For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్ర‌పంచంలో టాప్ 10 ఇన్సూరెన్స్ కంపెనీలు

వ్య‌క్తులు బీమా చేయించుకోవ‌డం పెరుగుతుండంతో పాటు ఆర్థిక రంగంలో బీమా సంస్థ‌ల పాత్ర ఎంతో పెరుగుతున్న‌ది. అందుకే ఎన్నో విదేశీ బీమా కంపెనీలు దేశంలోని ప‌లు ఆర్థిక సేవ‌ల సంస్థ‌ల‌తో భాగ‌స్వామ్యం కుదుర్చుకుని

|

వ్య‌క్తులు బీమా చేయించుకోవ‌డం పెరుగుతుండంతో పాటు ఆర్థిక రంగంలో బీమా సంస్థ‌ల పాత్ర ఎంతో పెరుగుతున్న‌ది. అందుకే ఎన్నో విదేశీ బీమా కంపెనీలు దేశంలోని ప‌లు ఆర్థిక సేవ‌ల సంస్థ‌ల‌తో భాగ‌స్వామ్యం కుదుర్చుకుని భార‌త‌దేశంలో అడుగుపెడుతున్నాయి. అయితే ఏ కంపెనీ ఏ దేశానికి చెందిందో తెలియ‌ని గంద‌ర‌గోళం నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో బీమా రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ‌లేవో తెలుసుకుందాం.

 10. ఐఎన్‌జీ గ్రూప్‌

10. ఐఎన్‌జీ గ్రూప్‌

1991 లో ఐఎన్‌జీ గ్రూప్ ప్రారంభ‌మైంది. దీని ప్ర‌ధాన కార్యాల‌యం నెద‌ర్లాండ్స్‌లోని ఆమ్‌స్ట‌ర్‌డ్యామ్‌లో ఉంది. ఈ గ్రూప్ అధిప‌తి రాల్ఫ్ హామ‌ర్స్‌. ఈ గ్రూప్ సంస్థ‌లో మొత్తం 90 వేల మందికి పైగా ప‌నిచేస్తున్నారు. ఈ గ్రూప్ బ్యాంకింగ్‌, పెట్టుబ‌డులు, సాధార‌ణ, జీవిత బీమా, ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాతి ఆర్థిక ప్ర‌ణాళిక‌లు, ఆస్తుల నిర్వ‌హ‌ణ వంటి వ్య‌వ‌హారాల‌ను చూస్తుంది. మొత్తం 50 ఉప సంస్థ‌ల‌ను క‌లిగిన ఐఎన్‌జీ గ్రూప్ మ‌న దేశ ప్రైవేటు కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్‌లో ఉన్న త‌న వాటాను 2016లో అమ్మేసింది. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం ఆ సంస్థ రెవెన్యూ 67.34 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండ‌గా; నిక‌ర ఆదాయం 5.29 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది.

9. మెట్‌లైప్ ఇన్సూరెన్స్‌

9. మెట్‌లైప్ ఇన్సూరెన్స్‌

1868లో యూఎస్‌లో మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్‌ను స్థాపించారు. న్యూయార్క్ ప్ర‌ధాన కేంద్రంగా క‌లిగిన ఈ సంస్థ స్టీవెన్ కండ‌రియ‌న్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తోంది. మెట్‌లైప్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 70,000. ఇన్సూరెన్స్‌, ఆర్థిక సేవ‌ల‌కు సంబంధించి వ్య‌క్తులు, వివిధ సంస్థ‌ల ఉద్యోగుల‌కు ఇది సేవ‌ల‌ను అందిస్తోంది. జీవిత బీమా, యాన్యుటీలు,వాహ‌న బీమా, రీఇన్సూరెన్స్‌, రిటైర్మెంట్‌, పొదుపు సేవ‌ల‌ను మెట్‌లైఫ్ అందిస్తూ వ‌స్తోంది. అమెరికాతో పాటు ఆసియా, యూర‌ప్‌, మ‌ధ్య ప్రాచ్యం, ఆఫ్రికా ప్రాంతాల్లో ఇది విస్త‌రించింది. ప్ర‌పంచ‌మంతా ఈ సంస్థ‌కు 45కు పైగా ఉప సంస్థ‌లు ప‌నిచేస్తున్నాయి. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం ఈ సంస్థ రెవెన్యూ 68.8 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండ‌గా; నిక‌ర ఆదాయం 5.09 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది.

8. నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్‌

8. నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్‌

1889 జులై 4న ప్రారంభ‌మైన నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్ర‌స్తుతం ప్ర‌పంచ ఇన్సూరెన్స్ ప‌రిశ్ర‌మ‌లోనే ఒక పేరెన్నిక‌గ‌న్న సంస్థ‌గా నిలిచింది. జ‌పాన్‌కు చెందిన ఈ సంస్థ ఆ దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా ఉంది.ఈ సంస్థ ప్రధాన కార్యాల‌యం ఒసాకా,జ‌పాన్‌లో ఉంది. నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్ర‌స్తుత సీఈవో కునీ ఒక‌మోటో. ఈ సంస్థ‌ ఉద్యోగుల సంఖ్య 73,000. ఈ సంస్థ‌కు 30 ఉప సంస్థ‌లు ఉన్నాయి. మ‌న దేశంలో రిలయ‌న్స్‌తో క‌లిసి రిలయ‌న్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పేరుతో బీమా సేవ‌ల‌ను అందిస్తోంది. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం ఈ సంస్థ రెవెన్యూ 71.508 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండ‌గా; నిక‌ర ఆదాయం 4.928 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది.

 7. జ‌పాన్ పోస్ట్

7. జ‌పాన్ పోస్ట్

జ‌పాన్ పోస్ట్ హోల్డింగ్స్ ఉప సంస్థ అయిన జ‌పాన్ పోస్ట్ ఇన్సూరెన్స్ జ‌పాన్ లో అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ‌గా ఉంది. వివిధ వ్య‌క్తుల‌కు, సంస్థ‌ల‌కు ఇది బీమా సంబంధిత సేవ‌ల‌ను అందిస్తుంది. అంద‌రూ క‌స్ట‌మ‌ర్ల‌కు నాణ్య‌మైన ఆర్థిక ఉత్ప‌త్తుల‌ను అందించేందుకు నిరంత‌రం కృషి చేస్తోంది. ఈ సంస్థ‌లో 5 వేల మందికి పైగా ప‌నిచేస్తున్నారు. జ‌పాన్ దేశంలోని టోక్యోలో దీని ప్ర‌ధాన కార్యాల‌యం ఉంది. ప్ర‌పంచంలోనే ఒక అతిపెద్ద‌గా కంపెనీగా ఉండ‌టంతో పాటు జ‌పాన్ బ్యాంకింగేత‌ర సంస్థ‌ల్లో అతిపెద్ద‌దిగా కొన‌సాగుతోంది. ఈ సంస్థ రెవెన్యూ 76 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండ‌గా; నిక‌ర ఆదాయం 2.57 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది.

6. జెన‌రలి

6. జెన‌రలి

ఇట‌లీ ప్ర‌ధాన కేంద్రంగా ప‌నిచేస్తున్న జ‌న‌ర‌లీ ఇన్సూరెన్స్ ప్ర‌పంచంలోనే అతి ముఖ్య‌మైన బీమా కంపెనీల్లో ఒక‌టిగా ఉంది. 1831లో ప్రారంభ‌మైన ఈ సంస్థ బీమా రంగంలో ద‌శాబ్దాల అనుభవం కార‌ణంగా ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ బీమా సంస్థ‌ల్లో చోటు ద‌క్కించుకుంది. యూర‌ప్‌, ఆసియా, అమెరికా ప్రాంతాల్లో ఇది విస్త‌రించింది. ఈ సంస్థ‌లో దాదాపు 75 వేల మందికి పైగా ప‌నిచేస్తున్నారు. దీనికే చెందిన మ‌రిన్ని సంస్థ‌లు జ‌న‌ర‌లి లైఫ్‌, అలియెంజా అస్సిక్యుర‌జియోని, జెన‌ర‌లీ ఇటాలియా, బంకా జెన‌ర‌లి. వివిధ మార్కెటింగ్, ప్ర‌క‌ట‌న‌ల విధానాల ద్వారా ఒక బ‌ల‌మైన బ్రాండ్ అవ‌గాహ‌న‌ను జెన‌ర‌లీ క‌లిగి ఉంది. జెన‌ర‌లీ రెవెన్యూ 91.26 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండ‌గా; నిక‌ర ఆదాయం 3.34 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది.

