For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2017 ఏప్రిల్ త‌ర్వాత ఆదాయ‌పు ప‌న్ను విష‌యంలో 10 కీల‌క మార్పులు

మామూలుగా నిపుణుల సాయం లేకుండా ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌డం సామాన్యుల‌కు క‌ష్ట‌మే. దీన్ని దృష్టిలో పెట్టుకుని రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులకు(వ్యాపార ఆదాయం కాకుండా) ఒకే పేజీ ప‌న్ను రిట‌ర్ను ఫ

|

లోక్‌సభలో ఫైనాన్స్ బిల్ పాస్ అవడంతో.. 2017-18 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రక్రియను కేంద్రం పూర్తి చేసింది. 2017 బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్ను ప్రతిపాదనలు ఇప్పుడు చట్టంగా రూపుదిద్దుకున్నాయి. దీంతో ఆదాయపు పన్ను విషయంలో ఏప్రిల్ 1 నుంచి జ‌ర‌గ‌నున్న 10 కీలక మార్పులు ఏంటో తెలుసుకుందాం.

1. రూ.12,500 ఆదా

1. రూ.12,500 ఆదా

రూ. 2.5 లక్షలు- రూ. 5 లక్షల మధ్య ఆదాయం క‌ల‌వారికి, ఆదాయపు పన్ను 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గనుంది. దీంతో ఏడాదికి రూ. 12,500 పన్ను భారం త‌గ్గుతుంది. కోటి ఆదాయం పైబ‌డిన వారికి సర్‌ఛార్జ్‌, సెస్‌లతో కలుపుకుని రూ. 14, 806 రూపాయలు ఆదా కావొచ్చు.

2. ప‌న్ను రిబేటు తగ్గింపు

2. ప‌న్ను రిబేటు తగ్గింపు

ఆదాయం రూ. 3.5 లక్షల ఉన్న వారికి పన్ను రిబేటును ఇంత‌కుముందు ఉన్న రూ. 5వేల‌ నుంచి రూ. 2,500కు తగ్గించారు(గతంలో ఇది రూ.5 లక్షలుగా ఉండేది). ప‌న్ను, రిబేట్‌లలో మార్పుల ఉమ్మడి ప్రభావంతో గతంలో రూ. 3.5 లక్షల ఆదాయంలోపు ఉన్నవారు రూ. 5,150 పన్ను చెల్లించాల్సి ఉండ‌గా.. ఈ ఏడాది రూ. 2,575 చెల్లిస్తే సరిపోతుంది.

3. సంప‌న్నుల‌కు స‌ర్‌చార్జీ

3. సంప‌న్నుల‌కు స‌ర్‌చార్జీ

రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి లోపు ఆదాయం ఉన్న సంపన్నులకు పన్నుపై పది శాతం సర్‌ఛార్జ్ విధించారు. అలాగే రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం క‌లిగిన ధ‌నిక వ‌ర్గాల‌పై ఈ సర్‌ఛార్జ్ 15 శాతంగా కొన‌సాగ‌నుంది.

4. స్థిరాస్తుల్లో దీర్ఘ‌కాలిక రాబ‌డి కాల‌ప‌రిమితి 3 నుంచి 2 ఏళ్ల‌కు

4. స్థిరాస్తుల్లో దీర్ఘ‌కాలిక రాబ‌డి కాల‌ప‌రిమితి 3 నుంచి 2 ఏళ్ల‌కు

స్థిరాస్థులపై పెట్టుబడులను దీర్ఘ‌కాలిక రాబ‌డులుగా పరిగణిచేందుకు అవసరమైన కాలపరిమితిని 3 ఏళ్ల నుంచి 2 సంవత్సరాలకు తగ్గించారు. దీంతో స్థిరాస్తులపై 2 సంవత్సరాలకు మించిన పెట్టుబడులపై పన్ను 20 శాతానికి పరిమితం చేయడంతో పాటు, తిరిగి పెట్టుబడులు చేయడంపై పలు మినహాయింపులకు అర్హత లభిస్తుంది. అంటే ఇంత‌కు ముందు స్థిరాస్తుల‌పై స్వ‌ల్ప‌కాలిక రాబడులుగా రెండేళ్ల‌కే ఎక్కువ రాబ‌డి ప‌న్ను చెల్లించాల్సి ఉండ‌గా అది దీర్ఘ‌కాలిక రాబ‌డి కావ‌డంతో ప‌న్ను భారం త‌గ్గుతుంది.

5. బేస్ ఇయ‌ర్(ఆధార సంవ‌త్స‌రం మార్పు)

5. బేస్ ఇయ‌ర్(ఆధార సంవ‌త్స‌రం మార్పు)

భూముల్లాంటి స్థిరాస్తులు ఉన్న వ్య‌క్తులు వాటిని అమ్మితే వ‌చ్చిన మూల‌ధ‌న లాభాల‌ను ద్ర‌వ్యోల్బ‌ణం ఆధారంగా లెక్కిస్తారు. అయితే దీనికి సంబంధించి ఆధార సంవ‌త్స‌రం ఎప్ప‌టి నుంచో 1981గానే ఉంది. ఏప్రిల్ 1,1981కు ముందు కొనుగోలు చేసిన ఆస్తుల విష‌యంలో స‌మ‌స్య‌లు ఉన్నాయి. స‌రైన స‌మాచారం లేక‌పోవ‌డంతో ఈ ఆస్తుల స‌రైన మార్కెట్ ధ‌ర‌(ఫెయిర్ మార్కెట్ వాల్యూ) నిర్ణ‌యించ‌డం స‌వాలుగా ఉంది. ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇందుకు సంబంధించి బేస్ ఇయ‌ర్‌(ఆధార సంవత్స‌రం)ను ఏప్రిల్ 1,1981 నుంచి ఏప్రిల్ 1,2001కు మారుస్తున్న‌ట్లు బ‌డ్జెట్ సంద‌ర్భంగా జైట్లీ ప్ర‌క‌టించారు. దీనివ‌ల్ల స్థిరాస్తి లావాదేవీల్లో పార‌ద‌ర్శ‌క‌త పెరుగుతుంది.

