For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ స్కోర్‌కు-రుణానికి సంబంధం ఏమిటి?

సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువుంటే కావాల్సినంత రుణం సునాయాసంగా వచ్చేస్తుంది. అందుకే రుణం చిటికెలో రావాలంటే సిబిల్ స్కోర్ 900కు గాను 750 పైన ఉండాలి. ఈ నేప‌థ్యంలో సిబిల్ క్రెడిట్ స్కోర్ గురించిన ప‌లు ఆస‌

|

మీరు రుణం కోసం బ్యాంకుకు వెళ్ల‌గానే మీ క్రెడిట్ స్కోర్ ఎంత అని అడ‌గ‌డం నిత్య జీవితంలో చాలా మందికి ఎదుర‌య్యే సంఘ‌ట‌న‌. అయితే, ఈ క్రెడిట్ కార్డు తీసుకోవాలన్నా, వ్యక్తిగత రుణం అయినా, వాహన, ఇంటి రుణం ఏదైనా కానీయండి. బ్యాంకులకు సిబిల్ స్కోర్ ప్రామాణికం. సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువుంటే కావాల్సినంత రుణం సునాయాసంగా వచ్చేస్తుంది. అందుకే రుణం చిటికెలో రావాలంటే సిబిల్ స్కోర్ 900కు గాను 750 పైన ఉండాలి. ఈ నేప‌థ్యంలో సిబిల్ క్రెడిట్ స్కోర్ గురించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను తెలుసుకుందాం.

సిబిల్ గురించిన వివ‌రాలు

సిబిల్ గురించిన వివ‌రాలు

రుణం తీసుకున్న వారికి దాన్ని తిరిగి తీర్చ‌గ‌ల సామ‌ర్థ్యం ఉందా లేదా అని నిర్దారించుకోవ‌డానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు క‌లిసి ఏర్పాటు చేసుకున్న సంస్థే సిబిల్‌ అంటే క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(ఇండియా) లిమిటెడ్. ఇంకా సులువుగా చెప్పాలంటే రుణ చరిత్రలను అందించే సంస్థ. సిబిల్‌ వ్యక్తులకు చెందిన రుణాలు, క్రెడిట్‌ కార్డుల చెల్లింపు వ్యవహారాలు వంటి సమాచారాన్ని సేకరించి నివేదికలు తయారుచేస్తుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రతినెలా రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్‌కు అందజేస్తాయి. ఈ సమాచారాన్ని ఉపయోగించి సిబిల్‌ రుణ చరిత్ర నివేదిక, క్రెడిట్‌ స్కోర్‌ను తయారుచేస్తుంది. వీటిని ఆధారంగా చేసుకుని బ్యాంకులు రుణ దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటాయి.

క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ స్కోర్‌(సీఐఆర్‌) అంటే:

క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ స్కోర్‌(సీఐఆర్‌) అంటే:

సీఐఆర్‌ అంటే సిబిల్‌ జారీ చేసే మూడంకెల సంఖ్య. ఇది రుణ చరిత్ర ఆధారంగా నిర్ణయమవుతుంది. ఇందులో పొదుపు, పెట్టుబడులు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వివరాలు ఉండవు. ఒక నిర్ణీత కాలానికి సంబంధించి ఒక వ్యక్తి చేసిన రుణ చెల్లింపుల వివరాలు ఇందులో ఉంటాయి. ఏదైనా రుణం(లోన్‌) ఇవ్వాలంటే బ్యాంకులు ఎంత క్రెడిట్‌ స్కోర్‌ని ప్రామాణికంగా తీసుకుంటాయనే విష‌యం చాలా మందికి తెలుసు. ఇది ఎంత ఉండాల‌నే విష‌యంలో అంద‌రికీ అవ‌గాహ‌న ఉండ‌దు. 300 నుంచి 900 వరకు వచ్చే క్రెడిట్‌స్కోర్‌ కొలమానంగా తీసుకుంటారు.

 క్రెడిట్‌ స్కోర్‌ కోసం సిబిల్‌ వద్ద నమోదు చేసుకునే పద్ధతి- ఆన్‌లైన్

క్రెడిట్‌ స్కోర్‌ కోసం సిబిల్‌ వద్ద నమోదు చేసుకునే పద్ధతి- ఆన్‌లైన్

*సిబిల్ క్రెడిట్‌ స్కోర్‌, రుణ చరిత్ర కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

*ఇందుకోసం సిబిల్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, ఒక ఆన్‌లైన్‌ నమోదు పత్రాన్ని పూర్తి

చేయాలి.

* నిర్దేశించిన రుసుమును ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి.

* వివరాలను ఆన్‌లైన్‌ నమోదు ద్వారా ధృవీకరించుకోవాల్సి ఉంటుంది.

* ధృవీకరణ పూర్తయిన తర్వాత రుణ చరిత్ర, క్రెడిట్‌ స్కోర్‌లను మెయిల్‌ ఐడీకి

పంపిస్తారు.

https://www.cibil.com/online/credit-score-check.do

ఆఫ్‌లైన్‌ ద్వారా సిబిల్ క్రెడిట్ స్కోర్ కోసం న‌మోదు ఎలా?

