For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగ బీమా గురించి తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు

ఆటో మేష‌న్ నేప‌థ్యంలో సాఫ్ట్‌వేర్లో ఉద్యోగాలు కోల్పోతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అంతే కాకుండా ఎక్కువ వాల్యూయేష‌న్‌తో స్టార్ట‌ప్‌లో ఉన్న సంచ‌ల‌నం కార‌ణంగా మొద‌ట్లో ఉద్యోగుల‌ను బాగానే నియ‌మించుకున్

|

అందరూ ఉద్యోగాలు కోల్పోతున్న ఈ సమయంలో, మీరు నిరుద్యోగ బీమా తీసుకోవాల్సిన అవసరం ఉందా?
ఆటో మేష‌న్ నేప‌థ్యంలో సాఫ్ట్‌వేర్లో ఉద్యోగాలు కోల్పోతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అంతే కాకుండా ఎక్కువ వాల్యూయేష‌న్‌తో స్టార్ట‌ప్‌లో ఉన్న సంచ‌ల‌నం కార‌ణంగా మొద‌ట్లో ఉద్యోగుల‌ను బాగానే నియ‌మించుకున్నారు. ప్ర‌స్తుతం నిర్ల‌క్ష్యంగా ఉద్యోగుల‌ను తీసేస్తున్నారు.ఈ నేప‌థ్యంలో ఉద్యోగం కోల్పోతే ప‌రిస్థితి ఏంటో, ఏ విధంగా ఆ ప‌రిస్థితిని నిరుద్యోగ బీమా ద్వారా నిల‌బెట్టుకోవ‌చ్చో తెలుసుకుందాం.

ఉద్యోగాల‌ను తొలగిస్తున్న వాటిలో ఎల్ అండ్ టీ, స్నాప్‌డీల్‌

ఉద్యోగాల‌ను తొలగిస్తున్న వాటిలో ఎల్ అండ్ టీ, స్నాప్‌డీల్‌

1. ఎల్ అండ్ టీ ఉద్యోగాల్లో కోత విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇంజినీరింగ్ దిగ్గజమైన ఎల్ & టీ, 2017 ప్ర‌థ‌మార్ధంలో భారత దేశంలొనే భారీగా 14000 మందిని ఉద్యోగాల నుండి తొల‌గిస్తోంది. మీడియాలో వస్తున్న వార్తలు నిజమైతే కనుక , స్నాప్ డీల్ మరియు మైక్రోసాఫ్ట్ లాంటి మరిన్ని ఇతర కంపెనీలు కూడా అదే దారిలొ వెళ్తూ వారి ఉద్యొగుల సంఖ్యను తగ్గించుకోనున్నాయి.

 2. ఇంత మంది ఉద్యోగాలు కోల్పోయారా?

2. ఇంత మంది ఉద్యోగాలు కోల్పోయారా?

మన దేశంలో ఉత్పాదన మరియు ఎగుమతి వ్యాపారంలో ఉన్న 3 లక్షల కంటె ఎక్కువ చిన్న, అతి చిన్న, మధ్య మరియు భారీ పరిశ్రమలకు ప్రతినిధ్యం వహించే అఖిల భారత ఉత్పాదకుల సంఘం ( ఏ . ఐ . ఎం . ఓ ) జరిపిన అధ్యయనం ప్రకారం, పెద్ద నోట్ల మార్పిడి వలన మొదటి 34 రోజులలో చిన్న మరియు అతి చిన్న పరిశ్రమలలో 35 శాతం ఉద్యొగాలు కోల్పోయారని, 50 శాతం ఆదాయం తగ్గిందని , అలాగె మార్చి 2017 లోపు 60 శాతం మంది ఉపాధి కోల్పోటంతోపాటు 55 శాతం ఆదాయం తగ్గుతుందని తెలిపింది.

3. తొల‌గింపు భ‌యాలు...

3. తొల‌గింపు భ‌యాలు...

ఎవరైనా సరే ఉద్యోగంలో కోరుకునేది ఉద్యోగ భద్రతనే. కాని వృత్తి విపణి లో చోటుచేసుకుంటున్న ఆటుపోట్ల కారణంగా నిత్యం ఉద్యొగం ఉంటుందా లేదా అన్న భయంలొ బ్రతకవలసి వస్తుంది, ముఖ్యంగా ప్రయివేట్ ఉద్యోగస్తులకు ఇది తప్పదు. సమీప భవిష్యత్తులో ఉద్యోగం కోల్పొయే అవకాశం ఉన్న ఉద్యొగాలు చేస్తున్న వారు ఉద్యోగం కోల్పొయినప్పుడు కలిగె ఇబ్బందుల నుండి తప్పించుకోడానికి ఈ మధ్య నిరుద్యొగ బీమాను ఆశ్రయిస్తున్నారు.

4. నిరుద్యోగ బీమా అంటె ఏంటి?

4. నిరుద్యోగ బీమా అంటె ఏంటి?

