For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్ల‌ల కోసం బ్యాంకు ఖాతా తెరుస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి

పొదుపు, పెట్టుబడుల గురించి జీవితంలో ఎంత తొందరగా తెలుసుకోగలిగితే అంత ఉపయోగం. ఖాతా నిర్వహణ ద్వారా పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణను నేర్పించవచ్చు. ప్ర‌స్తుత స‌మాజంలో పిల్ల‌ల‌కు చిన్న‌త‌నం నుంచే పొదుపు మీద అవ

|

పిల్లలకు పొదుపు ఖాతాను తెరవడం చాలా ముందు చూపుతో చేసే పని. డబ్బు విలువ గురించి అర్థం చేసుకునేందుకు, పొదుపు అవసరాన్ని తెలిపేందుకు పొదుపు ఖాతా ఉపకరించగలదు. పొదుపు, పెట్టుబడుల గురించి జీవితంలో ఎంత తొందరగా తెలుసుకోగలిగితే అంత ఉపయోగం. ఖాతా నిర్వహణ ద్వారా పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణను నేర్పించవచ్చు. ప్ర‌స్తుత స‌మాజంలో పిల్ల‌ల‌కు చిన్న‌త‌నం నుంచే పొదుపు మీద అవ‌గాహ‌ప పెంచాలి. మీకు వీలున్న బ్యాంకులో పిల్లల పేరుమీద ఖాతా ప్రారంభించండి. కొన్ని బ్యాంకులు పిల్లల ఖాతాలు ప్రారంభించగానే అందమైన కిడ్డీ బ్యాంకును అందిస్తాయి. ఆంధ్రాబ్యాంకు ఇందుకు ఉదాహరణ. దీనికి ప్ర‌త్యేక తాళం ఉంటుంది.ఇలాంటి మ‌రెన్నో ముఖ్య విష‌యాలు ఈ కింద తెలుసుకోండి.

పిల్లల పొదుపు ఖాతా తెరిచేందుకు అవసరమయ్యే పత్రాలు:

పిల్లల పొదుపు ఖాతా తెరిచేందుకు అవసరమయ్యే పత్రాలు:

1. జనన ధ్రువీకరణ పత్రం

2. సంరక్షకుల రిలేషన్‌షిప్‌ సర్టిఫికెట్‌

3. మైనర్‌ని సూచించే చిరునామా గుర్తింపు పత్రం

4. కొన్ని బ్యాంకులు మైనర్‌ ఫోటో కావాలని అడుగుతాయి.

5. సంరక్షకుడి/సంరక్షకురాలి పాన్‌కార్డ్‌ (మైనర్‌ పేరు మీద ఖాతా నిర్వహించేవారి)

 నియమ నిబంధనలు:

నియమ నిబంధనలు:

1. 18 ఏళ్ల లోపు పిల్లల కోసం వారి సంరక్షకులు పిల్లల పొదుపు ఖాతాలను ప్రారంభించవచ్చు.

2. మైనర్‌ తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడి పొదుపు ఖాతా ఆ బ్యాంకులో ఉండాలి.

3. ఒకవేళ మైనర్‌ వయస్సు పదేళ్ల లోపు ఉంటే సంరక్షకులే ఖాతా నిర్వహిస్తారు. పదేళ్లు దాటిన తర్వాత మైనర్‌ స్వయంగా ఖాతా నిర్వహించుకోవచ్చు.

4. కనీస నిల్వ, నిర్వహణ రుసుములు వంటివి బ్యాంకులు స్వయంగా నిర్దేశిస్తాయి. ఇవి బ్యాంకును బట్టి మారుతూ ఉంటాయి.

5. 10 ఏళ్లు మించిన వారికి ఏటీఎమ్‌, డెబిట్‌ కార్డు, చెక్కు పుస్తకం వంటి వాటిని బ్యాంకులు జారీ చేయవచ్చు.

6. మైనర్‌కు పద్దెనిమిది ఏళ్లు వచ్చిన తర్వాత సంతకాన్ని బ్యాంకు వద్ద రుజువు పరచుకోవాల్సి ఉంటుంది. ఫోటోలో మార్పు ఉండే అవకాశం ఉంది కాబట్టి మేజర్‌ అయిన తర్వాత కొత్త ఫోటోను సమర్పించాలి.

ఖాతా ద్వారా ఇవ‌న్నీ

ఖాతా ద్వారా ఇవ‌న్నీ

ఒక్కసారి ఖాతా పనిచేయడం మొదలైతే, డబ్బు జమ చేయడం, తీసుకోవడం, ఖాతాకు అనుబంధంగా ఆర్‌డీ, ఎఫ్‌డీ వంటి లావాదేవీలను నిర్వహించవచ్చు. ఈ పిల్లల ఖాతాలో జమ చేసే సొమ్మును ఉన్నత చదువులు, వివాహం వంటి భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించవచ్చు.

పెద్ల‌ల‌కు సూచ‌న‌

పెద్ల‌ల‌కు సూచ‌న‌

పిల్ల‌లు పుట్టినప్పుడే వారి పేరిట ఏదైనా బ్యాంకులో ఖాతా ప్రారంభిస్తే మంచిది. ఇటువంటి ఖాతాల‌కు త‌ల్లిదండ్రులు సంర‌క్ష‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తారు. ప్ర‌తి నెలా కొంత మొత్తాన్ని ఆ ఖాతాలో పొదుపు చేస్తూ ఉండాలి. అప్పుడే దీర్ఘ‌కాలంలో

పిల్ల‌ల‌కు చ‌క్క‌టి ఆర్థిక ప్ర‌ణాళిక త‌యారు చేసిన వార‌వుతారు.

English summary

పిల్ల‌ల కోసం బ్యాంకు ఖాతా తెరుస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి | Minor Bank Account TheseThings you have to Know

Minor Bank Account: 5 Smart Things to KnowIt is always better to start saving and investing in your kids name when the child is quite young. One can start with saving a small amount on regular basis. To make any investment, disciplined saving habits is very necessary.
Story first published: Wednesday, January 18, 2017, 15:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X