For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప‌న్ను మిన‌హాయింపుల కోసం ఎప్పుడూ 80సీయేనా? వీటిని సైతం ప్ర‌య‌త్నించండి

మీరు ఇది చ‌దువుతున్నారంటే మీ ఆదాయం దాదాపు రూ.2.5 ల‌క్ష‌ల మించే ఉండాలి.చ‌ట్టం అనుమ‌తించిన విధంగానే మీరు ప‌న్నులు క‌ట్ట‌కుండా పొదుపు చేసుకోవ‌చ్చు.కేవ‌లం 80సీపై ఆధార‌ప‌డ‌కుండా ప‌న్ను మిన‌హాయింపు కోసం ఉన

|

మీరు ఇది చ‌దువుతున్నారంటే మీ ఆదాయం దాదాపు 2.5 ల‌క్ష‌ల రూపాయ‌ల మించే ఉండాలి. చ‌ట్టం అనుమ‌తించిన విధంగానే మీరు ప‌న్నులు క‌ట్ట‌కుండా పొదుపు చేసుకోవ‌చ్చు. అంతే కాకుండా మీ సంప‌ద పెరుగుతూ పోతుంది కూడా. అయితే టాక్స్ సేవింగ్ ఆప్ష‌న్లలో చాలా వాటికి లాక్ ఇన్ పీరియ‌డ్ ఉంది. మీరు ఎంచుకునే మార్గం, సొమ్ము ప‌రిమితిని బ‌ట్టి లాక్‌-ఇన్ పీరియ‌డ్ మారుతుంది. మీరు ఒక విష‌యం గుర్తుంచుకోవాలి ఇక్క‌డ ఇచ్చేవ‌న్నీ కేవ‌లం ప‌న్ను త‌ప్పించుకునేందుకు మాత్ర‌మే కాదు వాటికి నిర్దిష్ట‌మైన ల‌క్ష్యాలు ఉంటాయి. దాని ద్వారా మీరు అద‌న‌పు ప్ర‌యోజ‌నాలను పొంద‌వ‌చ్చు. సాధార‌ణ పెట్టుబ‌డిదారుల్లా కేవ‌లం 80సీ పై ఆధార‌ప‌డ‌కుండా ప‌న్ను మిన‌హాయింపు కోసం ఉన్న ఇత‌ర ఆప్ష‌న్ల‌పై ఒక లుక్కేయండి.

పొదుపు ఖాతాపై వ‌డ్డీ

పొదుపు ఖాతాపై వ‌డ్డీ

పొదుపు ఖాతాలోని నిల్వ‌పై వ‌చ్చే వ‌డ్డీ ఆదాయంలో ఏటా రూ. 10 వేల వ‌ర‌కూ ఎటువంటి ప‌న్ను ఉండ‌దు. సెక్ష‌న్ 80టీటీఏ కింద ప‌న్ను మిన‌హాయింపు కోసం అవ‌కాశం క‌ల్పిస్తారు. అయితే ఈ ఆదాయాన్ని సైతం ఐటీ రిట‌ర్నుల్లో ఇత‌ర ఆదాయంగా ప‌రిగ‌ణిస్తూ మిన‌హాయింపును కోరాలి.

 ఇంటి అద్దె

ఇంటి అద్దె

మీ వేత‌న ప్యాకేజీలో హెచ్ఆర్‌ఏ భాగం కాక‌పోయినా లేదా మీరు ప్ర‌తి నెలా జీతం తీసుకునే ఉద్యోగం చేయ‌క‌పోయినా ఇంటి అద్దెకు సంబంధించి ప‌న్ను మిన‌హ‌యింపు పొంద‌వ‌చ్చు. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం మీరు నివ‌సిస్తున్న ఇంటికి చెల్లించే అద్దె ద్వారా ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు. ఉద్యోగులైతే జీతం మొత్తంలో(బేసిక్ శాల‌రీ+డీఏ) 10 శాతం వ‌ర‌కూ పెట్టుకోవ‌చ్చు. ఉద్యోగులు కాక‌పోతే మొత్తం ఆదాయంలో 25% మొత్తాన్ని(నెల‌కు రూ.5000) మిన‌హాయింపును కోర‌వ‌చ్చు.

