For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యూచువ‌ల్ ఫండ్స్‌పై మూల‌ధ‌న రాబ‌డి ప‌న్ను వ‌ర్తింపు ఎలా లెక్కిస్తారు?

మిగ‌తా పెట్టుబ‌డుల్లో ప‌న్నుల విష‌యం కాస్త సులువుగానే ఉన్నా, ఈక్విటీ, మ్యూచువ‌ల్ ఫండ్స్ విష‌యంలో ఇది కాస్త తిక‌మ‌క‌గా ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు వేత‌నంపై ప‌న్ను మీ ట్యాక్స్ శ్లాబును అనుస‌రించి ఉంటుంద‌ని అం

|

పెట్టుబ‌డిదారులంద‌రూ ఎక్కువ‌గా ఆలోచించి జాగ్ర‌త్త ప‌డే అంశం పన్నుల ద‌గ్గ‌రే. మిగ‌తా పెట్టుబ‌డుల్లో ప‌న్నుల విష‌యం కాస్త సులువుగానే ఉన్నా, ఈక్విటీ, మ్యూచువ‌ల్ ఫండ్స్ విష‌యంలో ఇది కాస్త తిక‌మ‌క‌గా ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు వేత‌నంపై ప‌న్ను మీ ట్యాక్స్ శ్లాబును అనుస‌రించి ఉంటుంద‌ని అంద‌రికీ తెలుసు. కానీ మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో మీకు వ‌చ్చే రాబ‌డులను బ‌ట్టి ప‌న్ను ఉంటుంది. దాన్ని మూల‌ధ‌న రాబ‌డి ప‌న్ను అని వ్య‌వ‌హ‌రిస్తారు. మూల‌ధ‌న రాబ‌డి ప‌న్నుల వ‌ర్తింపు ఎలా ఉంటుందో ఈ కింద తెలుసుకుందాం.

 మూల‌ధ‌న రాబడి ప‌న్ను అంటే ఏమిటి?

మూల‌ధ‌న రాబడి ప‌న్ను అంటే ఏమిటి?

మీరు మ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్ల‌ను అమ్మిన‌ప్పుడు పెట్టుబ‌డిపై వ‌చ్చే లాభ‌మే మూల‌ధ‌న రాబ‌డి. అంటే యూనిట్ల మార్కెట్ విలువ మ‌రియు మీరు కొనుగోలు చేసిన‌ప్పుడు ఉన్న మ్యూచువ‌ల్ ఫండ్స్ యూనిట్ల విలువ మ‌ధ్య ఉండే వ్య‌త్యాసాన్ని రాబ‌డిగా ప‌రిగ‌ణిస్తారు. సులువుగా చెప్పాలంటే ఫండ్ ఎన్ఏవీ బాగా పెర‌గ‌డం వ‌ల్ల మీరు పొందే లాభాలు. మీరు పెట్టుబడి పెట్టిన కాల‌ప‌రిమితి ఆధారంగా అది స్వ‌ల్ప‌కాలిక‌, దీర్ఘ‌కాలిక‌మా అనేది నిర్ణ‌యిస్తారు.

 ఈక్విటీపై మూల‌ధ‌న రాబ‌డి ప‌న్ను

ఈక్విటీపై మూల‌ధ‌న రాబ‌డి ప‌న్ను

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లు, ఈక్విటీ ఆధారిత మ్యూచువ‌ల్ ఫండ్ల‌పై ప‌న్ను వ‌ర్తింపు విధానం చాలా సులువైన‌దిగా చెప్పాలి. మీరు ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డుల‌ను 12 నెల‌ల కంటే ఎక్కువ కాలం ఉంచితే అది దీర్ఘ‌కాలికంగాను, 12 నెల‌ల కంటే త‌క్కువ కాలం ఉంచితే స్వ‌ల్ప‌కాలికంగాను వ్య‌వ‌హ‌రిస్తారు.

