ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్‌ కొనుగోలు, మరింత సులభం

మనిషికి జీవితా బీమా అవసరం. ఐతే మనం తీసుకునే జీవితబీమా మనకు ఏవిధంగా ఉపయోగపడుతుందో ఆలోచించాలి. మన దేశంలో చాలా కంపెనీలు జీవితబీమాలను అందిస్తున్నాయి. ఐతే మనం ఎంచుకునే జీవితబీమా ఖచ్చితమైనదిగా ఉండాలి.

Advertisement

అసలు మనం ఏ అవసరం కోసం జీవితబీమా తీసుకుంటున్నాం, ఎంత వరకూ రిస్క్ తీసుకోగలం అన్న అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి. దేశ వ్యాప్తంగా ఉన్న పలు కంపెనీలు వివిధ రకాలైన ఇన్సూరెన్స్ సర్వీసులను అందిస్తున్నాయి.

Advertisement

కారు ఇన్సూరెన్స్:

భారత్‌లో కారు ఇన్సూరెన్స్ తప్పనిసరి. ప్రమాదం జరిగినప్పుడు ఆర్ధిక పరమైన నష్టం వాటిల్లకుండా కారు ఇన్సూరెన్స్ రక్షిస్తుంది. ఇది మీకు, ఇన్సూరెన్స్ సంస్థ మధ్య ఒక ఒప్పందం. మీ పాలసీలో పేర్కొన్న ప్రకారం మీరు ప్రీమియం చెల్లించేందుకు అంగీకరిస్తారు. దీని ప్రకారం ప్రమాదాల వలన జరిగే నష్టాలకు చెల్లించడానికి ఇన్సూరెన్స్ సంస్థ అంగీకరిస్తుంది.

టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్:

టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది జీవితాంతం బీమా కవరేజీ కల్పిస్తుంది. ఈ ఇన్సూరెన్స్‌లో .. ప్రీమియాలు సరిగ్గా కడితే, దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు ఈ పాలసీలు ఉపయోగపడతాయి. టర్మ్ ఇన్సూరెన్స్‌లో ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ప్యూర్ హోల్ లైఫ్ అనీ లిమిటెడ్ పేమెంట్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనీ రెండు రకాలు ఉంటాయి.

Advertisement

ప్యూర్ హోల్ లైఫ్ పాలసీల్లో చివరిదాకా ప్రీమియాలు కట్టాల్సి ఉంటుంది. అదే రెండో రకం దాంట్లో ప్రీమియాలు కొంత కాలం దాకానే కట్టాల్సి ఉంటుంది. కవరేజీ మాత్రం చివరిదాకా కొనసాగుతుంది. యుక్త వయసులో ఉన్నడే ఇలాంటివి తీసుకుంటే వార్షిక ప్రీమియాలు తక్కువ ఉంటాయి.

మనీ బ్యాక్ ఇన్సూరెన్స్:

టర్మ్‌ పాలసీ కాలంలో, బీమా చేయించిన వారు హామీ ఇవ్వబడిన మొత్తంలో స్థిరభాగాన్ని (శాతం) రెగ్యులర్‌ ఇంటర్వెల్స్‌లో అందుకుంటారు. టర్మ్‌ పాలసీ కాలంలో అందుకునే ఈ డబ్బుకు పన్ను మినహాయింపు ఉంటుంది.

టర్మ్‌ పాలసీ ఉనికిలో ఉన్న కాలంలో లేదా మెచూరిటి అవుతున్న కాలంలో, బీమా చేయించిన వ్యక్తి టర్మ్‌ పాలసీ కోసం హామీ ఇవ్వబడిన మొత్తం, బోనస్‌లలో మిగిలి ఉన్న మొత్తాన్ని అందుకుంటారు. బీమా చేయించిన వ్యక్తి మరణించినప్పుడు, పాలసీ అమలులో ఉండే సంవత్సరాల పాటు హామీ ఇవ్వబడిన పూర్తి మొత్తం, బోనస్‌ను అందుకుంటారు.

