For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గృహ రుణ వ‌డ్డీ రేట్లు త‌గ్గాయోచ్.. మ‌రి మీ ప్ర‌ణాళిక ఏంటి?

ఇటీవ‌ల వివిధ బ్యాంకులు గృహ రుణ రేట్ల‌ను ఏ మేర‌కు త‌గ్గించాయో, ఎంత వ‌డ్డీ రేట్ల‌ను చెల్లించాల్సి వ‌స్తుందో తెలుసుకుందాం. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం గృహ రుణం తీసుకుని ఇల్లు కొనేవారి కోస‌మే ఈ క‌థ‌నం.

|

2022 నాటి క‌ల్లా అంద‌రికీ సొంతింటి క‌ల నెర‌వేర్చాల‌నేది ఎన్డీఏ ప్ర‌భుత్వ ఆశ‌యం. ప్ర‌తి రాజ‌కీయ పార్టీ గృహ వ‌స‌తి గురించి ఎన్నో హామీలిచ్చి, వాగ్దానాలు చేసిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుత ప్ర‌భుత్వం మాత్రం దీనిపై ఒక కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు వెళుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. మ‌రో వైపు పెద్ద నోట్ల మార్పిడి త‌ర్వాత రిజిస్ట్రేష‌న్లు, స్థ‌ల కొనుగోలు, అమ్మ‌కాలు మంద‌గించ‌డంతో స్థిరాస్తికి డిమాండ్ త‌గ్గింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం గృహ రుణం తీసుకుని ఇల్లు కొనేవారి కోస‌మే ఈ క‌థ‌నం.

స్థిరాస్తి నియంత్ర‌ణ బిల్లుతో మ‌న‌కేంటి?

స్థిరాస్తి నియంత్ర‌ణ బిల్లుతో మ‌న‌కేంటి?

న‌ల్ల‌ధ‌నం చలామ‌ణీ ఈ రంగంలోనే ఎక్కువ‌గా ఉంటుంద‌ని అంద‌రికీ తెలిసిన బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. మ‌నం ఒక ధ‌ర‌కు కొంటే రిజిస్ట్రేష‌న్ మ‌రో ధ‌ర‌కు చేయ‌డం ష‌రా మామూలే. ఈ రంగంలో వినిపించే మ‌రో మాట. అంతా బ్యాంకులో వ‌ద్దు. క్యాష్ కావాలి అని విక్ర‌య‌దారులు అడ‌గ‌డం చాలా మందికి ఎదుర‌య్యే అనుభ‌వం. వీట‌న్నింటిని క‌ట్ట‌డి చేసేందుకు ఒక వైపు న‌గ‌దు లావాదేవీల‌పై ఆంక్ష‌ల‌తో పాటు పెద్ద నోట్ల మార్పిడి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతోంది. అంతే కాకుండా కేంద్ర పట్ట‌ణాభివృద్ది శాఖ స్థిరాస్తి నియంత్ర‌ణ బిల్లును ప‌క‌డ్బందీగా రూపొందించింది. ఇటీవ‌లే రాష్ట్రాల‌ను సైతం దీనిపై నిబంధ‌న‌ల‌ను రూపొందించాల్సిందిగా కోరారు. దీనివ‌ల్ల బిల్డ‌ర్లు, వినియోగ‌దారుల మ‌ధ్య పార‌ద‌ర్శ‌క‌త‌కు చోటు ల‌భిస్తుంది. వినియోగ‌దారుల‌ను మోసం చేసే బిల్డ‌ర్లు, డెవ‌ల‌ప‌ర్ల ఆగ‌డాల‌కు అడ్డుకట్ట ప‌డే అవ‌కాశం ఉంది.