విద్యా రుణాల‌పై వ‌డ్డీ

విద్యా రుణాల‌పై వ‌డ్డీ

పిల్ల‌ల‌ను ఉన్న‌త విద్య చ‌దివించాలంటే చాలా ఖ‌రీదైన వ్య‌వ‌హార‌మైపోయింది. అందుకే చాలా మంది త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల కోసం విద్యా రుణాల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. ఈ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్ర‌భుత్వం ఈ రుణాల‌పై చెల్లించే వ‌డ్డీకి ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపు సౌక‌ర్యం క‌ల్పిస్తోంది. దీని ద్వారా ఎటువంటి ప‌రిమితి లేకుండా చ‌దువు కోసం తీసుకునే రుణాల‌పై క‌ట్టే మొత్తం వ‌డ్డీకి ప‌న్ను ఆదా ప్ర‌యోజ‌నం పొందొచ్చు. పిల్ల‌ల చ‌దువు కోస‌మే కాకుండా భార్యా,భ‌ర్త‌ల చ‌దువుల‌కు కూడా ఈ మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది. చ‌ట్ట‌ప‌రంగా ద‌త్త‌త తీసుకున్న పిల్ల‌ల కోసం తీసుకున్న రుణాల విష‌యంలో సైతం ఇది వ‌ర్తిస్తుంది.

గృహ రుణాల విష‌యంలో

గృహ రుణాల విష‌యంలో

అసలు చెల్లింపుపై: గృహ రుణం రీపేమెంట్‌లో అసలు భాగానికి 80సీ సెక్షన్ వర్తిస్తుంది. దీనికింద ఏడాదికి గరిష్టంగా రూ.1.5 లక్షల మేర మినహాయింపు పొందవచ్చు. ఇల్లు నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఈ ప్రయోజనాన్ని పొందలేరు. నిర్మాణం పూర్తయి, కంప్లీషన్ సర్టిఫికెట్ లభించాక మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే నిర్మాణ దశలో కట్టిన వడ్డీకి సంబంధించి ఆ తర్వాత వ‌రుస‌గా ఐదేళ్ల పాటు క‌ట్టే ఈఎంఐల‌కు మిన‌హాయింపుల‌ను పొంద‌వ‌చ్చు.

స్టాంపు డ్యూటీ/ రిజిస్ట్రేషన్ చార్జీలపై: ప్రాపర్టీని కొనేటప్పుడు చెల్లించిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఈ సెక్షన్‌లో గరిష్టంగా రూ.1.5 లక్షల పరిమితికి లోబడి దీన్ని అనుమతిస్తారు. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు కట్టిన ఏడాదే ఈ మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. వీటికి తోడు ఎవ‌రైనా మొద‌టిసారి రూ. 50 ల‌క్ష‌ల కంటే త‌క్కువ ధ‌ర గ‌ల ఇంటిని, రూ. 35 ల‌క్ష‌ల‌లోపు గృహ రుణం ద్వారా కొన్న‌ట్ల‌యితే ఆ రుణంపై చెల్లించే వ‌డ్డీకి అద‌నంగా రూ. 50 వేల వ‌ర‌కూ సెక్ష‌న్ 24 కింద మిన‌హాయింపు ల‌భిస్తుంది. మొత్తంగా చూస్తే గృహ రుణం కింద చెల్లించే వ‌డ్డీలో ఏటా రూ. 2 లక్ష‌ల వ‌ర‌కూ ఐటీ యాక్ట్‌లోని సెక్ష‌న్ 24 కింద ప‌న్ను మిన‌హాయింపును క్లెయిం చేసుకోవ‌చ్చు.