ఆఫ్‌లైన్‌ ద్వారా సిబిల్ క్రెడిట్ స్కోర్ కోసం న‌మోదు ఎలా?

* పోస్ట్ ద్వారా సైతం ప‌త్రాల‌ను పంపి నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది.

* మొదట వెబ్‌సైట్ నుంచి నమోదు పత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

* నమోదు పత్రంలో వివరాలను నింపాలి.

* నమోదు పత్రానికి, కేవైసీ పత్రాలు, నిర్దేశించిన రుసుము డీడీని జతపరుస్తూ నిర్దేశిత చిరునామాకు పోస్ట్‌ చేయాలి.

* సిబిల్‌కి సీఐఆర్‌ కోసం ఆన్‌లైన్‌లో ఒక మెయిల్‌ను పంపించాలి.

నమోదు పూర్తయిన తర్వాత మీ మెయిల్‌ ఐడీకి సమాచారం వస్తుంది.

రుణ దరఖాస్తు చేసిన త‌ర్వాత ఏం జ‌రుగుతుంది?

రుణ దరఖాస్తు చేసిన త‌ర్వాత ఏం జ‌రుగుతుంది?

1. రుణ గ్ర‌హీత దరఖాస్తు ఫారాన్ని నింపి బ్యాంకు, ఆర్థిక సంస్థకు అందజేయాల్సి ఉంటుంది.

2. వెంటనే రుణ సంస్థ, సిబిల్‌ను ఆశ్రయించి క్రెడిట్‌ స్కోర్‌, రుణ చరిత్ర నివేదికల కోసం ప్రయత్నిస్తుంది.

3. ఈ దశలో క్రెడిట్‌ స్కోర్‌ ఎక్కువగా ఉంటే, దరఖాస్తు ప్రక్రియను కొనసాగిస్తారు.

4. అందుకు అవసరమైన పత్రాల కోసం రుణసంస్థలు రుణగ్రహీతను సంప్రదిస్తాయి.

రుణ అర్హతను ఎలా నిర్దారిస్తారు?

రుణ అర్హతను ఎలా నిర్దారిస్తారు?

బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందేందుకు క్రెడిట్‌ స్కోర్‌ ఒక సాధనంగా మాత్రమే పనిచేస్తుంది. ఒక వ్యక్తి సమగ్ర రుణ చరిత్రను తెలియజేయడం వరకూ మాత్రమే సిబిల్‌ పరిమితమవుతుంది. మంచి క్రెడిట్‌ స్కోర్‌తో పాటు వ్యక్తి ఆదాయ వనరులు, వృత్తిపరమైన నైపుణ్యాలు, ఆస్తి-అప్పుల నిష్పత్తి వంటి వాటిని బ్యాంకులు లోతుగా విచారిస్తాయి. తర్వాత మాత్రమే రుణం మంజూరీ గురించి ఆలోచిస్తాయి.

 ఈ విధంగా స్కోర్ త‌గ్గొచ్చు

ఈ విధంగా స్కోర్ త‌గ్గొచ్చు

బ్యాంక్‌ నుంచి తీసుకున్న వివిధ రకాల రుణాలు, క్రెడిట్‌కార్డ్‌ల బకాయిలు చెల్లించడంలో రెండు, మూడు నెలలు ఆలస్యం జరిగినా; లేదంటే వ్యక్తిగత ఇబ్బందులు కారణంగా చెల్లించలేకపోయిన పరిస్థితుల్లో తర్వాత ఏకమొత్తంగా చెల్లించి, సమస్య నుంచి బయటపడాలని బ్యాంక్‌కు కట్టాల్సిన సొమ్మును సెటిల్‌మెంట్‌ రూపంలో కట్టేసినా.. క్రెడిట్‌స్కోర్ త‌గ్గుతుంది. సిబిల్‌ రిపోర్ట్‌లో 'సెటిల్డ్‌' అని చూపిస్తూ ఏయే బ్యాంకుల్లో అప్పులు తీసుకుని, సరిగ్గా కంతులు చెల్లించక, సెటిల్‌మెంట్‌ని శ్రయించారనే వివరాలన్నీ అందులో ఉంటాయి. దీంతో బ్యాంకులు రుణం ఇవ్వడానికి జంకుతాయి. కాబ‌ట్టి రుణ వాయిదాల‌ను, క్రెడిట్ కార్డు బిల్లుల‌ను స‌కాలంలో చెల్లించండి.

Read more about: cibil credit score
English summary

క్రెడిట్ స్కోర్‌కు-రుణానికి సంబంధం ఏమిటి? | What is the importance of cibil credit score in getting loan from a bank

TransUnion CIBIL Limited is India’s first Credit InformationCompany. We collect and maintain monthly reports(Credit Information Report- CIR) from banks and financialinstitutions, detailing individuals’ loan and credit card paymenthistory.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X