మెట్రో న‌గ‌రాల్లో అద్దె ఇంటికే మొగ్గు

మెట్రో న‌గ‌రాల్లో అద్దె ఇంటికే మొగ్గు

గ‌త ద‌శాబ్ద కాలంగా రియ‌ల్ ఎస్టేట్ ధ‌ర‌ల‌కే అడ్డు అదుపు లేకుండా పోయింది. కొంత కాలం మంద‌గించినా మెట్రో న‌గ‌రాల్లో స్థ‌లాల ధ‌ర‌లు ఎవ‌రూ కొన‌లేని స్థితికి వెళ్లాయంటే అతిశ‌యోక్తి కాదు. కానీ మ‌రోవైపు చూస్తే వినియోగ‌దారుల వ‌ద్ద స‌రైన స్థోమ‌త లేక‌పోవ‌డం, బ్యాంకు రుణాలు స‌క్ర‌మంగా అందుబాటులో లేక‌పోవ‌డం, ఒక‌వేళ రుణం మంజూరు జ‌రిగినా వ‌డ్డీ రేట్లు ఎక్కువ ఉండ‌టం వంటి కార‌ణాల రీత్యా చాలా మంది సొంత ఇంటి కొనుగోలు కంటే అద్దె ఇంట్లో ఉండేందుకు మొగ్గుచూపుతూ వ‌చ్చారు. వీట‌న్నింటిని కూలంక‌షంగా అధ్య‌య‌నం చేసిన ప్ర‌భుత్వం ఒక ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు వెళుతోంది. ముఖ్యంగా గృహ రుణాల మీద స‌త్వ‌ర దృష్టిని సారించింది.

స్థిరాస్తి రంగానికి ఊపు

స్థిరాస్తి రంగానికి ఊపు

ఆర్‌బీఐ స‌మీక్ష‌ల‌కు ముందు ప్ర‌తి సారి ఆర్థిక మంత్రిని ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ క‌లిసిన‌ప్పుడు డిమాండ్ పెరిగేందుకు, నిధుల ల‌భ్య‌త ఎక్కువ‌గా ఉండేలా చూసేందుకు రెపో రేట్ల‌ను(వ‌డ్డీ రేట్ల‌ను) త‌గ్గించాల‌ని కోర‌డం మ‌నం వార్త‌లో చూస్తుంటాం. ఒక వైపు నోట్ల ర‌ద్దుతో బ్యాంకుల వ‌ద్ద నిధుల ల‌భ్య‌త గ‌ణనీయంగా వృద్దిచెంద‌గా రిజ‌ర్వ్ బ్యాంక్ సైతం రేట్ల కోతతో స్థిరాస్తి రంగానికి మంచి ఊపునిచ్చింద‌నే చెప్పాలి. మొత్తానికి ప్ర‌భుత్వం, ఆర్‌బీఐ నిర్ణ‌యాల కార‌ణంగా వ‌డ్డీ రేట్లు దిగొచ్చాయి. గ‌త ఏడాది కాలంగా వివిధ స‌మ‌యాల్లో గృహ రుణ వ‌డ్డీ రేట్ల‌ను బ్యాంకులు గ‌ణ‌నీయంగా త‌గ్గించాయి. ఈ క్ర‌మాన్ని చూస్తే గృహ రుణాల‌ను తీసుకునే వారికి ఇదే మంచి త‌రుణం అనిపిస్తోంది. ఇక ఇంత‌కంటే వ‌డ్డీ రేట్లు త‌గ్గుతాయ‌ని ఆశించ‌డం అత్యాశే కాగ‌ల‌దు.

ఇంకా వ‌డ్డీ రేట్లు త‌గ్గుతాయా?

ఇంకా వ‌డ్డీ రేట్లు త‌గ్గుతాయా?

రాను రాను గృహ రుణాల‌పై వ‌డ్డీ రేట్లు త‌గ్గ‌డ‌మే కానీ పెరిగే అవ‌కాశం లేద‌ని ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణులు విశ్లేషిస్తున్న‌ప్ప‌టికీ ఇంకా త‌గ్గిస్తే బ్యాంకుల లాభ‌దాయ‌క‌త‌, నిర్వ‌హ‌ణల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డే అవ‌కాశం లేక‌పోలేదు. మొత్తానికి ఈ వివ‌ర‌ణ‌ల‌తో సంతృప్తి చెంది ఇక ఇల్లు కొందాం అని భావించే వారి కోస‌మే త‌దుప‌రి క‌థ‌నం. ఇటీవ‌ల వివిధ బ్యాంకులు గృహ రుణ రేట్ల‌ను ఏ మేర‌కు త‌గ్గించాయో, ఎంత వ‌డ్డీ రేట్ల‌ను చెల్లించాల్సి వ‌స్తుందో తెలుసుకుందాం. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం గృహ రుణం తీసుకుని ఇల్లు కొనేవారి కోస‌మే ఈ క‌థ‌నం.