ఈక్విటీ ఫండ్స్‌ను కొనుగోలు చేసిన ఏడాదిలోపు విక్రయిస్తే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను, ఏడాది తర్వాత విక్రయిస్తే, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈక్విటీ ఫండ్స్‌పై సల్పకాలిక మూలధన లాభాల పన్ను 15 శాతంగా ఉండగా, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ఏమీ ఉండదు. మీరు ఉన్న ట్యాక్స్ శ్లాబుతో సంబంధం లేకుండా స్వ‌ల్ప‌కాలిక మూల‌ధ‌న రాబ‌డి ప‌న్ను వ‌ర్తింపు ఉంటుందని గుర్తుంచుకోండి. అంతే కాకుండా సెక్యూరిటీ ట్రాన్సాక్ష‌న్ ట్యాక్స్ 0.001% అద‌నం. డివిడెండ్ల‌పై ఎట్టిప‌రిస్థితుల్లోనూ ప‌న్ను ఉండ‌క‌పోవ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌యం.

ఈక్విటీ ఆధారిత ప‌థ‌కాల విష‌యంలో ప‌న్ను

ఈక్విటీ ఆధారిత ప‌థ‌కాల విష‌యంలో ప‌న్ను

ఏదైనా పెట్టుబ‌డి ప‌థ‌కాన్ని ఈక్విటీ ఆధారిత పెట్టుబ‌డి ప‌థ‌కంగా ప‌రిగ‌ణించాలంటే ఆయా ఫండ్ల‌లో ఉండే మొత్తం పెట్టుబ‌డిలో క‌నీసం 65% ఈక్విటీల్(షేర్ల‌)లో ఉంచాలి. దీని ప్ర‌కారంగా పెట్టుబ‌డి పెట్టే కాలం(హోల్డింగ్ పీరియ‌డ్‌) ఏడాది కాలాన్ని మించితే ఈక్వీటీ ఫండ్ల లానే వీటిలో సైతం ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది. అంటే 12 నెల‌ల పై మించిన పెట్టుబ‌డుల‌కు ప‌న్ను ఉండ‌దు. అయితే 12 నెల‌ల లోపు పెట్టుడుల‌ను వెన‌క్కు తీస్తే మాత్రం స్వ‌ల్ప‌కాలిక మూల‌ధ‌న రాబ‌డి ప‌న్ను 15 శాతంగా ఉంటుంది. ఆర్బిట్రేజ్ ఫండ్లు, ఈక్విటీ సేవింగ్ ఫండ్ల‌ను సైతం ప‌న్ను వ‌ర్తింపుల కోసం ఈక్విటీల్లానే చూస్తారు.

అంత‌ర్జాతీయ ఫండ్ల‌ను దేశీయ ఈక్విటీల్లో 65% పెట్టుబ‌డులు పెట్ట‌నందున ప‌న్ను మిన‌హాయింపుల కోసం ప‌రిగ‌ణించ‌రు. వాటిపై ప‌న్ను వేస్తారు. ఇత‌ర ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టి ఉంటాయి కావును ఈక్విటీ ఫండ్ ఆఫ్ ఫండ్స్ సైతం ప‌న్ను వ‌ర్తింపుల కోసం ప‌రిగ‌ణించ‌రు.