నిరుద్యోగ బీమా లేదా ఆదాయ బీమాను స్వల్ప వ్యవధి రుణ రక్షణ పరిష్కారంగా చెప్పవచ్చు. ఈ బీమా ఉద్యొగం కోల్పోయినప్పుడు ఎదురయ్యె క్లిష్ట పరిస్థితులలో కొంత కాలం వరకు మీ రుణ వాయిదాలు కట్టడానికి సాయపడుతుంది.

ఈ విధంగా నిరుద్యోగ బీమా మీరు ఉద్యొగం నుండి తొలగింపబడినప్పుదు లేదా బర్తరఫ్ చేయబడినప్పుదు ప్రాధమికంగా మీ రుణ భాధ్యతల చెల్లింపులకు పనికొస్తుంది. ఈ బీమా అనారొగ్య భీమా, ప్రమాద బీమా, రుణ రక్షణ బీమాలతొ జత చేసి తీసుకోవచ్చు తప్ప విడిగా తీసుకోడానికి వీలు లేదు.

 5. ఈ భీమా వేటికి వర్తిస్తుంది ? మినహాయింపులేంటి ?

5. ఈ భీమా వేటికి వర్తిస్తుంది ? మినహాయింపులేంటి ?

ఉద్యోగం కోల్పొయిన సంధర్భంలో , మీ నెలసరి ఆదాయం లొ 50% వరకు సరిపడ మూడు వాయిదాలకు వర్తిస్తుంది. ఊద్యోగ నష్టం మాత్రమే కాదు, కొన్ని ప్రణాళికలు ప్రమాద గాయాల వల్ల కలిగే నష్టాలకు కూడా వర్తిస్తాయి. కాకపోతే , ఈ గాయాలకు అర్ధం కొంతవరకు అవయవ నష్టం లేదా ప్రమాదవశాత్తు మరణించడం.

6 . బీమా వ‌ర్తించ‌ని సంద‌ర్భాలు

6 . బీమా వ‌ర్తించ‌ని సంద‌ర్భాలు

"ఈ ప్రణాళిక స్వయం ఉపాధి వారికి లేదా నిరుద్యోగులకు, రాజీనామా చేసిన వారికి, పదవీ విరమణ పొందిన వారికి , ప్రొబేషన్ లొ ఉన్న వారికి, పేలవమైన ప్రదర్శన కారణంగా తొలగింపబడిన వారికి, అలాగే ఇంతకు ముందే అనారొగ్యం ఉన్నవారికి వర్తించదు " అని అంటున్నారు బ్యాంక్ బజార్.కాం, సి ఇ ఓ , అయిన ఆదిల్ షెట్టి.

అలాగే భీమా పొందిన వ్యక్తి వలన ఏదైనా మోసం , దగా , పేలవ ప్రదర్శన సంభవించినా లేదా యజమాని నియమాలను మనస్ఫూర్తిగా ఉల్లంఘించినా లేదా భీమా పొందిన వ్యక్తికి వ్యతిరేకంగా తీసుకున్న ఎటువంటి క్రమశిక్షణా చర్యల పై ఈ భీమా వర్తించదు.

7. వీటికి సైతం బీమా రాదు

7. వీటికి సైతం బీమా రాదు

"ఆదాయ బీమా ప్రణాళికలు బహుళ సంవత్సర భారీ రుణాలతో ,సాధారణంగా గృహ రుణాలతో కలిపి ఇస్తుంటారు. నామ మాత్ర రుసుము చెల్లింపు మీదనే ఈ బీమా లభిస్తుంది. ఈ బీమా పేలవ ప్రదర్శన, పదవీ విరమణ, మరియు రాజీనామా కారణాలకు వర్తించదు. బీమా అమలులోకి వచ్చిన సమయం నుండి సాధారణంగా 3 గృహ రుణ వాయిదాలను బీమా కంపెనీ వారు చెల్లిస్తారు" అంటున్నారు పాలసీ బజార్ .కాం ఆరోగ్య భీమా అధిపతి ,ధ్రువ్ సరిన్.

8. నిరుద్యోగ బీమాను అందిస్తున్న సంస్థ‌లేవి?

8. నిరుద్యోగ బీమాను అందిస్తున్న సంస్థ‌లేవి?

భారత బీమా రంగంలొ ఉద్యోగ బీమా సరికొత్త సంచలనం అని చెప్పచ్చు. కాకపోతే మన దేశంలో విడిగా ఉద్యోగ బీమాను ఏ సంస్థలు అందించడం లేదు. ఉద్యొగ బీమాతో పాటు అందించే కొన్ని ప్లాన్లు ఏంటంటే

1. హెచ్ డి ఎఫ్ సి ఎర్గొ వారి హోం సురక్ష ప్లాన్

2. రాయల్ సుందరం వారి సెఫ్ లోన్ షీల్డ్

3. ఐ సి ఐ సి ఐ లాంబార్డ్ వారి సెక్యుర్ మైండ్

9. ప్రిమియం ఎంత , బీమా ఎంతవరకు వర్తిస్తుంది?

9. ప్రిమియం ఎంత , బీమా ఎంతవరకు వర్తిస్తుంది?