 బ్యాంకులు సిద్దం.. మ‌రి మీరు...

బ్యాంకులు సిద్దం.. మ‌రి మీరు...

ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు వడ్డీ రేట్ల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచ‌డంలో ఎప్పుడు ముందుంటాయి. ఆంధ్రా బ్యాంక్‌, ఎస్‌బీఐ, కెన‌రా బ్యాంకు ఇటీవ‌ల వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించాయి. ప్ర‌యివేటు రంగంలోని ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ సైతం వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించాయి. గృహ రుణాల‌పై దీర్ఘ‌కాల వ‌డ్డీ రేట్ల‌ను ఆంధ్రా బ్యాంక్ 0.90% వ‌ర‌కూ, హెచ్‌డీఎఫ్‌సీ 0.45 మేర 8.70% వ‌ర‌కూ త‌గ్గించింది. కెన‌రా బ్యాంకు వ‌డ్డీ రేటును 8.45 శాతానికి త‌గ్గించింది.

ఆంధ్రా బ్యాంకు

ఆంధ్రా బ్యాంకు

స‌వ‌రించిన వ‌డ్డీ రేట్ల‌ను జ‌న‌వ‌రి 4 నుంచి అమల్లోకి ఉంటాయని ప్ర‌క‌టించిన ఆంధ్రా బ్యాంకు రుణ గ్ర‌హీత‌ల‌కు శుభ‌వార్త తెలిపింది. గృహ రుణాలు, వాహ‌న రుణాల‌పై ప్రాసెసింగ్ రుసుముల‌ను మార్చి 31 వ‌ర‌కూ ఎత్తివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

75 ల‌క్ష‌ల రూపాయ‌ల్లోపు రుణాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను 9.50% నుంచి 8.75 శాతానికి, 75 ల‌క్ష‌ల పైబ‌డి తీసుకునే రుణాల‌కు

వ‌డ్డీ రేట్ల‌ను 9.75% నుంచి 8.85 శాతం దాకా త‌గ్గించింది.

ఎస్‌బీఐ

ఎస్‌బీఐ

రూ. 20 ల‌క్ష‌ల నుంచి రూ. 75 ల‌క్ష‌ల లోపు తీసుకునే గృహ రుణాల‌కు వ‌డ్డీ రేట్ల‌ను ఎస్‌బీఐ బాగా త‌గ్గించింది. ఇటీవ‌ల 0.90% మేర త‌గ్గింపుతో నూత‌న గృహ రుణాలు 8.70- 8.65 శాతం మ‌ధ్య ఉండ‌నున్న‌ట్లు ఎస్‌బీఐ వెబ్‌సైట్లో పేర్కొంది. మ‌హిళ‌ల‌కు మ‌రింత సంతోషం క‌లిగించే విధంగా అద‌నంగా 0.05% త‌గ్గింపును ఇస్తోంది. రూ. 75 ల‌క్ష‌ల పైబ‌డి తీసుకునే రుణాల‌కు 9 శాతం వార్షిక వ‌డ్డీ అమ‌లవుతుంది. ఎస్‌బీఐ వ‌డ్డీ రేట్ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

హెచ్‌డీఎఫ్‌సీ

హెచ్‌డీఎఫ్‌సీ

హెచ్‌డీఎఫ్‌సీ దేశంలో రెండో అతిపెద్ద ప్ర‌యివేటు బ్యాంకు. ప్రైవేటు రంగంలో గృహ రుణాలంటే ఎక్కువ మంది మొగ్గుచూపేది దీని వైపే. ఈ బ్యాంకు వ‌డ్డీ రేట్ల‌ను 0.45% త‌గ్గించింది. రూ. 75 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉండే గృహ రుణాల‌పై కొత్త వ‌డ్డీ రేట్లు 8.70% ఉంటాయి. అంత‌కు మించిన రుణాల‌పై 8.75% ఉంటాయి. మ‌హిళ‌ల‌కు అద‌నంగా మ‌రో 0.05% రాయితీని క‌ల్పిస్తున్నారు.