డెట్ ఫండ్ల విష‌యంలో ప‌న్ను

డెట్ ఫండ్ల విష‌యంలో ప‌న్ను

ఈక్విటీయేతర మ్యూచువల్‌ ఫండ్స్‌ విషయానికొస్తే, కొనుగోలు చేసిన మూడేళ్లలోపు మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లను విక్రయిస్తే, వాటిపై వచ్చిన లాభాలను స్వల్పకాలిక మూలధన రాబ‌డి పన్నుగానూ, మూడేళ్ల తర్వాత విక్రయిస్తే వచ్చే లాభాలపై దీర్ఘకాలిక మూలధన రాబ‌డి పన్నును విధిస్తారు. ఈక్విటీయేతర మ్యూచువల్‌ ఫండ్స్‌కు స్వల్ప కాల మూలధన రాబ‌డి పన్ను మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి, ఇక దీర్ఘకాలిక మూలధన రాబ‌డి పన్నును 20 శాతం ఇండెక్సేషన్‌తో కలిపి విధిస్తారు. మీరు 10% ట్యాక్స్ శ్లాబులో ఉంటే, 10% మూల‌ధ‌న రాబ‌డి ప‌న్ను చెల్లిస్తారు. ఈక్విటీ ఫండ్ల‌కు డివిడెండ్ల‌పై ప‌న్ను ఉండ‌క‌పోగా, డెట్ ఫండ్ల విష‌యంలో మాత్రం డివిడెండ్ల‌పై ప‌న్ను క‌ట్టాల్సిందే. డెట్ ఫండ్ల‌లో లిక్విడ్, అల్ట్రా షార్ట్ ట‌ర్మ్‌, షార్ట్ ట‌ర్మ్‌, ఇన్‌క‌మ్ అక్రూయ‌ల్‌, డైన‌మిక్ బాండ్‌, గిల్ట్ పండ్లు ఉంటాయి. నెల‌వారీ ఆదాయ ప‌థ‌కాల‌ను సైతం ఇందులో భాగంగానే ప‌రిగ‌ణిస్తారు.

ఒక్క‌సారి రిడీమ్ చేస్తున్నారా? వేర్వేరు స‌మ‌యాల్లోనా?

ఒక్క‌సారి రిడీమ్ చేస్తున్నారా? వేర్వేరు స‌మ‌యాల్లోనా?

క‌థ‌నంలో ఇప్ప‌టి వ‌ర‌కూ వివిధ ర‌కాల ఫండ్ల‌పై ఎప్పుడు ప‌న్ను ఎలా వ‌ర్తిస్తుంద‌ని తెలుసుకున్నారు. ఎంత కాలం పెట్టుబ‌డిని ఎలా ఉంచుతున్నార‌నేది ముఖ్యం అని గ‌మ‌నించారు. అన్ని ఫండ్ల‌ను ఒక‌సారి పెట్టుబ‌డులు పెట్టి ఉండి రిడీమ్‌(వెన‌క్కి తీసుకుంటే) చేస్తే స‌మ‌స్య లేదు. అలాంట‌ప్పుడు హోల్డింగ్ పీరియ‌డ్‌ను లెక్కించ‌డం సులువు. వివిధ స‌మ‌యాల్లో పెట్టిన ఫండ్ల‌ను వాటిని ప‌లుసార్లు రిడీమ్ చేస్తే ఎలా? సిప్ ద్వారా పెట్టిన పెట్టుబ‌డుల విష‌యంలో ఇలా జ‌రుగుతుంది. ఇలాంట‌ప్పుడు లెక్కింపు విధానం మారుతుంది.

ప‌న్ను లెక్కింపు కాల‌ప‌రిమితులు ఎలా?

ప‌న్ను లెక్కింపు కాల‌ప‌రిమితులు ఎలా?

