For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐపీవోలో పెట్టుబ‌డి ఏ అంశాల‌పై ఆధార‌ప‌డి చేయాలి?

పెట్టుబ‌డుల కోసం చాలా కంపెనీలు మొద‌టిసారి ప్రైమ‌రీ మార్కెట్లోకి వ‌చ్చి నిధులు సేక‌రిస్తున్నాయి. ఒక్కోసారి చాలా కంపెనీలు ఐపీవోల‌కి వ‌స్తే ఏ కంపెనీ షేర్లు కొనాలో కూడా తెలియ‌దు. కాబ‌ట్టి ఐపీవో జారీ అయి

|

పెట్టుబ‌డుల కోసం చాలా కంపెనీలు మొద‌టిసారి ప్రైమ‌రీ మార్కెట్లోకి వ‌చ్చి నిధులు సేక‌రిస్తున్నాయి. ఒక్కోసారి చాలా కంపెనీలు ఐపీవోల‌కి వ‌స్తే ఏ కంపెనీ షేర్లు కొనాలో కూడా తెలియ‌దు. కాబ‌ట్టి ఐపీవో జారీ అయిన‌ప్పుడు ఏ అంశాల ఆధారంగా పెట్టుబ‌డి పెట్టాలో చూద్దాం.
1. కంపెనీ వ్యాపారం, ఆర్థిక సామ‌ర్థ్యం
కంపెనీ వ్యాపారం దేనిపై నిర్వ‌హిస్తోంది, కంపెనీ ఆర్థిక వ‌నరులు ఏంటి అనే దాని ఆధారంగా కంపెనీ భ‌విష్య‌త్తు రాబ‌డులు, ఆర్థిక సామ‌ర్థ్యం అనేవి ఆధార‌ప‌డి ఉంటాయి. భ‌విష్య‌త్తులో కంపెనీ ప‌నితీరును మొద‌ట వీటిని బ‌ట్టే అంచ‌నా వేయాల్సి ఉంటుంది. పెద్ద ఆర్థిక సంస్థ‌లు చేసే ప‌నిని కాకుండా ప్ర‌త్యేకంగా కొన్ని అంశాల ఆధారంగా ప‌నిచేస్తుంద‌నే న‌మ్మ‌కంతోనే బ్రోక‌రేజీలు ఇటీవ‌ల ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఐపీవోకు స‌బ్‌స్క్రైబ్ చేసుకోవాల‌ని పెద్ద ఎత్తున సూచించారు.
2. కంపెనీ ఫండ‌మెంట‌ల్స్‌, ప‌రిశ్ర‌మ అవుట్‌లుక్‌
కంపెనీ యాజ‌మాన్యం, ఏ రంగంలో ప‌నిచేస్తుంది, నిర్వ‌హ‌ణ లాభాలు ఎలా ఉన్నాయి అనే అంశాలు, కంపెనీ, ప‌రిశ్ర‌మ బ‌ల‌హీన‌త‌ల‌ను బ‌ట్టి మొత్తం మార్కెట్ సెంటిమెంటును అంచ‌నా వేయడం వంటివి సైతం ఐపీవో పెట్టుబ‌డులు పెట్టేందుకు గ‌మ‌నించాల్సిన వాటిలో ముఖ్య‌మైన‌వి.

 ఐపీవో పెట్టుబడి-ముఖ్య అంశాలు

3. ఇష్యూ ఉద్దేశం:
ఇష్యూను ఎందుకు జారీ చేస్తున్నారో అనే అంశం సైతం పెట్టుబ‌డిదారులు గ‌మ‌నించాల్సిన మ‌రో ముఖ్య‌మైన విష‌యం. ఎందుకంటే పెట్టుబ‌డిదారుల నుంచి సేక‌రించిన డ‌బ్బుల‌ను ఏం చేస్తారో ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది కాబ‌ట్టి.
4. వాల్యూయేష‌న్లు, పీ/ఈ నిష్ప‌త్తి
ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో లేదా పీ/ఈ నిష్ప‌త్తి అనేది కంపెనీ స్టాక్ విలువ‌, రాబ‌డి సంబంధాల‌ను తెలియ‌జేస్తుంది. స్టాక్ ధ‌ర‌ను షేర్‌కు వ‌చ్చే రాబ‌డితో భాగిస్తే ఈ రేషియో వ‌స్తుంది. రిట‌ర్న్ ఆన్ ఈక్విటీ రేషియోను సైతం చూడాల్సి ఉంటుంది.
5. ఒకే బాస్కెట్‌లో ఉండే లిస్టెడ్ స్టాక్‌ల‌తో పోల్చి చూసిన‌ప్పుడు ఉండే ఇష్యూ ధ‌ర‌
అదే రంగానికి సంబంధించి మార్కెట్లో ఉండే వాటితో పోల్చి చూసిన‌ప్పుడు దీని ఇష్యూ ధ‌ర ఎక్కువ‌గా ఉంటే ఆ కంపెనీ షేర్ ధ‌ర లాభాలు గ‌డించే అవ‌కాశాలు త‌క్కువ‌ని గుర్తుంచుకోవాలి.
6. రేటింగ్ లేదా గ్రేడింగ్
ఇన్వెస్ట‌ర్లు జాగ్ర‌త్త వ‌హించాల్సిన మ‌రో అంశం ఐపీవోల‌కు ఇచ్చే రేటింగ్‌. ఇత‌ర ఆర్థిక సాధనాల్లాగా రేటింగ్ సంస్థ‌లు ఐపీవోల‌ను సైతం రేట్ చేస్తుంటాయి. మంచి రేటింగ్ ఉంటే నిస్సందేహంగా ముందుకెళ్ల‌వ‌చ్చు. అయితే కేవ‌లం రేటింగ్‌పైనే ఆధార‌ప‌డి ముందుకు వెళ్ల‌కూడ‌దు.
7. ఓవ‌ర్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌
ఐపీవో ఇష్యూకు ఏదైనా కంపెనీ ముందుకు వ‌చ్చిన‌ప్పుడు, మొద‌ట్లోనే ఎన్ని షేర్లు అందుబాటులో ఉన్నాయ‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావిస్తారు. ప్ర‌తి వ‌ర్గానికి అంటే బ్యాంకింగ్‌, ఇన్‌స్టిట్యూష‌న‌ల్ ఇన్వెస్ట‌ర్లు, దేశీయ సంస్థ‌లు, రిటైల్ పెట్టుబ‌డిదారుల‌కు ఎవ‌రెవ‌రికి ఎన్ని షేర్లు కేటాయింపులు జ‌రిపారనే దాన్ని ముందే వెల్ల‌డిస్తారు.

Read more about: ipo investments
English summary

ఐపీవోలో పెట్టుబ‌డి ఏ అంశాల‌పై ఆధార‌ప‌డి చేయాలి? | depends on what factors one should invest in an ipo

hen coming up with an IPO issue, company offers a particular number of share for sale or subscription. Furthermore, for each category, ie. Banks, institutional investors, domestic institutions and retail investors it sets aside some percentage allocation that would be done.
Story first published: Thursday, July 6, 2017, 15:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X