హెచ్‌డీఎఫ్‌సీ వ‌డ్డీ రేట్ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

యాక్సిస్‌

యాక్సిస్‌

ప్రైవేటు రంగంలో మూడో అతిపెద్ద బ్యాంక‌యిన యాక్సిస్ వ‌డ్డీ రేట్ల‌ను 0.65-0.70% మేర త‌గ్గించింది. దీంతో వ‌డ్డీ రేట్లు 8.9% నుంచి 8.25-8.20% వ‌ర‌కూ ఉండ‌నుంది. వీటితో పాటు ప్రాసెసింగ్ చార్జీల కింద అద‌నంగా 0.20% మ‌రియు సేవా ప‌న్ను సైతం ఉంటుంద‌ని గ‌మ‌నించ‌గ‌ల‌రు. ఎక్కువ మొత్తంలో తీసుకునే రుణాల‌పై వ‌డ్డీ రేట్లు కాస్త అద‌నంగా ఉండే అవ‌కాశం ఉంది.

యాక్సిస్ బ్యాంకు వ‌డ్డీ రేట్ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

ఐసీఐసీఐ

ఐసీఐసీఐ

రూ. 75 ల‌క్ష‌ల లోపు రుణాల‌పై 8.65% వ‌డ్డీ రేటు ఉంటుంది. ఎంసీఎల్ఆర్ ఆధారితంగా ఇది మారుతుంది. రూ. 75 ల‌క్ష‌ల ల‌నుంచి రూ. 5 కోట్ల లోపు రుణాల‌పై వ‌డ్డీ రేటు 8.70%.

ఫిక్స్‌డ్(స్థిర‌) వ‌డ్డీ రేట్లు చూస్తే రూ. 30 ల‌క్ష‌ల లోపు రుణాల‌పై వ‌డ్డీ రేటు 8.70%గా ఉండ‌గా; ఆపైన రూ. 5 కోట్ల లోపు తీసుకునే రుణాల‌కు వ‌డ్డీ రేటు 8.80% వ‌ర‌కూ ఉంటుంది. మొత్తానికి ఐసీఐసీఐ వ‌డ్డీ రేట్లు 8.50% నుంచి 8.70% మ‌ధ్య ఉండే వీలుంది. ఇవ‌న్నీ ఐదేళ్ల‌, ప‌దేళ్ల కాల‌ప‌రిమితి రుణాల‌కు. కాల‌ప‌రిమితిని బ‌ట్టి రుణ వ‌డ్డీ రేట్లు మార‌తుంటాయి.

ఐసీఐసీఐ గృహ రుణ బ్యాంకు వ‌డ్డీ రేట్ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

కెన‌రా బ్యాంకు

కెన‌రా బ్యాంకు

కెన‌రా బ్యాంకు ఏడాది కాల ప‌రిమితి ఉండే రుణాల‌పై ఎంసీఎల్ఆర్ ఆధారిత వ‌డ్డీ రేటును 9.15% నుంచి 8.45 శాతానికి త‌గ్గించింది. బ్యాంకు రుణం మంజూరు చేసినందుకు గాను ప్రాసెసింగ్ ఫీజు(0.50%) ఉంటుంది. ఇది క‌నీసం రూ. 1500 నుంచి గ‌రిష్టంగా రూ. 10 వేల వ‌ర‌కూ ఉండొచ్చు.

ఇత‌ర బ్యాంకులు

ఇత‌ర బ్యాంకులు

ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిబిఐ వడ్డీరేట్లను తగ్గించింది. గృహ రుణాలపై 0.60శాతంకోత పెట్టి 8.55శాతం వద్ద నిలిపింది. యూనియ‌న్ బ్యాంక్ ఆప్ ఇండియా గ‌త రెండు నెల‌ల కాలంలో 0.60%-0.90% వ‌ర‌కూ త‌గ్గించింది. సిటీ బ్యాంకు గృహ రుణ వ‌డ్డీ రేట్ల‌ను 8.9 శాతం నుంచి 8.25శాతానికి త‌గ్గించింది.

English summary

గృహ రుణ వ‌డ్డీ రేట్లు త‌గ్గాయోచ్.. మ‌రి మీ ప్ర‌ణాళిక ఏంటి? | Home loan interest reduced record lows is this the right time to buy

For first home buyers 20-year loan to cost less 240000 Know The New Rules Of Pm Awas Yojana Subsidy Scheme Now Those Who Are Planning to buy home First Time, PM Awas Yojana Is Best Deal For Them, Know The New Rules Of Pm Awas Yojna Subsidy Scheme. with pmay all income groups will get interest subsidy loans,The slabs will apply to loans with a tenure of up to 20 years.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X