For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీ రిట‌ర్నులు దాఖ‌లు చేసే ముందు ఇవి తెలుసుకోండి

అంద‌రు ఆదాయపు ప‌న్ను చెల్లింపుదార్లు త‌మ ప‌న్నుల‌కు ఆన్‌లైన్‌లో రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేయ‌వ‌చ్చు. కొన్ని మిన‌హాయింపుల‌తో అంద‌రూ ఐటీ రిట‌ర్నుల‌ను ఆన్‌లైన్లో స‌మ‌ర్పించాల్సిందే

|

అంద‌రు ఆదాయపు ప‌న్ను చెల్లింపుదార్లు త‌మ ప‌న్నుల‌కు ఆన్‌లైన్‌లో రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేయ‌వ‌చ్చు. కొన్ని మిన‌హాయింపుల‌తో అంద‌రూ ఐటీ రిట‌ర్నుల‌ను ఆన్‌లైన్లో స‌మ‌ర్పించాల్సిందే. ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులను అంద‌రూ జులై 31,2017లోపు దాఖలు చేయాల్సిందే. ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసేముందు చేయాల్సిన కొన్ని ప‌నులు ఇవి.

మొత్తం ఆదాయం ఎంత‌?

మొత్తం ఆదాయం ఎంత‌?

మొద‌ట మీ మొత్తం వేత‌నం ఎంతో తెలుసుకోండి. అందులోని మిన‌హాయింపులు పోను మీ ట్యాక్స‌బుల్ ఇన్‌క‌మ్ ఎంతుందో చూడండి. ఏప్రిల్ 2016 మొద‌లుకొని ఈ ఏడాది మార్చి వ‌ర‌కూ ఉన్న పే స్లిప్‌లు తీసుకుని సంవ‌త్స‌ర ఆదాయం, ప‌న్ను సంక్ర‌మించే ఆదాయాన్ని లెక్కించండి. ఒక వేళ మీరు మ‌ధ్య‌లో ఉద్యోగాలు మారిన‌ట్ల‌యితే దానికి సంబంధించిన అన్ని వివ‌రాల‌ను ఒక‌చోట ఉంచుకోండి.

 ఎంత పన్ను చెల్లించారో తెలుసుకోవ‌డం ఎలా?

ఎంత పన్ను చెల్లించారో తెలుసుకోవ‌డం ఎలా?

ఈ వివ‌రాల‌ను మీరు ఆన్‌లైన్‌లోనే తెలుసుకోవ‌చ్చు. www.incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్లోకి వెళ్లి ఫారం 26 ఏఎస్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే స‌రిపోతుంది.

ఇప్ప‌టి దాకా మీరు ఈ వెబ్‌సైట్లో న‌మోదు అయి ఉండ‌క‌పోతే వెంట‌నే చేసుకోండి.

మీ యాజ‌మాన్యం ఎంత ప‌న్ను వ‌సూలు చేసి, ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు జ‌జ చేసింది అనే వివ‌రాలు అక్క‌డ ఉంటాయి. మీ దగ్గ‌ర నుంచి వ‌సూలు చేసిన ప‌న్నుకు, ఫారం 26 ఏఎస్‌లో ఉన్న దానికి తేడాలు ఉంటే హెచ్ఆర్‌, ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌ను సంప్ర‌దించండి. వ్య‌త్యాసం ఎందుకు ఉందో తెలుసుకోండి.

అద్దెకు ఉంటున్నారా?

అద్దెకు ఉంటున్నారా?

మీరు చెల్లించే అద్దెకు సైతం ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. వేత‌నంలో భాగంగా హెచ్ఆర్ఏగా కొంత శాతాన్ని కంపెనీలు చెల్లిస్తాయి. మీరు వాస్త‌వంగా ఎంత క‌డుతున్నారో, మీకు యాజ‌మాన్యం ఎంత ఇస్తుందో వ్య‌త్యాసాన్ని చూసుకోవాలి. ఆన్‌లైన్‌లో ల‌భించే కొన్ని కాలిక్యులేట‌ర్ల సాయంతో హెచ్ఆర్ఏ మిన‌హాయింపు ఎంత వ‌ర‌కూ పొంద‌వ‌చ్చో తెలుసుకోవాలి.

మిన‌హాయింపులు

మిన‌హాయింపులు

చాలా ర‌కాల పెట్టుబ‌డుల‌కు ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపులు ఉన్నాయి. మీ పెట్టుబ‌డుల‌కు సంబంధించిన ప‌త్రాలు, సెక్ష‌న్ 80సీ మిన‌హాయింపుల‌ను లెక్కించుకోండి. సెక్ష‌న్ 80సీ కింద బీమా ప్రీమియం, ఈపీఎఫ్‌, పీపీఎఫ్‌; 80 డీ కింద మెడిక‌ల్ ఇన్సూరెన్స్ ప్రీమియం, 80ఈ కింద విద్యా రుణానికి చెల్లించే వ‌డ్డీ వంటి వాటికి ప‌న్ను మిన‌హాయింపు పొందే సౌల‌భ్యం ఉంది. ఐటీ రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌డం ఎలా?

ఇత‌ర ఆదాయ మార్గాలు

ఇత‌ర ఆదాయ మార్గాలు

మీకు ఉద్యోగంలో ల‌భించే ఆదాయ‌మే కాకుండా, ఇత‌ర మార్గాల్లో ఏదైనా ఆదాయం ఉంటే వాటిని ప‌న్ను సంక్ర‌మించే ఆదాయంలో చూపించాల్సిందే. ఇత‌ర ఆదాయ మార్గాలంటే ఎఫ్‌డీల నుంచి వ‌చ్చే వ‌డ్డీ, అద్దె ఆదాయం లాంటివి.

Read more about: it returns taxes tax
English summary

ఐటీ రిట‌ర్నులు దాఖ‌లు చేసే ముందు ఇవి తెలుసుకోండి | what to see before filing it returns

All income tax assessees—including individuals, Hindu Undivided Families (HUFs), professionals, Trusts, firms and companies—can now file their tax returns online. With a few exceptions, it is mandatory for all taxpayers to file returns online. Here are the steps to follow when you file your tax return
Story first published: Tuesday, July 11, 2017, 11:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X