For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్థిరాస్తిలో పెట్టుబ‌డులు పెట్టాలా?

బంగారం త‌ర్వాత స్థిరాస్తిని సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డిగా భావిస్తారు చాలా మంది. స్థ‌లం ధ‌ర రోజు రోజుకు పెర‌గ‌డం త‌ప్ప త‌గ్గ‌ద‌ని చాలా మంది న‌మ్మ‌కం. కానీ ఒక్కోసారి స్థిరాస్తి ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగి బూమ

|

మ‌నోళ్ల‌కు ఉన్న‌ పెట్టుబ‌డుల ఆస‌క్తి చూస్తే రియ‌ల్ ఎస్టేట్‌పైన ఉన్న మ‌క్కువ దేని క‌న్నా ఎక్కువే. స్థిరాస్తి రంగంతో భార‌తీయుల‌కు విడ‌దీయ‌లేని అనుబంధం ఉంది. మ‌నం నివ‌సించే ఇల్లు, మ‌నం ఉద్యోగం చేసే కార్యాల‌యం, స్థ‌లం ఈ విధంగా వీట‌న్నింటితోనూ మ‌నంద‌రం మ‌మేక‌మై ఉంటాం. ఇక పెట్టుబ‌డిదార్లు దీన్నే క్యాష్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉంటారు. వారి మొత్తం పోర్ట్ ఫోలియోలో స్థిరాస్తికి ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తారు. అంతెందుకు మ‌న మ‌ధ్య ఉండే చాలా మంది సామాన్య‌మైన వ్య‌క్తులు కూడా మొద‌టి పెట్టుబ‌డి ప్రాముఖ్య‌త బంగారానికి, స్థిరాస్తికి ఇస్తుండ‌టం మ‌నం చూస్తుంటాం. బంగారం త‌ర్వాత స్థిరాస్తిని సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డిగా భావిస్తారు చాలా మంది. స్థ‌లం ధ‌ర రోజు రోజుకు పెర‌గ‌డం త‌ప్ప త‌గ్గ‌ద‌ని చాలా మంది న‌మ్మ‌కం. కానీ ఒక్కోసారి స్థిరాస్తి ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగి బూమ్ త‌గ్గింద‌న్న వార్త‌లు మ‌నం అప్పుడ‌ప్పుడు చ‌దువుతుంటాం. ఒక్కోసారి విప‌రీతంగా ధ‌ర‌ల పెరుగుద‌ల కార‌ణంగా కొన్ని న‌గ‌రాల్లో రియ‌ల్ ఎస్టేట్‌లో స్త‌బ్ద‌త నెల‌కొంద‌ని కూడా వింటూ ఉంటారు. అందుకే స్థిరాస్తి పెట్టుబ‌డుల విష‌యంలో అత్యంత జాగ్ర‌త్త అవ‌స‌రం.

 Is this the right time to invest in real estate?

ఈ పెట్టుబ‌డులు దీర్ఘ‌కాలికం
10 నుంచి 20 ఏళ్ల కింద‌ట రియ‌ల్ ఎస్టేట్ విష‌యంలో ఎప్పుడూ ధ‌ర‌ల పెరుగుద‌లే ఉండ‌దు. స్త‌బ్ద‌త ఏర్ప‌డ‌టం, బాగా ధ‌ర‌లు త‌గ్గ‌డం వంటివి ఉండేవి కావు. ఒక్కోసారి వ‌రుస‌గా ఐదారేళ్లు బూమ్ పాజిటివ్‌గా ఉన్న స‌మ‌యంలో చాలా మంది పెట్టుబ‌డి పెట్టి రెండింత‌ల లాభాల‌ను సైతం ఆర్జించారు. కానీ ఈ మ‌ధ్య కొన్నేళ్లుగా ప‌రిస్థితులు చాలా మారాయి. ఈ రెండు మూడేళ్ల‌లో స్థిరాస్తి కొంచెం పుంజుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా పెద్ద నోట్ల మార్పిడి మూలిగే న‌క్క‌పై తాటికాయ ప‌డ్డ‌ట్లు చేసింది. అమ్మ‌కాలు, కొనుగోళ్ల‌పై రూ. 500, రూ. 1000 నోట్ల ర‌ద్దు బాగా ప్ర‌భావం చూపుతోంది. అయితే ఇలాంటి ప‌రిస్థితులు ఇలాగే కొన‌సాగుతాయ‌ని కూడా చెప్ప‌లేం. స్వ‌ల్ప‌కాలంలో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకునే వారు స్థిరాస్తికి దూరంగా ఉండ‌టం మంచిది. దీర్ఘ‌కాల దృష్టితో చూస్తే స్థిరాస్తి పెట్టుబ‌డులు మంచి రాబ‌డుల‌నే ఇస్తాయి.

 Is this the right time to invest in real estate?

న‌గ‌దుగా మార్చ‌డం అంత సులువేమీ కాదు...
స్థిరాస్తి పెట్టుబ‌డులు పెట్టేట‌ప్పుడు బాగా ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. ఇందులో స్వ‌ల్ప ఇబ్బందులు సైతం లేక‌పోలేదు. ఉదాహ‌ర‌ణ‌కు మీరు బ్యాంకు డిపాజిట్లు లేదా బంగారం వంటి వాటిల్లో డ‌బ్బు మ‌దుపు చేసి ఉంటే కావాల‌న్న‌ప్పుడు మీ న‌గ‌దు చేతికి వ‌స్తుంది. బ్యాంకుల్లో రుణం తీసుకుని పెట్టుబ‌డి పెడితే వ‌డ్డీ రేట్లు పెరిగాయ‌నుకోండి, అప్పుడు ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదుర‌వుతాయి. మ‌రొక ముఖ్యాంశం స్థిరాస్తి అమ్మ‌కం ద్వారా సొమ్ము చేతికంద‌డం. మ్యూచువ‌ల్ ఫండ్, షేర్ల‌లో ఇన్వెస్ట్ చేస్తే... న‌గ‌దుగా మార్చ‌డంలో పెద్ద‌గా స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం కావు. డ‌బ్బు అవ‌స‌ర‌మైన‌ప్పుడు మ‌న పెట్టుబ‌డుల‌ను మార్కెట్లో వెంట‌నే అమ్మే వీలుంటుంది. బంగారాన్ని సైతం త‌క్ష‌ణ‌మే న‌గ‌దుగా మార్చుకునేందుకు పెద్ద‌గా ఇబ్బందులు ఉండ‌వు. కానీ రియ‌ల్ ఎస్టేట్ రంగంలో ఇలాంటి ప‌రిస్థితి ఉండ‌దు. న‌గ‌దు త‌క్ష‌ణ‌మే కావాలంటే ఒక్కోసారి మ‌న స్థిరాస్తి కొనుగోలు దారు ఆల‌స్యం చేసే అవ‌కాశాలు లేక‌పోలేదు.

Read more about: gold real estate
English summary

స్థిరాస్తిలో పెట్టుబ‌డులు పెట్టాలా? | Is this the right time to invest in real estate?

Buying real estate is widely considered a safe bet by Indian investors, even though the market might show otherwise. Like every other market, real estate too has its highs and lows. For instance, the real estate market boomed between 1988 and 1994, and most property prices went up by over 10 times during this period. However, the bear market that followed was very challenging. By 2002, many properties were being put on the market at half the peak price they achieved in 1994 .
Story first published: Friday, January 20, 2017, 17:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X