5. పింగ్ యాన్

5. పింగ్ యాన్

చైనా దేశంలోని షెంజెన్‌లో 1988లో ఈ సంస్థ ప్రారంభమైంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆ సంస్థ‌కు 2,75,000 మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. జీవిత బీమా, సాధార‌ణ బీమా, బ్యాంకింగ్, ఆర్థిక సేవ‌ల విభాగాల్లో ఇది త‌న కార్య‌కలాపాల‌న విస్త‌రించింది. ముఖ్యంగా చైనా, హాంగ్ కాంగ్‌, మ‌కావు ప్రాంతాల్లో ఎక్కువ‌గా త‌న సేవ‌ల‌ను అందిస్తోంది. పింగ్ యాప్ స‌బ్సిడ‌ర‌లీలు పింగ్ యాన్ బ్యాంక్‌, పింగ్ యాప్ సెక్యూరిటీస్ ,పింగ్ యాప్ ట్ర‌స్ట్.

పింగ్ యాన్‌లో ప్ర‌పంచ ఆర్థిక దిగ్గ‌జాల్లో ఒక‌టైన హెచ్ఎస్‌బీసీకి 18% వాటా ఉంది. ఈ సంస్థ రెవెన్యూ 85.915 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండ‌గా; నిక‌ర ఆదాయం 11.972 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది.

4. యాక్సా

4. యాక్సా

ఫ్రెంచి బ‌హుళ జాతి సంస్థ యాక్సా పారిస్ కేంద్రంగా ప‌నిచేస్తోంది. ఈ సంస్థ‌లో 1,60,000 మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. 2016 సంవ‌త్స‌రంలో అంత‌ర్జాతీయ ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ బ్రాండ్ల‌లో మూడో స్థానాన్ని ఈ సంస్థ అందుకుంది. ఈ సంస్థ ప్ర‌ధానంగా పొదుపు, ఆస్తుల నిర్వ‌హ‌ణ‌, అంత‌ర్జాతీయ బీమా, ప్రాప‌ర్టీ అండ్ కాజువాలిటీ, బ్యాంకింగ్ రంగాల్లో త‌న సేవ‌ల‌ను విస్త‌రించింది. 64 దేశాల్లో వివిధ వ్య‌క్తుల‌కు, సంస్థ‌ల‌కు ఇది త‌న సేవ‌ల‌ను అందిస్తున్న‌ది. ఈ సంస్థ రెవెన్యూ 106.5 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండ‌గా; నిక‌ర ఆదాయం 6.16 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది.

3. అలియంజ్‌

3. అలియంజ్‌

కార్ల్ వోన్ థీయ‌మె అలియంజ్ సంస్థ‌ను 1890లో స్థాపించారు. ఇన్సూరెన్స్ రంగంలో ఒక దిగ్గ‌జంగా వెలుగొందుతోంది. జర్మ‌నీలోని మ్యూనిచ్‌లో దీని ప్ర‌ధాన కార్యాల‌యం ఉంది. దీని ఉద్యోగుల సంఖ్య 1,40,000కు పై మాటే. బీమా, పెట్టుబ‌డి స‌ల‌హాల సేవ‌ల‌ను అందించ‌డంలో అలియెంజ్ పేరు తెచ్చుకుంది. ప్రాప‌ర్టీ క్యాజువాలిటీ, లైఫ్ లేదా ఆరోగ్య బీమా, అసెట్ మేనేజ్‌మెంట్‌, కార్పొరేట్ బిజినెస్ రంగాల్లో త‌న కార్య‌కాల‌పాల‌ను క‌లిగి ఉంది. ఆస్ట్రేలియా, బెల్జియం, జ‌ర్మ‌నీ, ఇండియా, ఇండోనేషియా, యూఎస్‌, యూకే దేశాల‌తో పాటు దాదాపు 70 దేశాల్లో ఇది విస్త‌రించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మొత్తం 50 ఉప సంస్థ‌ల ద్వారా ఇది ప‌నిచేస్తోంది.

ఈ సంస్థ రెవెన్యూ 130 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండ‌గా; నిక‌ర ఆదాయం 7.34 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది.