ఆరోగ్య బీమా ప్రీమియం

ఆరోగ్య బీమా ప్రీమియం

ఆరోగ్య బీమా ప్రీమియానికి సెక్షన్‌ 80డీ కింద మినహాయింపు పొందవచ్చు. మొత్తం రూ. 60 వేల వ‌ర‌కూ మిన‌హియంపు క్లెయిం చేసుకోవ‌చ్చు. వ్య‌క్తిగ‌తంగా త‌న‌తో పాటు జీవిత భాగ‌స్వామి, పిల్ల‌ల ఆరోగ్య బీమా కోసం గరిష్ఠంగా రూ.25వేల వ‌ర‌కూ ఈ స‌దుపాయం ఉంది. త‌ల్లిదండ్రుల ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియంలో రూ. 25 వేల వ‌ర‌కూ ఈ సెక్ష‌న్ కింది అనుమ‌తిస్తారు. సీనియర్‌ సిటిజన్లకు రూ.30వేల వ‌ర‌కూ మిన‌హాయింపు కోరుకోవ‌చ్చు. తల్లిదండ్రుల కోసం తీసుకున్న పాలసీకి చెల్లించిన ప్రీమియానికి కూడా మినహాయింపు (నిబంధనల మేరకు) వర్తిస్తుంది. ఇవి కాకుండా ముంద‌స్తు ఆరోగ్య ప‌రీక్ష‌ల కోసం వెచ్చించే సొమ్ములో రూ. 5 వేల వ‌ర‌కూ మినహాయింపు కోర‌వ‌చ్చు. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు మీకు ఆర్థికంగా అండగా ఉండేందుకు అని మర్చిపోకూడదు. కేవలం పన్ను ఆదా కోసం భారీ ప్రీమియం ఉన్న పాలసీలను ఎంచుకోకూడదు.

 ఆర్‌జీఈఎస్‌ఎస్

ఆర్‌జీఈఎస్‌ఎస్

ఈక్విటీల్లో మదుపును పోత్సహించే లక్ష్యంతో ప్రవేశపెట్టిందే రాజీవ్‌ గాంధీ ఈక్విటీ పొదుపు పథకం (ఆర్‌జీఈఎస్‌ఎస్‌). వార్షికాదాయం రూ.12లక్షలు లోపు ఉండి, మొదటిసారి ఈక్విటీల్లో మదుపు చేస్తున్నవారు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. ఇందులో రూ.50వేల వరకూ మదుపు చేసి, అందులో 50శాతం మేరకు అంటే రూ.25వేలకు సెక్షన్‌ 80సీసీజీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. పెట్టుబడిని మూడేళ్లపాటు కొనసాగించాలనే నిబంధన ఉంది.

న్యూ పెన్ష‌న్ స్కీమ్‌(ఎన్‌పీఎస్‌)

న్యూ పెన్ష‌న్ స్కీమ్‌(ఎన్‌పీఎస్‌)

ఉద్యోగులకు, సాధారణ పౌరులకు విశ్రాంత జీవితంలో ఆదాయం కోసం ఉద్దేశించిన పథకం ఇది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఈ పథకమే అమలవుతోంది. ఈ పథకంలో సాధారణ పౌరులు కూడా చేరవచ్చు. ఆదాయపన్ను చట్టంలోని రరెండు సెక్షన్ల కింద ఎన్ పీఎస్ లో పెట్టుబడులకు మొత్తం రూ.2 లక్షల వరకు పన్ను ఉండదు. సెక్షన్ 80సీసీడీ కింద ఈ పథకంలో పెట్టే రూ.1,50,000 పెట్టుబడులకు పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. దీనికితోడు సెక్షన్ 80సీసీడీ (ఏబీ) కింద అదనంగా మరో రూ.50వేల మొత్తంపైనా మినహాయింపు ఉంటుంది.

