For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎఫ్‌డీలు కాకుండా అధిక వ‌డ్డీ వ‌చ్చే ఇత‌ర మార్గాలేవి?

ఎఫ్‌డీలలో ఇన్వెస్ట్ చేయడానికి కారణాలు చాలా ఉన్నాయి. కానీ వ‌డ్డీ రేటు ప‌రంగా చూస్తే వీటిల్లో పెద్ద‌గా వ‌డ్డీ రాదు. రిస్క్ తీసుకోలేని వారికి ఇవి స‌రిపోతాయి. అయితే మ‌ధ్య స్థాయి నుంచి అధిక రిస్క్ తీసుకు

|

ఎఫ్‌డీల‌కు బ్యాంకు భద్రత ఉంటుంది. మెచ్యూరిటీ తేదినాటికి ఎంత మొత్తం వస్తుందన్న స్పష్టత, మధ్యలో ఎప్పుడు అవసరమైతే అప్పుడు బ్యాంకు శాఖకు వెళ్లి డిపాజిట్ రద్దు చేసుకుని వెంటనే నగదు తెచ్చుకోగల సౌలభ్యం. ఈ కారణాలే ఎక్కువ మంది బ్యాంకు ఎఫ్‌డీలలో ఇన్వెస్ట్ చేయడానికి కారణాలుగా ఉన్నాయి. కానీ వ‌డ్డీ రేటు ప‌రంగా చూస్తే వీటిల్లో పెద్ద‌గా వ‌డ్డీ రాదు. రిస్క్ తీసుకోలేని వారికి ఇవి స‌రిపోతాయి. అయితే మ‌ధ్య స్థాయి నుంచి అధిక రిస్క్ తీసుకునే వారికి అధిక రాబ‌డి కోసం ఇవి స‌రిపోవు. ఇంకా వేరే విధ‌మైన పెట్టుబ‌డుల దిశ‌గా ఆలోచించాల్సిందే. అలాంటి కొన్నింటిని ఇక్క‌డ చూద్దాం.

ప్ర‌భుత్వ బాండ్లు

ప్ర‌భుత్వ బాండ్లు

వీటిని సాధారణంగా ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేస్తుంటాయి. వీటిపై వడ్డీ రేటు 8 శాతంగా ఉంది. పైగా వీటిలో భద్రత ఎక్కువ. కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది. ఆరేళ్ల పాటు లాకిన్ ఉంటుంది. వడ్డీపై పన్ను ఉంటుంది. ఇది వారి ఆదాయ పన్ను శ్లాబు రేటును బట్టి ఉంటుంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్ట పరిమితి ఏమీ లేదు. అయితే, అత్యవసరంగా డబ్బులు కావాల్సి వస్తే వీటి నుంచి లభించే అవకాశం మాత్రం లేదు. ఎందుకంటే ఇవి స్టాక్ ఎక్సేంజ్ లలో ట్రేడ్ కావు. మరొకరికి బదిలీ చేయడానికి కూడా అవకాశం లేదు. కాల వ్యవధి ముగిసే వరకూ వేచి చూడాల్సిందే.