Advertisement

ఛైల్డ్ ప్లాన్స్:

పిల్లవాడు ముందే నిర్ధారించబడిన సమయానికి హామీ ఇవ్వబడిన మొత్తం మరియు బోనస్‌ (అలాంటిది ఉంటే) అందుకుంటాడు. ప్రతిపాదించినవారు చనిపోయినా లేదా బతికి ఉన్నా, దానితో పనిలేకుండా ఈ డబ్బు అందించబడుతుంది.

అలాంటి పాలసీని ప్రతిపాదించినవారు తండ్రి కావచ్చు, ఇతడు పాలసీ కోసం ప్రీమియంని చెల్లిస్తాడు. ప్రతిపాదకుడు మరణించిన సందర్భంలో, సాధారణంగా కుటుంబంచే తదుపరి ప్రీమియంలు చెల్లించనవసరం లేదు.

ఏమయినప్పటికీ, పాలసీ రకంపై ఆధారపడి, పిల్లవాడు బీమా చేయించిన వ్యక్తి మరణించిన సందర్భంలో హామీ ఇవ్వబడిన మొత్తాన్ని అందుకోవచ్చు.

క్లిష్టమైన అనారోగ్యం:

ఒక్కో సమయంలో కుటుంబ సభ్యులకు ఏదైనా ప్రమాదం జరగొచ్చు. ప్రమాద సమయంలో తీవ్రంగా గాయపడొచ్చు. ఇలాంటి సందర్భంలో క్లిష్టమైన అనారోగ్య ఇన్సూరెన్స్ ఉంటే ఎంతో ఉపయోగం. హెల్త్ ఇన్సూరెన్స్‌తో పాటు దీనికి అదనంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

ఆరోగ్య స్ధితిని బట్టి మీరు చెల్లించాల్సిన ప్రీమియం ఆధాపడి ఉంటుంది. మీరు ఇన్సూరెన్స్ తీసుకున్న కంపెనీకే పరిమితమై ఉంటే బాగుంటుంది.

ట్రావెల్ ఇన్సూరెన్స్:

ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ను నిర్లక్ష్యం చేయకూడదు. మారిన కాలంలో ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఒక అవసరం అనే కన్నా ఒక తప్పనిసరి నియమం. కొన్ని దేశాలైతే ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఉన్న వారినే తమ దేశంలోకి అనుమతిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

షెంజెన్‌ దేశాలు (యూరప్‌ ప్రాంతంలోని 26 దేశాలు) వీసాతో పాటుగానే ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ పత్రాలు కూడా పరిశీలిస్తున్నాయి. అవి లేకపోతే నిర్మొహమాటంగా వీసా తిరస్కరించేస్తాయి. విదేశీ ప్రయాణానికి ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు సమగ్ర కవరేజ్‌ కల్పిస్తాయి.

Advertisement

హెల్త్ ఇన్సూరెన్స్:

ఈ రోజుల్లో ఆరోగ్య బీమా తప్పనిసరి. ఎందుకంటే, మనకు అవసరం పడినప్పుడు ఆరోగ్య లభించకపోవచ్చు. కాబట్టి యుక్త వయసులో, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియానికే అధిక కవరేజి లభిస్తుంది. వయసు మీద పడ్డ తర్వాత కన్నా యుక్త వయసులో పాలసీ తీసుకున్నప్పుడు విస్తృతమైన కవరేజి లభిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ప్రీమియం పెరుగుతుంది.

చాలా కంపెనీల హెల్త్ ప్లాన్లకు వయసుపై పరిమితి ఉంటుంది. అంటే, రిటైర్మెంట్ దగ్గరపడుతున్న కొద్దీ కవరేజీ పరిధి తగ్గిపోతుంటుంది.ఇంకో విషయం ఏమిటంటే ఏదైనా సంవత్సరంలో క్లెయిము చేయకపోయిన పక్షంలో పాలసీని రెన్యువల్ చే సుకునేటప్పుడు నో క్లెయిమ్ బోనస్ కూడా లభిస్తుంది.