2. యునైటెడ్ హెల్త్‌కేర్‌

2. యునైటెడ్ హెల్త్‌కేర్‌

అమెరికాలో మిన్సెసోటా ప్ర‌ధాన కేంద్రంగా ఈ సంస్థ ప‌నిచేస్తోంది. ప్ర‌స్తుతం ఈ సంస్థ సీఈవోగా స్టీఫెన్ హెమ్‌స్లే ప‌నిచేస్తున్నారు. 2,30,000 మందికి పైగా ఉద్యోగులు ఈ కంపెనీలో ప‌నిచేస్తున్నారు. కేవ‌లం అమెరికాలోనే 7 కోట్ల‌కు మందికి పైగా క‌స్ట‌మ‌ర్ల‌కు త‌న సేవ‌ల‌ను అందిస్తోంది. ఆరోగ్య బీమా, సాఫ్ట్‌వేర్, డేటా కన్స‌ల్టెన్సీ సేవ‌ల‌ను యునైటెడ్ హెల్త్ గ్రూప్(యూహెచ్‌జీ) అందిస్తోంది. ఆప్ట‌మ్ఆరెక్స్‌, ఆప్ట‌మ్ఆన్‌సైట్, ఆప్ట‌మ్ హెల్త్‌, యునైటెడ్ హెల్త్‌కేర్ విభాగాల్లో యూహెచ్‌జీ త‌న కార్య‌కలాపాల‌ను విభ‌జించింది. 2017తో క‌లుపుకుని వ‌రుస‌గా 17 సంవత్స‌రాలు ఫార్చూన్ ప్ర‌క‌టించే ప్ర‌పంచంలో ప‌నిచేయ‌డానికి ఆస‌క్తి చూపే కంపెనీల జాబితాలో చోటు ద‌క్కించుకుంది. ప్ర‌పంచంలో 500 అతిపెద్ద బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌లో 17 వ స్థానాన్ని పొందింది. ఈ సంస్థ రెవెన్యూ 184.8 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండ‌గా; నిక‌ర ఆదాయం 13.3 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది.

1. బెర్క్‌షైర్ హాత్‌వే

1. బెర్క్‌షైర్ హాత్‌వే

వాలీ ఫాల్స్ కంపెనీ పేరుతో 1839లో బెర్క్‌షైర్ హాత్‌వే ప్రారంభ‌మైంది. త‌ర్వాత 1955లో ఇప్ప‌టి పేరుకు మారింది. అమెరికాలోని నెబ్రాస్కా ప్ర‌ధాన కేంద్రంగా ఈ సంస్థ ప‌నిచేస్తోంది. కేవ‌లం యూఎస్‌లోనే కాకుండా ప్ర‌పంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ‌ల్లో ఒక‌టిగా ఇది ఖ్యాతికెక్కింది. బెర్క్‌షైర్ హాత్‌వే గ్రూప్ సంస్థ‌ల సీఈవో వారెన్ బ‌ఫెట్. మొత్తం ఈ గ్రూప్‌లో 3 ల‌క్ష‌ల మంది ప‌నిచేస్తున్నారు. రెస్టారెంట్లు, ఏరోస్పేస్‌, మీడియా, ఆటోమొబైల్‌, క‌న్సూమ‌ర్ ఉత్ప‌త్తుల విభాగాల్లో ఈ కంపెనీ వినియోగ‌దారుల‌కు సేవ‌ల‌ను అందిస్తున్న‌ది.

ఈ సంస్థ మొత్తం రెవెన్యూ 223.6 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండ‌గా; నిక‌ర ఆదాయం 5.7 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది.

Read more about: insurance axa met life generali
English summary

ప్ర‌పంచంలో టాప్ 10 ఇన్సూరెన్స్ కంపెనీలు | Top 10 Insurance Companies in the World 2017

Insurance industry has become important not only for customers but also for enterprises. With growing businesses and increasing incomes of people, the business for insurance companies has also increased manifold. Insurance companies are strong financial institutions offering life insurance, health insurance, property insurance, car insurance etc. Some of the top insurance companies include Berkshire Hathaway, UnitedHealth, AXA, Allianz etc. Here is the list of the top 10 insurance companies in the world 2017 based on total revenue and net income(profit).
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X