English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

ఐపీవోల్లో ఆఫ‌ర్ డాక్యుమెంట్‌ను అర్థం చేసుకోవ‌డం ఎలా?

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

దేశంలో ఏ స్టాక్ ఎక్స్చేంజీలో లిస్ట్ కాని కంపెనీ మొద‌టి సారి షేర్ల జారీ చేయ‌డం కోసం ప్ర‌తిపాద‌న‌ను తీసుకొస్తే దానిని ఐపీవో(ఇనిషియ‌ల్ ప‌బ్లిక్ ఆఫ‌ర్‌) అంటారు. అయితే మొద‌టిసారి ఐపీవోలు కొనేవారికి చాలా సందేహాలు ఉంటాయి. ఇందులో అతి ముఖ్య‌మైన అంశం ప్ర‌తిపాద‌న ప‌త్రం(ఆఫ‌ర్ డాక్యుమెంట్‌). ఆఫ‌ర్ డాక్యుమెంట్ విభాగం ముఖ్యంగా ప్రతిపాదన పత్రం లోని అంశాల గురించి ప్రస్తావిస్తుంది. ఈ క‌థ‌నంలో ఆఫ‌ర డాక్యుమెంట్లోని వివిధ అంశాల గురించి తెలుసుకుందాం.

కవర్ పేజి

ప్రతిపాదన పత్రం యొక్క కవర్ పేజి మీద, జారీచేసే కంపెనీయొక్క పూర్తి వివరాలు, లీడ్ మేనేజర్లు, మరియు రిజిస్ట్రార్లు, ప్రతిపాదించిన ఇష్యూల పరిమాణం, సంఖ్య, ధర, మరియు లిస్టింగుల వివరాలు ఇవ్వబడతాయి. క్రెడిట్ రేటింగ్ , మొదటి ఇష్యూకు సంబంధించిన రిస్క్‌, వంటి ఇతర వివరాలను కూడా వెల్ల‌డిస్తారు.

రిస్క్‌(ప్ర‌మాద భ‌య‌) అంశాలు.

ఇక్కడ జారిచేసే వారి యాజమాన్యం ఎదుర్కొన్న అంతర‌(ఇన్‌సైడ్‌), బాహ్య ప్రమాద భయ అంశాల గురించి వారి అభిప్రాయాన్ని ఇస్తారు. కంపెనీ ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్మెంట్ గురించి కూడా ప్రస్తావిస్తుంది. ఈ సమాచారం దస్తావేజు యొక్క తొలి పేజీలలో వెల్లడి చేస్తుంది. ఇది సంక్షిప్త ప్రాస్పెక్టస్ లో కూడా వెల్లడి చేయబడుతుంది. పెట్టుబడిదారులు ఏదైనా పెట్టుబడికి సంబంధించిన నిర్ణయం తీసుకొనే ముందుగానే అన్ని ప్రమాద భయ అంశాలగురించి అవగాహన కలిగి ఉండాలని సామాన్యంగా సలహా ఇవ్వటం జరుగుతుంది.

పరిచయం

పరిచయంలో పరిశ్రమ గురించి సంక్షిప్త వివరణ మరియు జారిచేసే కంపెనీ యొక్క వ్యాపారం, సంక్షిప్తంగా ప్రతిపాదన వివరాలు, ఆర్ధిక నిర్వహణ మరియు ఇతర వివరాలు ప్రస్తావిస్తుంది.
కంపెని గురించి, సాధారణ సమాచారం, మర్చెంట్ బాంకర్లు మరియు వారి బాధ్యతలు, బ్రోకర్ల వివరాలు / ఇష్యూ కు సిండికేట్ సభ్యులు, క్రెడిట్ రేటింగ్ ( ఋణ ఇష్యూల సందర్భంలో ), డిబెంచర్ ట్రస్టీలు ( ఋణ ఇష్యూల సందర్భంలో ), పర్యవేక్షణ చేస్తున్న ఏజెన్సీ, క్లుప్తంగా బుక్బిల్డింగ్ ప్రక్రియ మరియు హామీగల ఒప్పందం ఇందులో ఇవ్వబడతాయి. కాపిటల్ స్ట్రక్చర్ యొక్క ముఖ్య వివరాలు, ప్రతిపాదన యొక్క వుద్దేశం, నిధుల అవసరం, నిధులు సమకూర్చే ప్రణాళిక, ఆచరణ యొక్క అనుసూచి, నిధుల ఏర్పాటు, అప్పటికే ఏర్పాటు చేసుకొన్న నిధుల యొక్క ఆధారం, ఇంకా అవసరమున్న నిధులకు ఏర్పాటు చేయబోయే ఆధారం, మధ్యస్థంగా నిధుల వాడకం, ఇష్యూల యొక్క మౌలిక నిబంధనలు, ఇష్యూ ధరకు ఆధారం, టాక్స్ లాభాలు ప్రస్తావించబడుతాయి.

మా గురించి(about us)

కంపెనీ వ్యాపార విశేషాలు, వ్యాపార వ్యూహాలు, పోటీ తత్వ బలాలు, భీమా, పరిశ్రమ నియమావళి ( వర్తించినప్పుడు ), చరిత్ర, మరియు కార్పరేట్ స్ట్రక్చర్, ముఖ్య ఉద్దేశ్యాలు, అనుబంధ వివరాలు, యాజమాన్యం మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, నష్ట పరిహారం, కార్పరేట్ గవర్నెన్స్, సంబంధిత పార్టి లావాదేవీలు, మారకపు రేట్లు, కరెన్సి ఆఫ్ ప్రెసెన్టేషన్, డివిడెన్డ్ పాలసి, ఆర్ధిక పరిస్థితులమీద యాజమాన్యపు చర్చలు మరియు విశ్లేషణ మరియు నిర్వహణ యొక్క ఫలితాలు ఇవ్వబడుతాయి.

ఆర్ధిక వివరణ పట్టిక

ఆర్ధిక వివరణ పట్టిక , గత మూడు సంవత్సరాలలో అకౌంటింగ్ పాలసీలలో మార్పులు మరియు అకౌంటింగ్ పాలసీలలో మరియు భారత దేశ అకౌంటింగ్ పాలసీలలో బేధాలు ఇవ్వబడతాయి.( కంపెని కనుక ఆర్ధిక వివరణ పట్టికలు యుఎస్ జిఎఎపి / ఐఎఎస్ ఇవ్వబడివుంటే )

న్యాయపర మరియు ఇతర సమాచారం

మిగిలి పోయి వున్న వ్యాజ్యాలు మరియు ప్రధానమైన అభివృధి, కమ్పెనీకి సంబంధించిన వ్యాజ్యాలు మరియు వాటి అనుబంధాలు, ప్రోత్సాహకులు, మరియు గ్రూప్ కంపెనీలు వెల్లడి చేయబడుతాయి. చివరి బాలన్స్ షీట్ తేదీ నుండి ప్రధానమైన అభివృధి, ప్రభుత్వ ఆమోదాలు,/ లైసెన్సింగ్ ఏర్పాట్లు, పెట్టుబడి ఆమోదాలు ( ఎఫ్ఐపిబి /ఆర్బిఐ మొ.), అన్ని ప్రభుత్వ మరియు ఇతర ఆమోదాలు, సాంకేతిక ఆమోదాలు, ఋణగ్రస్తత,మొ.వెల్లడి చేయబడుతాయి.

ఇతర క్రమబద్ద మరియు శాసనబద్ద వెల్లడులు.

ఈ శీర్షికన, దిగువ ఇచ్చిన సమాచారం ప్రస్తావించబడుతుంది.: ఇష్యూలకు అధికారం, సెబి ద్వారా నిషేధాలు, కంపెని కాపిటల్ మార్కెట్ ప్రవేశానికి అర్హత, హక్కు తిరస్కార నిబంధన, ప్రాంతీయ సంబంధ తిరస్కారం,పెట్టుబడిదారులకు సమాచార పంపిణీ, స్టాక్ ఎక్స్చేంజిలయొక్క తిరస్కార నిబంధన లిస్టింగులు, మారుమనిషిగా చెలామణి అవటం, కనిష్ఠ చందా, కేటాయింపు లేదా వాపసు చెల్లింపు ఆర్డర్ల లేఖలు, ఒప్పందాలు, నిపుణుల అభిప్రాయం, గత మూడు సంవత్సరాలలో ఆడిటర్ల మార్పు, ఇష్యూల ఖర్చు, లీడ్ మేనేజర్లకు ఇవ్వవలసిన జీతం ఇష్యూ యాజమాన్యానికి ఇవ్వవలసిన జీతం , రిజిస్ట్రార్లకు ఇవ్వవలసిన జీతం హామీ కమిషన్, బ్రోకరేజి మరియు అమ్మకపు కమిషన్, గతరైట్స్ మరియు పబ్లిక్ ఇష్యూలు, నగదు మీద గత ఇష్యూలు, నగదు తో కాకుండా ఇతర ఇష్యూలు, మిగిలి వున్న డిబెంచర్లు లేదా బాండ్లు, మిగిలి వున్న ప్రిఫరెంస్ వాటాలు, గత ఇష్యూలమీద కమిషన్ మరియు బ్రోకరేజి, రిసర్వులు లేదా లాభాల యొక్క కాపిటలైసేషన్, ఇష్యూలో చందా గా చేరటానికి ఎన్నిక, ఆస్తుల కొనుగోలు, ఆస్తుల తిరిగి విలువకట్టడం, వాటాల యొక్క వర్గాలు, ఈక్విటీ కొరకు స్టాక్ మార్కెట్ సమాచారం, కంపెని యొక్క వాటాలు, గత ఇష్యూలమీద జరిగిన నిర్వహణ మీద ముఖాముఖి గా జరిగిన ప్రమాణాలు, పెట్టుబడిదారుని ఫిర్యాదుల సవరింపుకొరకు యంత్రాంగం.

