For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గృహ రుణ ప‌రిమితిని పెంచేందుకు ఏం చేయాలి?

ఎక్కువ రుణ అర్హ‌త సాధించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

|

బ్యాంకులు ఎవ‌రికైనా రుణాలిచ్చేది వారి వారి ఆదాయం, ఆర్థిక స్తోమ‌త‌ను బ‌ట్టే. గృహ రుణం ద‌ర‌ఖాస్తు చేయ‌గానే ఫీల్డ్ ఆఫీస‌ర్లు వ‌చ్చి మీ ఇల్లు, లేదా తన‌ఖా పెట్టే ఆస్తి చూస్తారు. ఒక్కోసారి మీరు పొందే రుణం కంటే ఎక్కువ విలువ క‌లిగిన ఆస్తిని సైతం హామీగా ఉంచాల్సి రావ‌చ్చు. 28 ఏళ్ల అనుప‌మ్ సేత్ విష‌యం తీసుకుందాం. అత‌డు నోయిడాలో నివ‌సిస్తూ నెల‌కు రూ.50 వేలు సంపాదిస్తున్నాడు. ఇప్ప‌టికే రూ.8 వేల ఈఎమ్ఐని ప‌ర్స‌న‌ల్ లోన్ కోసం క‌డుతున్నాడు. వేరే ఇత‌ర అప్పులు లేన‌ప్ప‌టికీ బ్యాంకు అత‌నికి ఒక ప‌రిమితి మేర‌కు అప్పు ఇచ్చింది. అది ఎలా అంటే అత‌ని నెల‌వారీ ఈఎంఐ రూ.17 వేల‌కు మించ‌కుండా ఉండేట్లు చూసింది. క‌నీసం అతని మిగులు ఆదాయంలో 40 శాతం కూడా అర్హ‌త లేన‌ట్లు నిర్దారించారు. అన్నీ లెక్క‌లు వేసిన త‌ర్వాత దాదాపు రూ.14 ల‌క్ష‌ల మేర రుణ స‌దుపాయం క‌ల్పించారు. నోయిడాలో రూ.14 ల‌క్ష‌ల‌కు ఒక సాదా సీదా ఇల్లు కూడా రాదేమో... మ‌రి ఇలాంటి సంద‌ర్భాల్లో ఎలా? ఎక్కువ రుణ అర్హ‌త సాధించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. how to increase home loan eligibility limit

1. కాల‌ప‌రిమితి ఎక్కువ ఉండేలా చూసుకోవాలి...

1. కాల‌ప‌రిమితి ఎక్కువ ఉండేలా చూసుకోవాలి...

రుణ కాల‌ప‌రిమితి అనే అంశాన్ని కూడా మొత్తం రుణ అర్హ‌త‌ను నిర్ణ‌యించే ముందు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటార‌ని క్రెడిట్ మంత్రికి చెందిన ఆర్థిక నిపుణులు అనిల్ కుమార్ చెప్పారు. ఎక్కువ కాలం చెల్లించేలా ఉండే రుణం తీసుకుంటే మీకు ఇచ్చే సొమ్ము విలువ సైతం పెరుగుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు 15 ఏళ్ల కాలానికి రూ.20 ల‌క్ష‌ల రుణం అని మీరు మొద‌ట భావించిన‌ట్ల‌యితే, దాన్ని రూ.30 ల‌క్ష‌ల‌కు పొడిగించి 20 ఏళ్ల కాల‌ప‌రిమితి రుణంగా మార్చుకునే వీలుంటుంది. అయితే ఇక్క‌డ మీ వ‌య‌సు అనేది ముఖ్య‌మైన అంశం. త‌క్కువ వ‌య‌సులో ఉన్న‌వారికి క‌చ్చితంగా ఎక్కువ రుణం ఇచ్చేందుకు బ్యాంకులు సిద్దంగా ఉంటాయి. 65 ఏళ్లు దాటిన వారికి గృహ రుణం ఇచ్చేందుకు బ్యాంకులు సిద్దంగా లేనందున 50, అంత‌కంటే ఎక్కువ‌ వ‌య‌సు క‌ల‌వారికి ఎక్కువ కాల‌ప‌రిమితితో ఉండే రుణాలు ల‌భించ‌వు.

2. పాత అప్పులు తీర్చాలి.

2. పాత అప్పులు తీర్చాలి.

