English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

పెట్టుబ‌డి ప్రారంభంలోనే ఈ 9 విష‌యాలు తెలుసుకోవాల్సిందే...

రాబడి కోసం పెట్టుబడి జాబితా నిర్వహణ గురించి, ఒక పెట్టుబడి దారుగా మీ వడ్డీ కి తగినంత రక్షణ ఉంటుందా అనేది ఆలోచించాలి. కానీ ఖర్చులు, ప‌న్నులు అనేవి ఆర్ధిక ప్ర‌ణాళిక‌లో భాగాలే అని గుర్తుంచుకోవాలి. వివిధ

Written by: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

రాబడి కోసం పెట్టుబడి జాబితా నిర్వహణ గురించి, ఒక పెట్టుబడి దారుగా మీ వడ్డీ కి తగినంత రక్షణ ఉంటుందా అనేది ఆలోచించాలి. కానీ ఖర్చులు, ప‌న్నులు అనేవి ఆర్ధిక ప్ర‌ణాళిక‌లో భాగాలే అని గుర్తుంచుకోవాలి. వివిధ ర‌కాల‌ పెట్టుబ‌డులు రాబడిని పెంపొందించి మీకు డబ్బును సంపాదించి పెడతాయి. అయితే అన‌వ‌స‌ర‌పు ఖ‌ర్చులు మీ రాబడికి దెబ్బే కాకుండా, మొత్తం ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది, ఈ పద్ధతి పెట్టుబడికి, రాబడి రావడానికి ఎక్కువ కాలం అందుబాటులో ఉండక పోవచ్చు.

రాబడి మీద ఖర్చుల ప్రభావం గణనీయంగా ఉంటుంది. ఉదాహరణకు, 20 సంవత్సరాల పెట్టుబడి సమయంలో కేవలం వార్షిక ఖర్చులు ఏడాదికి 1% పెరిగినా పెట్టుబ‌డి మీద తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది. మీ పెట్టుబడి తుది విలువ లో దాదాపు 16% వరకు వ్యత్యాసం ఉంటుంది. మొత్తం కాలపరిమితి 25 సంవత్సరాలు ఉంటే, ఈ తేడా 20% వరకు పెరుగుతుంది. అదే విధంగా, మీరు సంపాదించే ప్రతిఫలాల చెల్లింపులపై ప‌న్నులు ఉంటాయి, అది మీరు మరింత పెట్టుబడి పెట్టి రాబడి పొందాలి అనుకున్నపుడు సన్నగిల్లుతుంది. మీ రాబడి ప్రక్రియని, పెట్టుబడులపై వాటి ప్రభావాన్ని అర్ధం చేసుకోవడానికి ఖర్చులు, ఫీజులు, ప‌న్నుల‌ను గుర్తించే సామర్ధ్యం గురించి సరైన విశ్లేష‌ణ చేసుకోవాలి. అందుకోసం ఉప‌యోగ‌ప‌డే క‌థ‌నం ఇది. చ‌ద‌వండి మ‌రి.

1. పెట్టుబడి పెట్టేటపుడు నేను కట్ట వలసిన ఫీజుల వివరాలు ఏమిటి?

వివిధ పెట్టుబ‌డులు ఎలాంటి రుసుముల‌ను క‌లిగి ఉంటాయి. దీనితో పాటు, ఇతర విషయాలు: కమిషన్లు, బ్రోకరేజ్, ఫీజులు మొదలైనవి. సాధారణంగా, ఇవన్నీ ఒకసారి కట్టవలసినవే, ఆ లావాదేవీలతో అనుసంధానించబడి ఉంటుంది. అవి పెట్టుబడి విలువ శాతం మీద వసూలు చేసి ఉండవచ్చు (స్టాక్ బ్రోకర్ కి బ్రోకరేజ్ చార్జీలు వంటివి) లేదా ఒక నిర్దిష్ట మొత్తం (మ్యూచువ‌ల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ల కు చెల్లించేవి) అయి ఉండొచ్చు.

2. పెట్టుబడి నిర్వహణ, హోల్డింగ్, రిడీమ్ చేయడానికి అయ్యే ఖర్చు ఎంత?

