For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్ర‌యాణ బీమాతో మీ విహార యాత్ర‌కు భ‌రోసా

ఆరోగ్య విష‌యంలో కొంత మందికి కొన్ని ప్ర‌దేశాల్లో స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఒక్క ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే ఇటువంటి సమ‌స్య‌ల‌కు అన్నింటికీ ఒక్కసారిగా చెక్ చెప్ప‌వ‌చ్చు. ట్రావెల్ ఇన్సూరెన్స్ గురించి ప‌లు ఆస‌క్

|

ఇప్ప‌ట్లో మ‌ధ్య త‌ర‌గ‌తి వారు సైతం సంపాద‌న‌ను పెంచుకునేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. గ‌జిబిజి జీవితం నుంచి అప్పుడప్పుడు కాస్త విశ్రాంతి పొందేందుకు విహార యాత్ర‌ల‌కు వెళుతున్నారు. కొంత మంది దేశంలోనే కొత్త ప్ర‌దేశాల‌ను చూసేందుకు ఆస‌క్తి చూపుతుండ‌గా, మ‌రికొంత మంది స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో విదేశీ ట్రిప్‌ల‌కు ఆస‌క్తి చూపుతున్నారు. విదేశీ ప్ర‌యాణాలంటే ఆషామాషీ కాదు. అన్ని ప‌త్రాలు, ల‌గేజీ స‌రిగా ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్య విష‌యంలో కొంత మందికి కొన్ని ప్ర‌దేశాల్లో స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఒక్క ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే ఇటువంటి సమ‌స్య‌ల‌కు అన్నింటికీ ఒక్కసారిగా చెక్ చెప్ప‌వ‌చ్చు. ట్రావెల్ ఇన్సూరెన్స్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు మీ కోసం...

ఎలాంటి వాటికి రక్ష‌ణ‌

ఎలాంటి వాటికి రక్ష‌ణ‌

మీరు విదేశ ప్రయాణం చేసినప్పుడు జరిగే ఆర్ధిక నష్టాలకు, ప్రయాణ భీమా రక్షణ కల్పిస్తుంది. మీరు విదేశాలకు , రకరకాల పనుల మీద వెళ్ళవచ్చు. ఉదాహరణకు, సెలవులు గడపడానికి, విద్యకై లేక మీ ముఖ్యమైన వ్యాపార సమావేశం కొరకు. ఈ కాల వ్యవధిలో, మీకు విదేశీ ప్రయాణ భీమా అందుబాటులో ఉంటుంది. ఈ పాలసీ మిమ్మిల్ని, ప్రయాణ సామాను పోయినప్పుడు, ఆకస్మిక వైద్యం, ప్రమాదం నుండి రక్షణ కల్పిస్తుంది.

పాల‌సీ వ‌ర్తింపు

పాల‌సీ వ‌ర్తింపు

ప్రయాణ భీమా, పాలసీ పేర్కొన్న తేదీ నుండి గాని, లేక మీకు విదేశీ ప్రయాణం చేయడానికి బయల్దేరిన సమయానికి లేక పాలసీలో పేర్కొన్న ప్రయాణమయ్యే తేదీ నుండి గాని ఏది ఆఖరు దయితే దాని నుండి మొదలు అవుతుంది. ప్రయాణ భీమా, భీమాకాల వ్యవధి ముగిసే దాకా లేక భీమా చేసిన వ్యక్తి భారతదేశం తిరిగి వచ్చే సమయం దాకా (ఏది ముందు అయితే అది) అమలులో ఉంటుంది. కాని, కొన్ని భీమా కంపెనీలు, భీమా పాలసీ యొక్క రక్షణ, పాలసీ దారుల ప్రయాణం కొన్ని పరిస్ధితుల వలన ఆలస్యమైనా వారికి వర్తింపచేస్తాయి.

థ‌ర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేట‌ర్‌(టీపీఏ)

థ‌ర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేట‌ర్‌(టీపీఏ)

మీరు ఒక ప్రయాణానికిగాని, లేక అనేక ప్రయాణాలకు గాని ప్రయాణ భీమాను ఎంచుకొనవచ్చు. ఒక్క ప్రయాణానికే పాలసీ తీసుకున్నట్లయితే, ఆ ప్రయాణానికి మాత్రమే భీమా రక్షణ ఉంటుంది. అనేక ప్రయాణాల పాలసీ తీసుకున్నట్లయితే, భీమా కాలవ్యవధిలో ఉన్న అన్ని ప్రయాణాలకు రక్షణ పొడగించబడుతుంది. TPA(టీపీఏ) అంటే (ధర్డ్ పార్టీ ఎడ్మినిస్ట్రేటర్) మూడో పక్షం అధికారి, ధన సంబంధంలేని వైద్య సేవలు మరియు క్లెయిమ్స్ కు సంబంధించిన అవసరమైన సమాచారంతో ఎప్ప‌టిక‌ప్పుడు సిద్దంగా ఉంటాడు.

వ్యాధి చికిత్స‌ల‌కు

వ్యాధి చికిత్స‌ల‌కు

మీ విదేశ ప్రయాణంలో, మీరు ఏదైనా వ్యాధికి గురి అయితే, ఆ వ్యాధికి జరగవలసిన చికిత్స మీ దేశంలో చేయించుకుంటానని మీరు క్లెయిమ్ (అడగవచ్చు) . ఇది TPA (మూడో పక్షం అధికారి) సలహా పై ఆధారపడి ఉంటుంది. TPA సలహాయిస్తే, కంపెనీ, మీరు భారతదేశం వచ్చిన తరువాత కూడ అయ్యే వైద్య ఖర్చులను చెల్లిస్తుంది. కంపెనీ, కంపెనీకి, ఈ వైద్య ఖర్చుల గరిష్ట కాల పరిమితి మారుతూ ఉంటుంది. విదేశాలకు, విద్య నిమిత్తమై వెళ్ళే విద్యార్ధులకు, వైద్య రక్షణ లేని భీమా పధకాలు అందుబాటులో ఉన్నాయి.

Read more about: insurance policy
English summary

ప్ర‌యాణ బీమాతో మీ విహార యాత్ర‌కు భ‌రోసా | need of Travel insurance and what are the benefits of it

Now the number of solo travelers and group travelers are increasing. Most people spend a lot of time and effort planning best trips and holidays. But, they won't look at the importance of getting a good travel insurance policy. Here are the benefits and features of travel insurance policy
Story first published: Wednesday, July 19, 2017, 12:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X