30-35 ఏళ్ల స‌మ‌యానికే ఇల్లు కొన్నా, కొన‌క‌పోయినా కారు కోసం, ఇత‌ర వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోసం అప్పు తీసుకోవ‌డం అల‌వాటైపోయింది. ఇలాంటి వారికి నిపుణులు చెప్పేదేంటంటే మీ నెల‌వారీ పొదుపును పెంచుకుంటూ మొద‌ట ఉన్న అప్పులన్నింటినీ తీర్చుకోవాలి. మీరు రుణం ద‌ర‌ఖాస్తు ఇవ్వ‌గానే బ్యాంకులు మీకు ఉన్న ఆదాయాన్ని బ‌ట్టి ఎంత ఇవ్వొచ్చు అనే దానిపై ఒక అవ‌గాహ‌న‌కు వ‌స్తాయి. కాబ‌ట్టి మీ పాత అప్పులు తీర్చేసి ఉంటే ఎక్కువ రుణ అర్హ‌త‌ను సాధించేందుకు వీల‌వుతుంది.

3. ఉమ్మ‌డి రుణ ద‌ర‌ఖాస్తు

3. ఉమ్మ‌డి రుణ ద‌ర‌ఖాస్తు

ఒక‌రుగా రుణ ద‌ర‌ఖాస్తు చేసేదాని కంటే ఉద్యోగం చేసే ఇద్ద‌రి మీద రుణం తీసుకుంటే ఇంకా మంచిది. ఉద్యోగం చేసే భార్య లేదా భ‌ర్త ఉంటే వారిని కూడా క‌లుపుకుని ఉమ్మ‌డి రుణ ద‌రఖాస్తును అందిస్తే గృహ రుణ ప‌రిధి పెరుగుతుంది. ఎందుకంటే అప్పు తీర్చేందుకు ఇద్ద‌రు వ్య‌క్తుల సంపాద‌న ఉప‌యోగిస్తారు కాబట్టి బ్యాంకులు ఎక్కువ మొత్తంలో అప్పు ఇచ్చేందుకు ముందుకొస్తాయి. ఉద్యోగం చేసే జీవిత భాగ‌స్వామి లేని సంద‌ర్భంలో త‌ల్లిదండ్రుల ఆదాయాన్ని కూడా బ్యాంకుల‌కు చూపొచ్చు. అంటే వారిని ఉమ్మ‌డి రుణ ద‌ర‌ఖాస్తుదారుగా ఉంచుతూ ఎక్కువ సొమ్మును రుణంగా పొంద‌వ‌చ్చు.

4. సిబిల్ స్కోర్

4. సిబిల్ స్కోర్

అస‌లు ఇప్ప‌ట్లో రుణం అనగానే సిబిల్ స్కోర్ ఉందా? ఎంత ? అనే ప‌రిస్థితి వ‌చ్చేసింది. సిబిల్ క్రెడిట్ స్కోర్ ఆధారంగానే రుణ అర్హ‌త‌ను బ్యాంకులు నిర్దారిస్తున్నాయి. 700 లేదా 750 పైన ఉంటే రుణ ప‌రిమితిని బాగా అంచ‌నా వేసుకోవ‌చ్చు. అంటే ఎక్కువ రుణం పొందేందుకు వీలుంటుంది. 700 కంటే త‌క్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే కొద్దిగా క‌ష్టం. మూడు నుంచి ఆర్నెల‌ల కాలంలో స్కోర్‌ను పెంచుకుని గృహ రుణం కోసం ప్ర‌య‌త్నించ‌డం మంచిది.

5. వేరియ‌బుల్ పే

5. వేరియ‌బుల్ పే

మీ ఉద్యోగంలో భాగంగా ఎంత వేరియ‌బుల్ పే, అల‌వెన్సులు వ‌స్తున్నాయో చూసుకోవాలి. మీరు తిరిగి చెల్లించే సామ‌ర్థ్యాన్ని దీన్ని బ‌ట్టి సైతం లెక్క‌గ‌డ‌తారు. ఎక్కువ రుణం కావాలంటే వేరియ‌బుల్ పే బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. బోన‌స్ లేదా డిపాజిట్ల‌పై వ‌చ్చే వ‌డ్డీ ఆదాయాన్ని సైతం హామీగా చూప‌వ‌చ్చు.

Read more about: home loan banking housing loan
English summary

గృహ రుణ ప‌రిమితిని పెంచేందుకు ఏం చేయాలి? | how to increase home loan eligibility limit

how to increase home loan eligibility limit For employees it is difficult to get higher amount of loan with restricted income, however there are ways to increase your mortgage eligibility. Goodreturns.in lists down some best ways that one can adopt to improve the eligibility criteria
Story first published: Saturday, July 8, 2017, 17:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X