For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్టుబ‌డితో కూడిన బీమాయే యులిప్

యులిప్ అనేది యునిట్ లింక్‌డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు సంక్షిప్త రూపం. ఇక్క‌డ బీమా, పెట్టుబ‌డి రెండు క‌లిసి ఉంటాయి. యులిప్ అంటే లింక్ చేయబడిన యూనిట్ బీమా పధకం. యులిప్ అనేది జీవిత బీమా పాలసీ. క్యాపిటల్ మార

|

యులిప్ అనేది యునిట్ లింక్‌డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు సంక్షిప్త రూపం. ఇక్క‌డ బీమా, పెట్టుబ‌డి రెండు క‌లిసి ఉంటాయి. యులిప్ అంటే లింక్ చేయబడిన యూనిట్ బీమా పధకం. యులిప్ అనేది జీవిత బీమా పాలసీ. క్యాపిటల్ మార్కెట్ (మదుపర్ల‌తో కూడిన మార్కెట్ షేర్లు, స్టాక్ మార్కెట్)లు ఈ యులిప్ పథకంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి. అంతే కాకుండా మదుపుదారులకు యులిప్‌ అనేవి బీమాతోపాటు పెట్టుబడి ప్రయోజనాలు కూడా పొందడానికి ఒక మార్గం. దీనితో పాటు లింక్ చేయబడిన యూనిట్ బీమా పాలసీలలో మదుపు చేసేటప్పుడు మదుపరులు తమ మదుపుపై వచ్చే నష్టాన్ని కూడా భరించాల్సి ఉంటుంది. యులిప్‌ పనితీరు విలక్షణమైనది. ఇలాంటి పెట్టుబ‌డి ఆధారిత బీమా గురించి మ‌రిన్ని అంశాలు మీ కోసం...

 యులిప్ పాల‌సీలు ఎలా ఉంటాయి?

యులిప్ పాల‌సీలు ఎలా ఉంటాయి?

మదుపు లక్ష్యాలు కలిగిన ఫండ్స్‌ను మదుపరులకు తగిన రీతిలో ఎన్నో ఇన్సూరెన్స్ సంస్దలు అందిస్తున్నాయి. ఈ ఇన్సూరెన్స్ సంస్దలు అందించేటటువంటి ఫండ్స్ కాలపరిమితో కూడుకున్నవి మరియు నష్టాలను కూడా భరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక పాలసీదారు కొంత సొమ్మును కొన్ని సంవత్సరాలపాటు దీనిపై వెచ్చించాడని అనుకుందాం. అతని సొమ్మును, సంభవించ‌బోయే నష్టాన్ని అతను తట్టుకోగలిగే స్థాయి ఆధారంగా ఈక్విటీలుగా, రుణాలుగా రెండింటిపైనా పెట్టుబడి చేస్తారు. ఇందులో అనేక పథకాలు ఉంటాయి. కొన్ని పథకాల్లో పాలసీదారులకు, వారు పాలసీ కాల ప‌రిమితి ముగిసేవరకూ జీవించి ఉన్నట్లయితే నిర్దిష్ట మొత్తంలో సొమ్మును హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఐతే ప్రీమియం మొత్తాలు చాలా అధికంగా ఉంటాయి.

 ఉదాహ‌ర‌ణ‌తో యులిప్‌

ఉదాహ‌ర‌ణ‌తో యులిప్‌

ఉదా: 30 సంవ‌త్స‌రాల వయసు కలిగిన వ్యక్తి రూ 10 లక్షల మొత్తాన్ని హామీ ఇచ్చే 20 సంవత్సరాల యులిప్‌ను కొనుగోలు చేసినట్లేతే అతను చెల్లించాల్సిన ప్రీమియం రూ. 25,000 నుండి గరిష్టంగా రూ. 2 లక్షల వరకూ ఉండవచ్చు. (హామీ ఇవ్వబడిన మొత్తం అనేది ప్రీమియంకు ఐదు రెట్లు). కాగా, మరోవైపు బీమాలో అత్యంత స్వచ్ఛంగా భావింపబడే టర్మ్‌ ప్లాన్లో ఇందుకు అయ్యే వ్యయం కేవలం రూ. 3,370 మాత్రమే. ఇందులో ఒక సమస్య ఉంది. బీమా చేసిన వ్యక్తి జీవించి ఉన్నట్లయితే, టర్మ్‌ ప్లాన్‌లో చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని రూ. 67,400 (3,370 × 20 సంవత్సరాలు) కోల్పోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత రుణాల దృష్ట్యా చూస్తే, ఆ తేడా సొమ్ము రూ. 21,630 (రూ. 25,000 - రూ. 3,370) మదుపు చేసినట్లయితే 8 శాతం ఆదాయాన్ని అందించే ఏ పథకంలో అయినా రాబడి అదే విధంగా రూ. 9.8 లక్షలు వరకూ ఉంటుంది. అందులో కూడా మొత్తం టర్మ్‌ ప్లాన్ సొమ్ము రూ. 67,400 కోల్పోవాల్సి ఉంటుంది. యులిప్‌ అనేది మార్కెట్‌తో ముడిపడి ఉన్నందున, ఈ ప్రయోజనాన్ని దెబ్బతీస్తుంది. ప్రయోజ నాన్ని అందిచాల్సిన సమయంలో మార్కెట్లో ఉండే అనిశ్చిత పరిస్థితులు ఇందుకు కారణం.

 యులిప్‌ పథకం వల్ల లాభాలు:

యులిప్‌ పథకం వల్ల లాభాలు:

'లాక్‌-ఇన్‌' పిరియడ్‌ కారణంగా స్టాక్స్‌ను కలిగి ఉండేందుకు ఫండ్‌ నిర్వాహకులకు ఎక్కువ కాలం లభిస్తుంది. యులిప్‌ ద్వారా వచ్చే రాబడికి పూర్తి మినహాయింపులు వర్తిస్తాయి. ఒక సంవత్సర కాలంలో 100 శాతం రుణాలు-ఈక్విటీ స్కీములకు మారేందుకు నాలుగు సార్లు ఉచితంగా అవ‌కాశ‌మిస్తారు.

 యులిప్ వ‌ల్ల న‌ష్టాలు

యులిప్ వ‌ల్ల న‌ష్టాలు

ప్రీమియం కేటాయింపు ఛార్జీలు, పాలసీ అడ్మినిస్ట్రేషన్‌ ఛార్జీలు, మోర్టాలిటీ రేటు వంటి వాటికి అయ్యేటటువంటి వ్యయం అధికం. నాక్‌-ఆఫ్‌ యూనిట్స్‌ వ్యయం ముందుగానే చెల్లించాల్సి రావడం.

తెలుగు.గుడ్‌రిట‌ర్న్స్‌.ఇన్‌

Read more about: ulip insurance policy
English summary

పెట్టుబ‌డితో కూడిన బీమాయే యులిప్ | for whom ulip is suitable and what is ULIP

ULIP stands for unit linked insurance plans. ULIP is a combination of insurance and investment. Here policyholder can pay a premium monthly or annually. A small amount of the premium goes to secure life insurance and rest of the money is invested just like a mutual fund does. Policyholder goes on investing through the term of the policy – 5,10 or 15 years and accumulates the units
Story first published: Tuesday, July 4, 2017, 10:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X