షేర్లు, డిబెంచ‌ర్లు వంటి పెట్టుబడులు, స్టాక్ ఎక్సేంజ్ లో కొనుగోలు చేస్తాము, వీటి నిర్వహణకు, హోల్డింగ్‌, లావాదేవీలకు డీమ్యాట్, బ్రోకింగ్ ఖాతాలు అవసరం. ఇవన్నీ పెట్టుబడి నిర్వహించడానికి అయ్యే ఖర్చులో ఇమిడి ఉంటాయి. కొన్ని పెట్టుబడులకు నిష్క్రమించే సమయంలో రుసుములు ఉంటాయి, మ్యూచువ‌ల్ ఫండ్లకు ఎగ్జిట్ చార్జ్ లు ఉంటాయి, ఇది పెట్టుబడి రాబ‌డి విలువను తగ్గిస్తుంది.

3. ఫీజు అందుబాటులో ఉంటుందా? నియంత్రణా పరిమితులు ఉంటాయా?

కొన్ని పెట్టుబ‌డుల‌పై విధించే రుసుముల‌కు గ‌రిష్ట ప‌రిమితుల‌ను నియంత్రణ సంస్థ‌లు నిర్ణ‌యిస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఖ‌ర్చులు, నిష్క్ర‌మ‌ణ చార్జీల‌ను సెబీ, యాంఫీ నిర్ణ‌యిస్తాయి. గరిష్ఠ పరిమితులపై అనుసంధానంతోనే వాస్త‌వ రుసుములు వసూలు చేయబడతాయి, ఇవి ఒక పెట్టుబడి నిర్వహణాదారుడికి, ఆర్ధిక సేవ అందించే వారికి ఎంత పోటీ ఉందొ తెలియచేస్తుంది. డీపీ(డిపాజిట‌రీ పార్టిసిపెంట్‌) వ‌సూలు చేసే చార్జీలు, వాటికి గరిష్ఠ పరిమితులు ఉండవు, మీరు మంచి డీల్ పొందడానికి అందుబాటులో కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు మీరు వాటిని ఉపయోగించక పోయినప్పటికీ సేవల కోసం చార్జీలు వసూలు చేస్తారు జాగ్రత్త.

4. పెట్టుబ‌డుల కొన‌సాగింపు స‌మ‌యంలో ఖ‌ర్చులు ఉంటాయా?

కొన్ని పెట్టుబ‌డులకు పెట్టుబడి కాలమంతా ఫీజు వసూలు చేస్తాయి, అవి పెట్టుబడిని నిర్వహించడానికి అయ్యే ఖర్చులు. నేషనల్ పెన్షన్ సిస్టం, మ్యూచువ‌ల్ ఫండ్స్, యూనిట్ లింక్డ్ పెట్టుబడులు ఇందులోనివే. అన్ని ఖర్చుల జాబితాకు చెందిన ఫీజు రుసుము షెడ్యూలు ఉందేమో అడగండి. డీమ్యాట్ ఖాతాకు ఏటా వార్షిక రుసుము ఉన్న సంగ‌తి మీకు తెలిసిందే.

5. ఒక పెట్టుబడి మీద అయ్యే ఖర్చు చార్జీల సమాచారాన్ని నేను ఎక్కడ తెలుసుకోవాలి?

సాధారణంగా, ఏదైనా పెట్టుబడికి సంబంధించిన అక్కడ అందించే పత్రాలు త‌త్సంబ‌ధిత‌ ఖర్చుల గురించి సమాచారాన్ని తెలియచేస్తాయి. మీ పెట్టుబడిని ఎలా అన్నిరకాల ఖర్చులు ప్రభావితం చేస్తాయో వివరించే ఒక వివరణ పట్టికను అక్కడ అడగండి. ఇప్పుడు అన్ని ఆర్థిక సంస్థ‌ల వెబ్‌సైట్లు త‌మ సైట్ల‌లో వివిధ ఫీజులు, రుసుముల గురించి ఇస్తున్నాయి.

6. అద‌న‌పు రుసుములు ఏమైనా ఉంటాయో

అదనపు ఫీజు, పెనాల్టీలను ఆకర్షించే పన్నుల గురించి పెట్టుబడి సేవలను అందించే వ్యక్తిని అడగండి. ఉదాహరణకు, బ్యాంక్ అకౌంట్ లో ఒక నిర్దిష్టమైన మొత్తాన్ని ఉంచనపుడు కొంత ఫీజు చెల్లించాల్సి వస్తుంది, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) మన కాంట్రాక్ట్ ముగియక ముందే సరెండర్ చేస్తే కొంత వడ్డీ పడుతుంది, అధిక విలువ కలిగిన లావాదేవీలకు బ్రోకింగ్ చార్జీలు తక్కువ ఉండొచ్చు.