కార్పొరేట్ ఫిక్స్ డ్ డిపాజిట్లు

కార్పొరేట్ ఫిక్స్ డ్ డిపాజిట్లు

కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలకు అవసరమైన నిధులను డిపాజిట్ల రూపంలో సేకరిస్తుంటాయి. నిధుల సమీకరణకు అనుసరించే మార్గాల్లో ఇది కూడా ఒకటి. వీటిలో పెట్టుబడులు ఎంత భద్రమో తెలియజేసేందుకు వీలుగా రేటింగ్ సంస్థలు డిపాజిట్ లకు రేటింగ్ ఇస్తుంటాయి. ఏఏఏ రేటింగ్ ఉన్నవి అత్య‌ధిక భద్రతతో కూడినవి. వీటిలో పెట్టుబడులు పెట్ట‌డం సూచ‌నీయం. వీటితో ఉన్న ప్రయోజనం ఏమిటంటే వడ్డీ రేటు మెరుగ్గా ఉంటుంది. కార్పొరేట్ కంపెనీల ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు బ్యాంకు సాధార‌ణ ఎఫ్‌డీల కంటే ఒకటి రెండు శాతం అదనంగా పొందే అవకాశం ఉంది. ఇక సీనియర్ సిటిజన్లు (వృద్ధులకు పావు శాతం అధికంగా వడ్డీ రేటు పొందవచ్చు. ఉదాహరణకు డిపాజిట్లపై శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్ 8.19% వ‌ర‌కూ వడ్డీరేటును ఆఫర్ చేస్తోంది. 7 రోజుల డిపాజిట్లు మొద‌లుకొని 10 ఏళ్ల డిపాజిట్ల‌ను అందుబాటులో ఉంచిన బంధ‌న్ బ్యాంకు వ‌డ్డీ రేటును 3.5% నుంచి 8% వ‌ర‌కూ అందిస్తున్న‌ది.

చిన్న మొత్తాల పొదుపు పథకాలు

చిన్న మొత్తాల పొదుపు పథకాలు

పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉండే చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు బ్యాంకు ఎఫ్ డీల కంటే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఐదేళ్ల కోసం డిపాజిట్ చేయాలనుకుంటే అనుకూలం. వీటిపై 8 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. అధిక శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి కూడా పన్ను తర్వాత నికర రాబడి 5.6 శాతంగా ఉంటుంది. కిసాన్ వికాస పత్రాలను దీర్ఘకాల ఇన్వెస్ట్ మెంట్ కోసం పరిశీలించవచ్చు. 9 ఏళ్ల నాలుగు నెలల్లో పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుంది. ఇక పీపీఎఫ్ పైనా ఆకర్షణీయమైన వడ్డీరేటు లభిస్తోంది. 8 శాతం వడ్డీ రేటు లభించినా దానిపై ఎలాంటి పన్ను లేకపోవడంతో నికర రాబడి ఎక్కువగా ఉంటుంది. పెట్టే పెట్టుబడులకు, దానిపై లభించే వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీకి మూడింటిపై పన్ను మినహాయింపు ఉండడం లాభదాయకం. దీంతో ద్రవ్యోల్బణం 5 శాతం తీసేసినా 3 శాతం వడ్డీ రేటు అందుకోవచ్చు.

డెట్ ఫండ్స్

డెట్ ఫండ్స్

బ్యాంకు ఎఫ్ డీల కంటే డెట్ ఫండ్స్ ద్వారా ఎక్కువ రాబ‌డులు సాధించ‌వచ్చు. లిక్విడిటీ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తన నిధులను వెనక్కి తీసుకోగల సౌలభ్యం డెట్ ఫండ్స్‌లో ఉంటుంది. కానీ, ఇది కూడా ఫండ్ ను బట్టి మారిపోతుంది. డెట్ ఫండ్స్ పై రాబడులు మార్కెట్ తో ఆధారపడి ఉంటాయి. అంటే కొంచం రిస్క్ ఉంటుంది. అయితే, మంచి పేరున్న ఫండ్ హౌస్, మంచి పనితీరున్న ఫండ్ మేనేజర్ ఆధ్వర్యంలోని డెట్ ఫండ్ ను ఎంచుకోవడం వల్ల రిస్క్ తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. డెట్ ఫండ్స్ లో ఉన్న ఒక ప్రయోజనం ఏమిటంటే కనీసం మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే(ద్రవ్యోల్బణ ప్ర‌భావాన్ని మించి) అందుకునే ప్రతిఫలానికి పన్ను తగ్గించుకునే వెసులుబాటు ఉంది. దీంతో డెట్ ఫండ్స్ ఆకర్షణీయంగా మారాయి.

రాబ‌డులెలా ఉంటాయి?

రాబ‌డులెలా ఉంటాయి?

డెట్ ఫండ్స్ పెట్టుబడులు ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్ డిపాజిట్లు, మనీ మార్కెట్ సాధనాల్లో ఉంటాయి. ఏడాది కాల వ్యవధిగల డిపాజిట్లపై వివిధ రకాల కేటగిరీల్లో 7 శాతం నుంచి 9 శాతం వరకు... మూడేళ్లు, ఐదేళ్ల డిపాజిట్లపైనా 9.50 శాతం వరకు రాబడులకు అవకాశం ఉంది. ఏడాది కాల‌వ్య‌వ‌ధి కంటే ముందే పెట్టుబడులను వెనక్కి తీసేసుకుంటే విలువపై అరశాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల కాలం పాటు ఇన్వెస్ట్ మెంట్ కొనసాగించే వారు వీటిపై ఎక్కువ రాబడులను అందుకోవడానికి అవకాశం ఉంటుంది. డెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ మెంట్ కు వీలుగా మూడు రకాలున్నాయి.

ఇత‌ర పెట్టుబ‌డులు

ఇత‌ర పెట్టుబ‌డులు

ఫిక్స్ డ్ మెచ్యూరిటీ ప్లాన్: ఇది ఫిక్స్ డ్ డిపాజిట్ లాంటిది. క్లోజ్డ్ ఎండెడ్. నిర్ణీత కాలం వరకూ డబ్బులను వెనక్కి తీసుకునేందుకు వీలుండదు. ఏడాది నుంచి మూడేళ్ల కాల వ్యవధులతో ఉంటాయి.

కార్పొరేట్ బాండ్ ఫండ్: కార్పొరేట్ బాండ్ ఫండ్ అంటే అధిక, అత్యధిక రేటింగ్ గల కంపెనీలు జారీ చేసే బాండ్లు. అధిక భద్రతతో మెరుగైన రాబడులు ఇచ్చేందుకు వీలుంటుంది. ఇవి ఓపెన్ ఎండెడ్. ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టేందుకు అవ‌కాశం ఉంటుంది.

క్రెడిట్ అపార్చునిటీస్ ఫండ్: కార్పొరేట్ బాండ్ల తరహావే. కాకపోతే అధిక రాబడులను ఇచ్చేందుకు వీలుగా తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్.

ఈఎల్ఎస్ఎస్‌:

ఈఎల్ఎస్ఎస్‌:

పన్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాల కోస‌మే కొన్ని మ్యూచువ‌ల్ ఫండ్లు ఉంటాయి. ఆ త‌ర‌హాలో ప‌రిచ‌య‌మైన‌వే ఈఎల్ఎస్ఎస్‌. వీటిల్లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా ఆదాయపు ప‌న్ను విష‌యంలో రూ.1.5 ల‌క్ష వ‌ర‌కూ మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. ఈఎల్ఎస్ఎస్ విష‌యంలో లాక్ ఇన్ పీరియ‌డ్ మూడేళ్లు ఉంటుంది. ఈ ప‌థకానికి సంబంధించిన పెట్టుబ‌డుల‌ను ఈక్విటీ మార్కెట్లోని వివిధ కంపెనీల షేర్లలో పెడ‌తారు. కొంత న‌ష్ట‌భ‌యాన్ని త‌ట్టుకునేలా, ప‌న్ను ఆదా ప‌థకాల్లో పెట్టుబ‌డి పెట్టాల‌నుకునేవారికి ఈఎల్ఎస్ఎస్ ప‌థ‌కాలు స‌రైన ఎంపిక‌.

ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థ‌కాలు అంటే ఏమిటి? పెట్టుబ‌డి ఎలా?

Read more about: fd fixed deposits debt funds
English summary

ఎఫ్‌డీలు కాకుండా అధిక వ‌డ్డీ వ‌చ్చే ఇత‌ర మార్గాలేవి? | as fixed deposit interest rates rates are plunges here are the alternative investments

As interest rates on fixed deposits are trending down, here are a few alternatives to get extra returns. However, whenever an asset gives or claims to give higher returns than bank deposits or government securities, it comes with associated risks.
Story first published: Monday, May 29, 2017, 10:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X