6. కొన్ని నోటిఫైడ్ బాండ్ల‌లో రీఇన్వెస్ట్‌మెంట్ల‌కు ప‌న్ను మిన‌హాయింపు

6. కొన్ని నోటిఫైడ్ బాండ్ల‌లో రీఇన్వెస్ట్‌మెంట్ల‌కు ప‌న్ను మిన‌హాయింపు

అంతే కాకుండా, నోటిఫైడ్ రెడీమబుల్‌ బాండ్లలో కేపిటల్ గెయిన్స్‌ను తిరిగి పెట్టుబ‌డులు పెడితే పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఇది ఎన్‌హెచ్ఏఐ, ఆర్‌ఈసీ పెట్టుబడుల‌కు అద‌నం.

7. ఒకే పేజీలో రిట‌ర్నులు

7. ఒకే పేజీలో రిట‌ర్నులు

మామూలుగా నిపుణుల సాయం లేకుండా ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌డం సామాన్యుల‌కు క‌ష్ట‌మే. దీన్ని దృష్టిలో పెట్టుకుని రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులకు(వ్యాపార ఆదాయం కాకుండా) ఒకే పేజీ ప‌న్ను రిట‌ర్ను ఫారంను ప్ర‌వేశ‌పెట్టారు. ఈ విభాగంలో మొదటిసారి పన్ను రిట‌ర్నులు దాఖలు చేసే వారిపై సహజంగానే స్క్రూటినీ ఉండదు.

8. పన్ను రిట‌ర్నులు ఆల‌స్య‌మైతే అంతే...

8. పన్ను రిట‌ర్నులు ఆల‌స్య‌మైతే అంతే...

2017-18 ఆర్థిక సంవత్సరానికి పన్ను రిటర్నుల‌ను ఆలస్యంగా దాఖ‌లు చేస్తే కాస్త ఎక్కువ ఖ‌ర్చ‌వుతుంది. అంట‌టే 2018 డిసెంబర్ 31వరకూ దాఖలు చేసినవారు రూ. 5,000వేలు, ఆ తర్వాత దాఖలు చేసే వారు రూ. 10వేలు అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న అల్పాదాయం క‌ల పన్ను చెల్లింపుదారులపై మాత్రం ఈ పెనాల్టీని రూ. 1000గా నిర్ణ‌యించారు.

9. 2017-18 నుంచి ఆర్‌జీఈఎస్ఎస్ పెట్టుబ‌డుల‌కు మిన‌హాయింపు ఉండ‌దు

9. 2017-18 నుంచి ఆర్‌జీఈఎస్ఎస్ పెట్టుబ‌డుల‌కు మిన‌హాయింపు ఉండ‌దు

లిస్టెడ్ ఈక్విటీ షేర్లు లేదా ఈక్విటీ ఓరియెంటెడ్ ఫండ్స్‌లో లిక్విడ్ యూనిట్స్‌లో మొదటిసారి పెట్టుబడులకు మినహాయింపును ఇచ్చే రాజీవ్ గాంధీ ఈక్విటీ పొదుపు ప‌థ‌కాని(ఆర్‌జీఈఎస్ఎస్ )కి 2017-18 నుంచి ఉపసంహరిస్తున్నారు. ఒకవేళ ఏప్రిల్ 1, 2017లోపు ఈ స్కీమ్ కింద మినహాయింపు పొందితే, ఈ మినహాయింపును మరో రెండేళ్ల పాటు కొన‌సాగుతుంది.

10. ప‌న్ను రిట‌ర్నుల కాల‌ప‌రిమితి రెండేళ్ల నుంచి మార్పు

10. ప‌న్ను రిట‌ర్నుల కాల‌ప‌రిమితి రెండేళ్ల నుంచి మార్పు

ప‌న్ను రిట‌ర్నుల‌ను పునస్సమీక్షించేందుకు కాలపరిమితిని రెండేళ్ల నుంచి అదే ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు లేదా అసెస్మెంట్ ఏడాది చివరకు.. ఏది త్వరగా ముగియనుంటే అంత‌లోపు ప‌న్ను రిట‌ర్నుల‌ను ఫైన‌ల్ చేయాల్సిందే.

English summary

2017 ఏప్రిల్ త‌ర్వాత ఆదాయ‌పు ప‌న్ను విష‌యంలో 10 కీల‌క మార్పులు | 10 major income tax changes from april 1

With the passage of the Finance Bill on Wednesday, the Lok Sabha has completed the budgetary exercise for 2017-18. The tax proposals in the Budget 2017 have now become law. Below are 10 most important income-tax changes that will affect you april 2017.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X