7. అదృశ్య ఖర్చులు ఏమైనా ఉన్నాయా?

ఆర్థిక సంస్థ‌ల వారు చార్జీలు, ఖర్చులు మొద‌ట్లో పేర్కొనక‌పోయినప్పటికీ, అదృశ్య ఖర్చులు మీ పెట్టుబడిని తగ్గించవచ్చు. ఉదాహరణకు, దస్త్రాలలో మ్యూచుయల్ ఫండ్ సెక్యూరిటీలు కొనుగోలు, అమ్మకాలు జరిగినపుడు, అందులో లావాదేవీ చార్జీలు ఉంటాయి, అవి ఆ స్కీములో పెట్టుబడిదారులచే పరోక్షంగా ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఇలాంటి ఖర్చులు మీ రాబడిని పెంచడంలో ఎలా పనిచేస్తాయో అడిగి తెలుసుకోండి.

8. ఫీజు వసూలు చేయబడుతుంది అన్న సమాచారం నాకు ఎలా తెలుస్తుంది?

పెట్టుబడి లేదా ఆర్ధిక సంస్థ‌ నుండి మీకు ఫీజు, ఖర్చుల వసూల వివరాలకు సంబంధించిన ఒక అకౌంట్ స్టేట్మెంట్ పంపించబడుతుంది. అందులో కొన్ని ఖర్చులు విలువ లెక్కించే ముందే పెట్టుబడిపై చార్జీలు వసూలు చేస్తాయని గుర్తుంచుకోండి. ఇవి అకౌంట్ స్టేట్మెంట్ లో కనిపించవు. ఈ సమాచారాన్ని తెలుసుకుంటూ, ఏమైనా మార్పులను బేరీజు వేసుకుంటూ, అలాగే వివరాలను తెలుసుకుంటూ తరచుగా ఎలా జరుగుతున్నాయో అడగాలి.

9. సలహాదారు లేదా ఉత్పత్తి పంపిణీదారు, సేవలు పొందే ప్రతిఫలం ఏమిటి?

సలహాదారు నష్టపరిహారం గురించి అడగండి, ఆ ప్రోడక్ట్ లేదా సేవ మీ న‌ష్ట‌భ‌యాన్ని దృష్టిలో పెట్టుకుని సిఫార్సుచేయ బడిందా లేదా సలహాదారు ప్రయోజనం కోసమా అనేది మీరు తెలుసుకోండి. నష్టపరిహారం మొత్తం, లెక్కింపు ఆధారాలు, దానినుండి ఎవరు పొందుతారు అనే సంబంధిత ప్రశ్నలు ఉంటాయి.
కొన్ని ఖర్చులను మీరే భరించాలి, మొద‌టే చ‌ర్చించ‌డ ద్వారా, మంచి రేట్ నిర్ధారించడం ద్వారా కిందకు తీసుకు రావచ్చు. సంబంధిన ఖర్చులు, టాక్సులపై ఆధారపడి, ఖర్చులను పెంచుకోవడానికి పెట్టుబడులను మీరే మార్చుకోవచ్చు కూడా, ఉదాహరణకు, ఒక వ్యక్తి బ్రోకరేజ్, డిమాట్ ఖర్చులు పొదుపు చేసుకోవడానికి తరచుగా ట్రేడింగ్ చేసుకోవచ్చు.
వారి స్వంతంగా, ఖర్చులు నిర్దిష్టంగా ఉంటాయి, కానీ కొంత సమయం తరువాత కొంత ఎక్కువ మొత్తాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడానికి తెలియజేసిన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం, ఖర్చులు, పన్నుల నుండి ఏ విధంగా బ‌య‌ట‌ప‌డాలో తెలుసుకోవడం చాలా అవసరం.

Read more about: invest, investments, fees, penalty
English summary

9 questions to ask before investing

You would think that managing an investment portfolio for returns and risk should be sufficient to protect your interests as an investor. But costs and taxes are an integral part of financial products, and they can bleed the returns your money can earn. Not only does it take a bite out of your returns, but you miss out on compounding benefits too as this portion is no longer available to be invested and earn returns.
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC