For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎన్‌పీఎస్ ఖాతా తెరిచేందుకు ఆధార్ ఉంటే చాలు

జాతీయ పింఛన్ ప‌థ‌కం(ఎన్‌పీఎస్‌)లో చేరేందుకు ఉన్న నిబంధనలను కేంద్రం సడలించింది. ఎన్‌పీఎస్ ఖాతాలు తెరవడానికి ఇదివరకు ఉన్న నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ పింఛన్‌ నిధులు నియంత్రణ,అభివృధ్ధి మండలి (పీఎఫ్‌ఆర

|

జాతీయ పింఛన్ ప‌థ‌కం(ఎన్‌పీఎస్‌)లో చేరేందుకు ఉన్న నిబంధనలను కేంద్రం సడలించింది. ఎన్‌పీఎస్ ఖాతాలు తెరవడానికి ఇదివరకు ఉన్న నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ పింఛన్‌ నిధులు నియంత్రణ,అభివృధ్ధి మండలి (పీఎఫ్‌ఆర్డీఏ) నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆధార్‌తో తెరిచిన ఫింఛ‌ను ఖాతాలకు బ్యాంక్‌ల్లో ఫిజికల్‌ అప్లికేషన్‌ ఫామ్‌ ఇవ్వవలసిన అవసరం లేదంటూ ఆదివారం ప్రకటించింది.

ఎన్‌పీఎస్ ఖాతా తెరిచేందుకు ఆధార్ ఉంటే చాలు

ఇదివరకు ఖాతాలు ప్రారంభించిన వాళ్లు ఎలక్ట్రానిక్‌ సంతకం చేయడానికి బ్యాంకులకు కచ్చితంగా వెళ్లాల్సి వచ్చేది. ఆన్‌లైన్ ఖాతా తెరిచేందుకు పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్‌(పీవోపీ)లో ఈ-సంత‌కాన్ని స‌మీకృతం చేస్తే అప్పుడు కేంద్రీకృత రికార్డుల‌(సీఆర్ఏ) న‌మోదు సంస్థ‌కు చందాదారులు ద‌ర‌ఖాస్తులు పోస్టులో పంపే అవ‌స‌రం ఇక‌పై ఉండ‌ద‌ని ప్ర‌భుత్వం వివ‌రించింది. దీని వ‌ల్ల ఆధార్ క‌లిగిన చందాదారులు సులువుగా పింఛ‌ను ప‌థ‌కంలో చేర‌గ‌లుగుతార‌ని తెలిపింది. ఈ-సంత‌కం సంబంధిత సేవ‌లు అందించ‌డానికి పీవోపీలు గ‌రిష్టంగా రూ. 5 సేవా రుసుము వ‌సూలు చేసుకోవ‌చ్చ‌ని పీఎఫ్ఆర్డీఏ పేర్కొంది. న‌వంబ‌రు 30 నాటికి ఈ ప‌థ‌కంలో 1 కోటి 40 లక్ష‌ల మంది చందాదారులుగా ఉన్నారు.

Read more about: pf
English summary

ఎన్‌పీఎస్ ఖాతా తెరిచేందుకు ఆధార్ ఉంటే చాలు | Now you can open a NPS account completely through Aadhar via Online

Till now an NPS account could be opened online via eNPS portal but the printout of the application submitted online had to be sent to the PFRDA's Central Recordkeeping Agency (CRA) to open the account. The PFRDA has now directed that in the case of NPS accounts being opened online on the basis of Aadhar verification followed by e-signature, a physical printout of the application need not be sent.
Story first published: Tuesday, January 3, 2017, 10:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X