ఇది స్వల్ప కాలికమైన బీమా మాత్ర‌మే, మొదట 5 సంవత్సరాలకు లభిస్తుంది ఆ తరువాత నుండి పునరుద్ధరించుకోవచ్చు.మాస్టర్ పాలసి యొక్క బీమా మొత్తంలొ కొద్దిపాటి మొత్తాన్ని ఈ బీమాకు ప్రీమియంగా చెల్లించి తీసుకోవచ్చు. ఉద్యొగం కోల్పోయె అవకాశం లేదా ప్రీమియం మొత్తం ఆధారంగా ఉద్యొగ బీమా తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.

10. మీరు ఈ బీమా తీసుకోవాలా ?

10. మీరు ఈ బీమా తీసుకోవాలా ?

మీ ఉద్యొగ పరిస్థితి నాజూకుగా ఉన్నా, మీ ఆదాయంలో చెప్పుకోదగ్గ భాగం గృహ రుణ వాయిదాలకు ఖర్చు అవుతూ ఉంటే గనుక ఈ బీమా తీసుకోడానికి పరిగణనలోకి తీసుకోవచ్చు.

ఈ బీమా మీరు వేరే ఉద్యోగం వెతుక్కునె స్వల్ప కాలంలో వాయిదాలు కట్టి మీకు సాయం చేస్తుంది. అయినప్పటికి , ఉద్యొగం కోల్పొయి నపుదు వాడుకునేందుకు అత్యవసర నిధులు ఉన్న వారికి ఈ బీమా అంతగా ఉపయోగకరం కాకపోవచ్చు. అలాగే ఈ బీమాకు 5 సంవత్సరాల తక్కువ కాల పరిమితి , ఈ పరిమితిలొ కేవలం ఒక్కసారి మాత్రమే వాడుకోవచ్చు. మీరు జీతంపై ఆధారపడే ఉద్యోగస్తులైతె ఈ బీమాను వాదుకోవచ్చు ,ఒకసారి వాడుకున్నాకా 1 నుండి 3 నెలలు భీమా అమలులో ఉంటుంది.

11. ప‌రిమితులు

11. ప‌రిమితులు

అందువలన , భారీ వాయిదాలు ఉన్నవారికి ఈ బీమా చాలా ఉపయోగకరం. అయినప్పటికీ, అన్ని బీమాలకు ఉన్నట్టే దేనికి కూడా పరిమితులున్నాయి. ఆదాయ భీమా ఉన్నప్పటికి ఈ బీమా అమలులోకి రాకపోవచ్చు. దేశంలో చాలా మంది ఉద్యోగస్తులు ఉద్యొగం నుండి తీసివేయబడరు అన్నది వాస్తవం. సాధారణంగా ఉద్యొగస్తుల తొలగింపు నుండి తప్పించుకోడనికి ప్రయత్నిస్తుంటారు ఎందుకంటే ఉద్యొగం కోల్పోవడాన్ని సామాజిక కళంకంగా భావిస్తారు. కంపెనీలు విలీనం మరియు కొనుగోలు జరిగినప్పుడు తప్ప మిగిలిన సంధర్భాలలో ఉద్యొగస్తులపై రాజీనామా చెయడానికి ఒత్తిడి చేస్తారు. మొత్తంగా చూసుకుంటె మీ రిస్కులను పక్కన పెట్టాలనుకుంటే, ఈ బీమా మీకు ఎదురయ్యే అరుదైన క్లిష్ట పరిస్థితులలొ మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆర్ధికంగా సాయపడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

12. ఆటోమేష‌న్‌పై ప్ర‌పంచ బ్యాంకు ఆందోళ‌న

12. ఆటోమేష‌న్‌పై ప్ర‌పంచ బ్యాంకు ఆందోళ‌న

ఆటోమేషన్ కారణంగా భారతదేశంలో భారీ ఎత్తున ఉద్యోగాలు కోల్పోనున్నట్టు ప్రపంచబ్యాంక్ హెచ్చరిస్తోంది. దాదాపు 69శాతం ఉద్యోగాల‌కు ఆటోమేష‌న్ కోతపెడుతుందని వ‌ర‌ల్డ్ బ్యాంకు అబిప్రాయ‌ప‌డింది. యాంత్రీకరణ, సాంకేతిక‌త‌ కారణంగా సంప్రదాయ పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతిందనీ, మ‌నుషులు నేరుగా చేసేఉద్యోగాలు నష్టపోతున్నామనీ, ఈ ధోరణి అమెరికాకు పరిమితం కాదనీ, ప్రపంచ దేశాల్లో ప్రతిచోటా ప్రజలు దీనికి ప్రభావితమవుతున్నారని ప్ర‌పంచ బ్యాంకు అధ్య‌క్షుడు జిమ్ యాంగ్‌ కిమ్ ఆందోళ‌న వ్య‌క్తప‌రిచారు.

Read more about: jobs snapdeal insurance
English summary

ఉద్యోగ బీమా గురించి తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు | Should you opt for a job-loss insurance cover if your job is unsecure

In one of India’s biggest-ever layoffs, engineering major Larsen & Toubro (L&T) shed 14,000 employees across businesses during the first half of fiscal 2017. Now, according to media reports, some other companies ranging from Snapdeal to Microsoft are also planning to trim their workforce over the coming months.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X