For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థ‌కాలు అంటే ఏమిటి?

దీర్ఘ‌కాలంలో పెట్టుబ‌డి వృద్ధి కోరుకునేవారికి స్టాక్ మార్కెట్ సంబంధం ఉన్న పెట్టుబ‌డులు బాగా ఉంటాయి. అందులో షేర్లు, బాండ్లు, డిబెంచ‌ర్లు, ఇత‌ర మ‌నీ మార్కెట్ సాధ‌నాలు ఉంటాయి. వీట‌న్నింటిలో ఎక్కువ రిస్క్

|

దీర్ఘ‌కాలంలో పెట్టుబ‌డి వృద్ధి కోరుకునేవారికి స్టాక్ మార్కెట్ సంబంధం ఉన్న పెట్టుబ‌డులు బాగా ఉంటాయి. అందులో షేర్లు, బాండ్లు, డిబెంచ‌ర్లు, ఇత‌ర మ‌నీ మార్కెట్ సాధ‌నాలు ఉంటాయి. వీట‌న్నింటిలో ఎక్కువ రిస్క్ తీసుకునేందుకు భ‌య‌ప‌డే వారికి ఈక్విటీ ఆధారిత‌ ప‌థ‌కాలు అనుకూలం. ఈక్విటీ మార్కెట్ల‌లో నేరుగా పెట్టుబ‌డి పెట్ట‌కుండా లాభాల‌ను ఆర్జించేవారి కోసం ఉద్దేశించిన‌వే ఈక్విటీ ఆధారిత‌ పొదుపు ప‌థ‌కాలు.

* ఈ ప‌థ‌కానికి సంబంధించి పెట్టుబ‌డుల‌ను ఈక్విటీ మార్కెట్‌లోని వివిధ కంపెనీల షేర్ల‌లో పెడ‌తారు.

* ఏదో ఒక రంగానికో, కంపెనీకో ఈ ఫండ్ల‌ను ప‌రిమితం చేయ‌రు.

* ఫండ్ నిర్వాహ‌కుడు ఫండ్ల‌ను నిర్వ‌హిస్తారు.
ఇంకా ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థ‌కాల గురించి స‌మ‌గ్ర వివ‌రాలు తెలుసుకుందాం.

రుసుములు:

రుసుములు:

* సాధార‌ణ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లాగే ఈఎల్ఎస్ఎస్ ప‌థ‌కంలోనూ ప్రారంభ ఛార్జీలు వ‌ర్తించ‌వు.

* మూడేళ్ల లాక్ ఇన్ పీరియ‌డ్ వ‌ర్తిస్తుంది కాబ‌ట్టి పెట్టుబడుల‌ను మూడేళ్ల వ‌ర‌కూ విత్‌డ్రా చేసుకునే వీలుండ‌దు.

* ఫండ్ నిర్వ‌హ‌ణ ఛార్జీలు మాత్రం ఆయా మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ను బ‌ట్టి ఉంటుంది.

ఈ ప‌థ‌కం వీరికి అనుకూలం:

ఈ ప‌థ‌కం వీరికి అనుకూలం:

* కొంత న‌ష్ట‌భ‌యాన్ని త‌ట్టుకునేలా, ప‌న్ను ఆదా ప‌థ‌కాల్లో పెట్టుబ‌డి పెట్టాల‌నుకునేవారికి

ఈఎల్ఎస్ఎస్ ప‌థ‌కం స‌రైన ఎంపిక‌.

* అప్పుడే సంపాద‌న మొద‌లుపెట్టిన యుక్త‌వ‌య‌సు వారికి ఈఎల్ఎస్ఎస్ ప‌థ‌కం అనుకూలం.

ఈ కోవకు చెందిన‌వారికి న‌ష్టాన్ని త‌ట్టుకునే సామ‌ర్థ్యంతో పాటు దీర్ఘ‌కాల ల‌క్ష్యాల‌కు ఈ ప‌థ‌కం ఉప‌క‌రిస్తుంది.

పెట్టుబ‌డి విధానం:

పెట్టుబ‌డి విధానం:

* ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థ‌కాల్లో రెండు విధాలుగా పెట్టుబ‌డి పెట్టేందుకు వీలుంటుంది. ఏక‌మొత్తంగా ఒకేసారి పెట్టుబ‌డి పెట్ట‌డం ఒక ప‌ద్ధ‌తి.

* మ‌రో విధానంలో క్ర‌మానుగ‌త పెట్టుబ‌డి విధానం (సిప్‌) ద్వారా నెల‌నెలా నిర్ణీత తేదీలో నిర్ణీత సొమ్మును పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు.

* సిప్ విధానంలో క‌నీసం రూ.500 నుంచి పెట్టుబ‌డి పెట్టేందుకు వీలుంటుంది.

పెట్టుబ‌డి ఆప్ష‌న్లు :

పెట్టుబ‌డి ఆప్ష‌న్లు :

* ఈఎల్ఎస్ఎస్ ప‌థ‌కానికి సంబంధించి గ్రోత్‌, డివిడెండ్ పే అవుట్ అనే రెండు ర‌కాల ఆప్ష‌న్లు

అందుబాటులో ఉన్నాయి.

* గ్రోత్ ఆప్ష‌న్ ద్వారా దీర్ఘ‌కాలంపాటు పెట్టుబ‌డి వృద్ధికి అవ‌కాశం ఉంటుంది.

* అదే డివిడెండ్ పే అవుట్ ఆప్ష‌న్‌ను ఎంచుకుంటే పెట్టుబ‌డిపై వ‌చ్చే లాభాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తీసుకోవ‌చ్చు. అంటే మూడేళ్ల లాక్ ఇన్ పీరియ‌డ్ స‌మ‌యం కోసం వేచిచూడ‌కుండా డివిడెండ్ చెల్లిస్తారు.

రాబ‌డి:

రాబ‌డి:

* దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డుల‌ను అందించిన చ‌రిత్ర ఈఎల్ఎస్ఎస్ ప‌థ‌కానికి ఉంది.

* స్టాక్ మార్కెట్ సూచీలు, సెన్సెక్స్‌, నిఫ్టీలు ఈఎల్ఎస్ఎస్‌కు బెంచ్‌మార్క్‌లా ప‌నిచేస్తాయి. దీనికి అనుగుణంగా రాబ‌డి ఉంటుంది.

న‌ష్ట‌భ‌యం :

న‌ష్ట‌భ‌యం :

ఈ ప‌థ‌కంలోని పెట్టుబ‌డుల‌ను ఈక్విటీ ఆధారిత షేర్ల‌లో పెడ‌తారు. స్టాక్ మార్కెట్లో లాభ‌న‌ష్టాలకు అనుగుణంగా పెట్టుబ‌డుల తీరు ఉంటుంది. స్వ‌ల్ప‌కాలంలో న‌ష్ట‌భ‌యం అధికంగా ఉంటుంది. అయితే దీర్ఘకాలంలో న‌ష్ట‌భ‌యం ప్ర‌భావం పెట్టుబ‌డుల‌పై త‌క్కువ‌గా ఉంటుంది.

ప‌న్ను వివ‌రాలు:

ప‌న్ను వివ‌రాలు:

* ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80 సీ ప్ర‌కారం ఈఎల్ఎస్ఎస్ ప‌థ‌కంలో పెట్టుబ‌డుల‌కు రూ.1.5ల‌క్ష‌ల వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.

* లాక్ ఇన్ పీరియ‌డ్ ఉంటుంది కాబ‌ట్టి ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డిని మూడేళ్ల క‌న్నా ముందే వెన‌క్కి తీసుకుంటే పెట్టుబ‌డిపై మిన‌హాయింపు పొందిన ప‌న్ను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

* డివిడెండ్ల ద్వారా వ‌చ్చే ఆదాయం పై ప‌న్ను ఉండ‌దు.

* దీర్ఘ‌కాలంలో పెట్టుబ‌డి ద్వారా వ‌చ్చే లాభాల‌కు ప‌న్ను వ‌ర్తించ‌దు.

Read more about: elss investments
English summary

ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థ‌కాలు అంటే ఏమిటి? | what is equity linked saving scheme and benefits of ELSS

Under Indian tax laws, savers have a complete range of tax saving instruments available to them. And yet, individuals often take sub-optimal investment decisions with their tax-saving investments. Deposits with long lock-ins that hardly pay anything more than inflation; insurance schemes that eat away a lot of the gains in agent commissions; Equity linked Savings Schemes (ELSS) of mutual funds chosen with scant regard to performance track-records--all these (and more) are often seen when it comes to tax-saving investments.
Story first published: Saturday, February 25, 2017, 17:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X