సెక్షన్ 80సీ కింద ఓ వ్యక్తి స్థూల వార్షిక ఆదాయంలో రూ.1,50,000 వరకు పలు పథకాల్లో పెట్టుబడి ద్వారా, ఇంటి రుణానికి చేసే చెల్లింపుల ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చని ఇక్కడ తెలుసుకున్నాం. చాలా మందికి వీటిలో అన్నిటిపై అవగాహన ఉండదు. అలాగే, కేవలం ఇవే కాకుండా, ఇతర సెక్షన్ల కింద ఆదాయపన్ను ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. పైన చెప్పుకున్న రూ.1,50,000వేలకు ఇవి అదనం.

 ప్ర‌త్యేక ఆరోగ్య స‌మ‌స్య‌లకు సంబంధించి

ప్ర‌త్యేక ఆరోగ్య స‌మ‌స్య‌లకు సంబంధించి

పన్ను చెల్లింపు దారుడు, తన జీవిత భాగస్వామి, తనపై ఆధారపడిన తల్లిదండ్రులు, పిల్లలు, సోదరుడు, సోదరికి సంబంధించి కొన్ని వ్యాధులపై చేసిన ఖర్చుకు సెక్షన్ 80డీడీబీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. వార్షికంగా రూ.40,000 లేదా అసలు వ్యయం ఏది తక్కువ అయితే ఆ మొత్తంపై పన్ను మినహాయింపు ఉంటుంది. ఒకవేళ వీరిలో 60ఏళ్లు వయసు పైన ఉన్న వారికి చేసిన ఖర్చు అయితే రూ.60,000 మొత్తంపైనా పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. 80ఏళ్లు ఆ పైన ఉన్నవారు అయితే ఈ పరిమితం రూ.80,000 వ‌ర‌కూ మిన‌హియంపులు పొందే వీలుంది. ఒకవేళ ఏదైనా వైద్య బీమా ఉండి ఉంటే, రీయింబర్స్ మెంట్ పోగా మిగిలిన మొత్తాన్ని వ్యయం కింద చూపించి పన్ను మినహాయింపు అందుకోవచ్చు.

డిమెన్షియా, డిస్టోనియా మస్కులోరమ్ డీఫర్మన్స్, మోటార్ న్యూరాన్ డిసీజ్, అటాక్సియా, చోరియా, హెమీ బాలిస్ మస్, అఫాసియా, పార్కిన్ సన్స్, మాలిగ్నంట్ కేన్సర్, ఎయిడ్స్, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్, హీమోఫీలియా, థలసీమియా వంటి హెమటోలాజికల్ డిజార్డర్లపై చేసే వ్యయానికే ఈ సెక్షన్ కింద మినహాయింపు లభిస్తాయి. నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధుల్లో వైకల్యం అయితే, కనీసం 40 శాతానికి పైగా ఉందని వైద్యులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఏయే జ‌బ్బుల‌కు ఈ మిన‌హాయింపు వ‌ర్తిస్తుంద‌నే విష‌యాన్ని ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని నిబంధ‌న‌-11డీడీ ద్వారా స్ప‌ష్టం చేసుకోవ‌చ్చు.

 విరాళాల విష‌యంలో ప‌న్ను ఆదా ఇలా...

విరాళాల విష‌యంలో ప‌న్ను ఆదా ఇలా...

మ‌నిషి సంఘ‌జీవి కాబ‌ట్టి కాస్త సామాజిక బాధ్య‌త ఉండాలి. అవసరం కంటే ఎక్కువ సంప‌ద ఉంటే అందులో కొంత మొత్తాన్ని దేశ, సమాజ హితం కోసం, దాన ధర్మాల రూపంలో ఖర్చు చేయాలి. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సామాజిక, అధ్యాత్మిక ఉన్నతి కోసం పని చేస్తున్న సంస్థలకు ఇచ్చే విరాళాలకు సెక్షన్‌ 80జి కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.

అయితే ఇలా చేసే దానాలు మన వార్షిక ఆదాయంలో పది శాతం మించకూడదు. ప్రభుత్వం గుర్తించిన ఆలయాలు, మసీదులు, చర్చిల పునరుద్ధరణ లేదా నవీకరణ, పునర్నిర్మాణ కార్యక్రమాలకు ఇచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన శాస్త్ర పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, కాలేజీలకు ఇచ్చే విరాళాలకూ సెక్షన్‌ 80జిజిఎ కింద ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.10,000 లేదా అంతకు మించి ఇచ్చే అన్ని విరాళాలను నగదేతర రూపంలో ఇవ్వాలి. ఆదాయ పన్ను రిటర్న్‌ ఫైల్‌ చేసేటపుడు ఈ ఖర్చులను చూపి పన్ను వ్య‌థ‌ల‌ను కొంతలో కొంత తగ్గించుకోవచ్చు. నేషనల్ డిఫెన్స్ ఫండ్, జవహర్ లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్, ప్రైమ్ మినిస్టర్స్ డ్రౌట్ రిలీఫ్ ఫండ్, నేషనల్ చిల్డ్రన్ ఫండ్, ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్, స్వచ్చ్ భారత్ కోష్, క్లీన్ గంగా ఫండ్ మొదలైన వాటికోసం చేసే దానాల‌పై సైతం ప‌న్ను ఉండ‌దు.

విక‌లాంగుల ఆరోగ్యం

విక‌లాంగుల ఆరోగ్యం

వికలాంగుల ఆరోగ్యం కోసం చేసే ఖర్చులకూ ఆదాయ‌పు ప‌న్నుచట్టం ద్వారా కొంత వరకు మినహాయింపు పొంద‌వ‌చ్చు. ఆదాయ పన్ను చెల్లించే వ్యక్తిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా వికలాంగులు ఉంటే, వారి ఆరోగ్య రక్షణ కోసం చేసే ఖర్చుల్లో ఏటా రూ.75,000 వరకు సెక్షన్‌ 80డిడి కింద మినహాయింపు పొందవచ్చు. అంగవైకల్యం మరీ తీవ్రంగా ఉంటే ఈ సెక్షన్‌ కింద రూ.1.25 లక్షల వరకు మినహాయింపును అనుమతిస్తారు.

 రాజకీయ పార్టీలకు విరాళాలు

రాజకీయ పార్టీలకు విరాళాలు

సెక్షన్ 80జీజీసీ కింద ఎలక్షన్ కమిషన్ గుర్తింపు పొందిన ఏదేనీ రాజకీయ పార్టీకి నగదు రహిత రూపంలో ఇచ్చే విరాళాలు ఎంత మొత్తమైనా ఆదాయపన్ను మినహాయింపు పరిధిలోకి వస్తుంది. రాజకీయ పార్టీ లేదా ఎల‌క్ట్రోర‌ల్ ట్ర‌స్ట్‌కు ఇచ్చే విరాళాల‌ను చెక్కులు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాల్సి ఉంటుంది. దాదాపు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల‌న్నీ బ్యాంకు ఖాతాల ద్వారా విరాళాల‌ను స్వీక‌రిస్తున్నందున మీరు ఆన్‌లైన్‌లో సైతం ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌వ‌చ్చు.

English summary

ప‌న్ను మిన‌హాయింపుల కోసం ఎప్పుడూ 80సీయేనా? వీటిని సైతం ప్ర‌య‌త్నించండి | Best tax saving options other than Section 80C in India

The tax planning season has begun and individuals would now look to beat the deadline set by their companies to handover tax investment proofs. Other practising professional have time until March 31, 2016 to do their tax planning.In a last minute hurry many go for unwantes savings and investments. Before planning your taxes one should be aware of the total income and tax liability in order to be smart tax saver. The government has provided with many plans using which individuals can make better investment decision along with tax saving options
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X