ప‌న్ను ఉద్దేశంలో ఫ‌స్ట్‌-ఇన్‌-ఫస్ట్‌-అవుట్ రూల్‌ను ఫాలో అవుతారు. అంటే మీరు మొద‌ట కొన్న యూనిట్ల‌ను మొద‌ట అమ్మాలి. అలా అమ్మేట‌ప్పుడు ట్యాక్స్ సేవింగ్ ఫండ్ల‌కు లాక్‌-ఇన్ పీరియ‌డ్ ఉండ‌కూడ‌దు. మీ ద‌గ్గ‌ర ఇప్పుడు 290 యూనిట్లు ఉన్నాయి. అందులో 100 యూనిట్ల‌ను అమ్మాల‌నుకున్నారు. రూల్ ఆధారంగా చూస్తే మీరు ఫిబ్ర‌వ‌రి 2013న 50 యూనిట్ల‌ను కొని, మ‌రో 50 యూనిట్ల‌ను జ‌న‌వ‌రి 2014లో కొని వాటిని అమ్మారు. ఆ ఫండ్ ఈక్విటీ అయితే ఏడాది గ‌డువు దాటింది కాబ‌ట్టి క్యాపిట‌ల్ గెయిన్ ట్యాక్స్ వ‌ర్తించ‌దు. అదే ఈ ఫండ్ డెట్ అయి ఉంటే గ‌డువు మూడేళ్లు దాటింది కాబ‌ట్టి మీరు లాంగ్ ట‌ర్మ్ క్యాపిట‌ల్ గెయిన్ ట్యాక్స్ క‌ట్టాల్సి వ‌స్తుంది. ఒక‌వేళ మొత్తం 290 యూనిట్ల‌ను అమ్మాల్సి వ‌స్తే ఈక్విటీ ఫండ్ల‌ను జ‌న‌వ‌రి 2014 నుంచి జ‌న‌వ‌రి 2016లో అమ్మితే, అప్పుడు దీర్ఘ‌కాలిక మూల‌ధ‌న రాబ‌డి ప‌న్ను; అన్నింటి కంటే ముందు కొన్న‌ వాటిని జూన్ 2013-డిసెంబ‌రు 2014 మ‌ధ్య అమ్మినా స్వ‌ల్ప‌కాలిక మూల‌ధ‌న రాబ‌డి ప‌న్ను వ‌ర్తింప‌జేస్తారు. ఎందుకంటే ఈక్విటీల‌కు స్వ‌ల్ప‌కాలిక ప‌న్ను వ‌ర్తింపు ఏడాది(12 నెల‌లు) కాల‌ప‌రిమితిగా ఉంటుంది.

ఇది కూడా చ‌ద‌వండి మ్యూచువ‌ల్ ఫండ్ల విష‌యంలో త‌ర‌చూ వాడే ప‌దాలు

 ఇత‌ర అంశాలు

ఇత‌ర అంశాలు

మ్యూచువల్‌ ఫండ్ ప‌థ‌కాల్లో డివిడెండ్, గ్రోత్‌ అనే రెండు ఆప్షన్స్‌ ఉంటాయి. మీరు డివిడెండ్‌ ఆప్షన్‌ ఎంచుకున్నారనుకుందాం. ఈక్విటీ, డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీకు లభించే డివిడెండ్స్‌పై మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. డెట్‌ ఫండ్స్‌ను నిర్వహిస్తున్న ఫండ్‌ హౌస్ స‌ర్‌చార్జీ, సెస్‌ల‌తో క‌లిపి 28.84% డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌(డీడీటీ)ని చెల్లించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని డివిడెండ్‌గా ఇన్వెస్టర్లకు చెల్లిస్తుంది. మొత్తం ఫండ్ల‌ను మూలధన లాభాల పన్ను పరంగా చూస్తే, మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఈక్విటీ, ఈక్విటీయేతర ఫండ్స్‌గా విభజిస్తారు. లార్జ్‌ క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌ క్యాప్, మల్టీ క్యాప్, బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌(ఈక్విటీ ఆధారిత), సెక్టర్‌ ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌గా పరిగణిస్తారు. లిక్విడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్, మనీ మార్కెట్‌ ఫండ్స్, గోల్డ్‌ ఫండ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెట్‌ ఫండ్స్, బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌ (డెట్‌ ఓరియంటెడ్‌), ఈక్విటీ-ఇంటర్నేషనల్‌ తదితర ఫండ్స్‌ను ఈక్విటీయేతర మ్యూచువల్‌ ఫండ్స్‌గా పరిగణిస్తారు.

Read more about: mutual funds investments
English summary

మ్యూచువ‌ల్ ఫండ్స్‌పై మూల‌ధ‌న రాబ‌డి ప‌న్ను వ‌ర్తింపు ఎలా లెక్కిస్తారు? | telugu goodreturns is explaining- How are mutual funds taxed

The Short Term Capital Gains(STCG) tax rate on equity funds is 15%. The STCG tax rate on Non-Equity funds (or) Debt funds is as per the investor's income tax slab rate. There will be no Long Term Capital Gains(LTCG ) tax rate on equity funds. The LTCG tax rate on non-equity funds is 20% (with Indexation benefit)
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X