస్తారు. మీ జీతం స్లిప్‌లో దీనికి సంబంధించిన ఎలాంటి కోతలు కనిపించవు. 200 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు పని చేస్తున్న కంపెనీలు ఈపీఎప్ఓ పరిధిలోకి వస్తాయి. వీరందరికి ఈ నిబంధన వర్తిస్తుంది.
ఉద్యోగి మరణించిన తర్వాత నామినీ ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఫామ్ 5 IF ని పూర్తి చేసి, సదరు కంపెనీ యాజమాన్యం చేత ధృవీకరించుకోవాలి. రీజనల్ పీఎఫ్ ఆఫీస్‌లో దాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే 20 నుంచి 30 రోజుల్లోనే డబ్బులు నామినీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అయితే చాలా మంది ఉద్యోగులు ఇప్పటికీ నామినీ యాడ్ చేయలేదని తెలుస్తోంది. ఇప్పటికీ నామినీ యాడ్ చేయని వారు ఉంటే వెంటనే చేసుకోవాలని పీఎఫ్ అధికారులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- EPFO News: ఈపీఎఫ్, ఈఎస్ఐసీపై మోదీ సర్కార్ ఫోకస్.. ఉద్యోగులకు లాభమా.. నష్టమా?
- EDLI Scheme: మీరు ఉద్యోగం చేస్తున్నారా.. ప్రీమియం చెల్లించకుండానే రూ.7 లక్షల ఇన్సూరెన్స్.. !
- EPFO: ఏప్రిల్ లో 8.87 లక్షల మందికి ఉద్యోగాలు..!
- EPFO: శుభవార్త చెప్పిన ఈపీఎఫ్ఓ.. క్లైమ్ చేయాలంటే ఇక ఆ అవసరం లేదు..
- EPFO: ఈపీఎఫ్ఓలో కొత్తగా చేరిన 8.41 లక్షల మంది సభ్యులు..
- PF: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.. అయితే ఇలా బ్యాలెన్స్ చెక్ చేసుకోండి..