ఎండోమెంట్ పాలసీ:

టర్మ్, హోల్ లైఫ్ ప్లాన్ల కన్నా ఇవి మరింత ఖరీదైనవి. పాలసీ వ్యవధి ముగిసిపోయిన తర్వాత కూడా పాలసీదారు జీవించి ఉన్న పక్షంలో పాలసీ మొత్తంతో పాటు బోనస్‌లు కూడా కంపెనీ చెల్లిస్తుంది. అదే పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణించిన పక్షంలో ఆ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తుంది. ఇక ఎండోమెంట్ పాలసీల్లో తీవ్ర అనారోగ్యం పాలైనా, ప్రమాదవశాత్తు మరణం సంభవించినా, తాత్కాలికంగా లేదా శాశ్వత అంగ వైకల్యం సంభవించినా ఎదుర్కొనేందుకు ఉపయోగపడేలా రైడర్లను తీసుకోవచ్చు.

టూవీలర్ ఇన్సూరెన్స్:

భారత్‌లో ద్విచక్ర వాహన ఇన్సూరెన్స్ తప్పనిసరి. ప్రమాదాలెప్పుడు చెప్పి రావు కాబట్టి బీమా తప్పనిసరి. కొత్త వాహనం కొన్న తర్వాత బీమా లేకుంటే రిజిస్ట్రేషన్‌ చేయరు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బీమా చేయించుకుంటే మంచిది.

ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ప్రకారమైతే, ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.1,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. సమగ్రవంతమైన రోడ్డు భద్రత కోసం మోటార్ వాహన చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించే వారిపై శిక్షలు/జరిమానాలను మరింత కఠినతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 'కొత్త రోడ్డు భద్రత, రవాణా బిల్లు-2014' పేరుతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టింది.

పెన్షన్ ప్లాన్స్:

మనిషి తన జీవితంలో చివరి క్షణాలను ఆనందంగా జీవించాలంటే పెన్షన్ అవసరం. జీవన కాలపు అంచనా రేటు పెరుగుతుండటం, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరగుతుండటం, భారతదేశంలో సామాజిక భద్రతా వ్యవస్థ లేకపోవడం, ఉమ్మడి కుటుంబాలు విడిపోవడం వంటి ముఖ్య కారణాలు పదవీవిరమణ ప్రణాళికను బాగా క్లిష్టతరం చేస్తున్నాయి.

మీ జీవితం పదవీ విరమణ తర్వాతి కాలం ఆనందమయం చేసుకోవడంలో ఈ పెన్షన్ ప్లాన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. జీవిత కాలం కాకుండా ముందుగా నిర్దేశించుకున్న కాలానికి పెన్షన్ లభించే విధంగా కూడా ఎంచుకోవచ్చు. ఇందులో కాలపరిమితి తీరిన తర్వాత పాలసీదారుడు జీవించి ఉన్నా పెన్షన్ రాదు. అలా కాకుండా ఎంచుకున్న కాలపరిమితి లోపే పాలసీదారుడు మరణిస్తే కాలపరిమితి ముగిసేవరకు నామినీకి పెన్షన్ లభిస్తుంది.

వ్యక్తిగత ప్రమాద బీమా:

వ్యక్తిగత ప్రమాద బీమా ఎంతైనా అవసరం. ఈ బీమా చేయించుకున్న వారు మరణించేంతవరకు ప్రీమియంలు నిరంతరం చెల్లించబడతాయి. ప్రమాద రక్షణ అనేది మొత్తం జీవిత కాలానికి సంబంధించినది మరియు జీవిత బీమా మొత్తం ఏ సమయంలో అయినా బీమా చేయించిన వ్యక్తి మరణించినట్లయితే జీవిత బీమా చేసిన మొత్తాన్ని చెల్లించబడుతుంది.

ఇందులో ప్రీమియంలు పరిమిత, స్వల్ప కాలాలలో చెల్లించబడతాయి. బీమా చేయించుకున్న వ్యక్తి ఐచ్ఛికం లేదా మరణం ఏది ముందుగా సంభవిస్తే అది వర్తింపవుతుంది. ప్రమాద రక్షణ అనేది బీమా చేయించిన వ్యక్తి జీవితం పొడవునా అమలవుతుంది

English Summary

stocks