సమాచారం అందచేయటం.

ఈ శీర్షికన, దిగువ సమాచారాన్ని పొందుప‌రుస్తారు. ఇష్యూ యొక్క నిబంధనలు, ఈక్విటీ షేర్ల ర్యాంకింగ్, డివిడెండ్లు చెల్లించే పద్దతి, ముద్రిత విలువ మరియు ఇష్యూ ధర, ఈక్విటీ వాటాదారుని హక్కులు, మార్కెట్ వంతు, పెట్టుబడిదారునికి నామ ప్రతిపాదన సౌలభ్యం, ఇష్యూ ప్రక్రియ, వర్తిస్తే బుక్బిల్డింగ్ ప్రక్రియ, వేలం ఫారం, ఎవరు వేలం వేయవచ్చు, కనిష్ఠ మరియు గరిష్ఠవేలం పరిమాణం, వేలం ప్రక్రియ, వివిధ ధరల స్థాయిలో వేలం వేసే వేలం, ఎస్క్రో యంత్రాంగం, చెల్లింపుల నిబంధనలు, ఎస్క్రో కలెక్షన్ అకౌంట్ లో చెల్లింపులు, ఎలెక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బిడ్స్, బుక్ యొక్క బిల్డ్ అప్, మరియు వేలం సవరింపు, ప్రైస్ డిస్కవరి మరియు కేటాయింపు, హామీ పత్రం మీద సంతకం పెట్టటం, సెబి / ఆరొసి వద్ద ప్రాస్పెక్టస్ నమోదు చేసుకోవటం, చట్టపరంగా ప్రకటన ఇవ్వటం, కేటాయింపు ధృవీకరణ మరియు ఇష్యూలో కేటాయింపు. నియుక్తమైన తేదీ, సాధారణ సూచనలు, వేలం ఫారం నింపటానికి సూచనలు, చెల్లింపు సూచనలు, వేలం ఫారం సమర్పణ, ఇతర సూచనలు., దరఖాస్తు మరియు దరఖాస్తు నగదు ఫైసలా, హెచ్చుగా కట్టిన వేలం నగదు తిరిగి చెల్లింపుకు వడ్డి, కేటాయింపుకు ఆధారాలు, తగురీతిలో కేటాయింపు పద్దతి, తిరిగి చెల్లింపు ఆర్డర్లు పంపటం, సందేశాలు, కంపెనీ వాగ్దాన పత్రం, ఇష్యూల రాబడుల మొత్తం వినియోగం, భారత సెక్యూరిటీలు, విదేశి యాజమాన్య హక్కును నిరోధించటం, మొద‌లైన‌వి సైతం వివ‌రంగా ఇస్తారు.

ఇతర సమాచారం

ఈక్విటీ వాటాల యొక్క వివరణ మరియు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ వారి నిబంధనలు, ప్రధాన కాంట్రాక్ట్లు మరియు తనిఖీలకొరకు పత్రాలు, వెల్లడులు, నిర్వచనాలు, మరియుసంక్షేప రూపాలు వంటి ఇత‌ర స‌మాచారం సైతం ఉంటుంది.

గతంలోని లోపాల రికార్డ్ / ఆర్ధిక నేరాలు

పెట్టుబడిదారులు మినిస్ట్రీ ఆప్ కార్పొరేట్‌ ఎఫ్ఫైర్స్ వారు ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మరియు ప్రొటెక్షన్ ఫన్డ్ ఆర్ధిక సహాయం తో తయారుచేసిన వెబ్సైట్ www.watchoutinvestors.com కూడా చూడాలి. వివిధ క్రమబద్దం చేసే అధికారుల ( ఎంసిఎ, ఆర్బిఐ, సెబి, బిఎస్ఇ, ఎన్ఎస్ఇ మొ. ) చే ఆర్ధిక నేరాలకు నేరారోపణణ చేయబడ్డ వ్యక్తులు, చట్టప్రకారం విరుద్దంగా పోయిన వారికి, ఈ కార్యకలాపాలలో లేనివారికి, ఈ వెబ్సైట్ ఒక నేషనల్ రిజిస్ట్రీ గా ఉంటుంది.

Read more about: ipo, invest
English summary

How to understand offer document in an ipo-initial public offer

An initial public offering (IPO) is the first time that the stock of a private company is offered to the public. IPOs are often issued by smaller, younger companies seeking capital to expand, but they can also be done by large privately owned companies looking to become publicly traded.
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC