For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త సంవత్సరం ఆర్థిక ప్రణాళిక ఏ విధంగా ఉండాలి?

ఎవ‌రి ఆర్థిక‌ పరిస్థితులకు తగ్గట్టుగా వారు త‌మ తమ పెట్టుబడుల ప్రణాళికలను రచించుకుని, వాటిని కొనసాగించాలని సలహాలిస్తున్నారు. మార్కెట్లు ఆటుపోట్లకు లోనవుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు కొన్ని కీలకాంశాలను పాట

|

పెద్ద నోట్ల రద్దు, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ గెలుపు, భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బిఐ) వడ్డీ రేట్లను తగ్గించకపోవటం వంటి అంశాలు మార్కెట్ల‌ను బాగా ప్ర‌భావితం చేస్తున్నాయి. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) పెట్టుబ‌డిదారులు పూర్తిగా నిరుత్సాహానికి గుర‌వుతున్నారు. అయితే పెట్టుబ‌డిదారులు ప్రస్తుతం నెలకొన్న అంశాలపై దృష్టి పెట్టకుండా ఆచితూచి పెట్టుబడులు పెట్టడంతో పాటు స్వల్పకాలికంగా వచ్చే లాభాలకు దూరంగా ఉండటం మంచిదని ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణులు సూచిస్తున్నారు. ఎవ‌రి ఆర్థిక‌ పరిస్థితులకు తగ్గట్టుగా వారు త‌మ తమ పెట్టుబడుల ప్రణాళికలను రచించుకుని, వాటిని కొనసాగించాలని సలహాలిస్తున్నారు. మార్కెట్లు ఆటుపోట్లకు లోనవుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు కొన్ని కీలకాంశాలను పాటిస్తే మంచిదని ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజ‌ర్లు చెపుతున్నారు. ఈ క్ర‌మంలో కొత్త ఏడాది ఆర్థిక ప్ర‌ణాళిక ఏ విధంగా ఉండాలో చూద్దాం.

పెట్టుబడులనేవి నిరంతర ప్రక్రియ

పెట్టుబడులనేవి నిరంతర ప్రక్రియ

పెట్టుబడుల్లో చిన్నపాటి జాగ్రత్తల ద్వారా మీ జీవితంలో అనుకున్న ఆర్థిక లక్ష్యాలను సాధించవచ్చు. జీవితం అనేది ఒక ప్రణాళిక లేని దీర్ఘకాల వెకేషన్ ప్లాన్ లాగా ఉంటుంది. మనం మదుపు చేసే డబ్బు ఎంతైనా ఒకేదానిలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. వివిధ సాధనాలకు కేటాయించడం ఆర్థిక ప్రణాళికలో కీలకం. అయితే ఇలా చేసే ముందు మన నష్టభయ(రిస్కు సామర్థ్యం), లక్ష్యాలు, ఎంత కాలం పెట్టుబడి పెట్టగలం వంటి అంశాలను చూసుకోవాలి.

సాధనాలేవైనప్పటికీ.. ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికలు వేసుకోవడానికి, వ్యూహాలు రచించుకోవడానికి గడువు దాటిపోవడంలాంటిదేమీ ఉండదు. పెట్టుబడులు పెట్టడమనేది ఒక నిరంతరమైన ప్రక్రియ అని గుర్తుంచుకోవాలి. అసెట్ అలొకేషన్కు కట్టుబడి ఉండటం వల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవడటమే కాకుండా మార్కెట్లు అధిక స్థాయిల్లో ఉన్నప్పుడు కొనడం, పడిపోతున్నప్పుడు నష్టాలకు అమ్ముకోవడం వంటి సమస్యలు ఉండవు.

ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోండి...

ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోండి...

మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ఇన్వెస్టర్ల లక్ష్యాలను దెబ్బతీస్తున్నాయి. అయితే వీటన్నింటిని నిశితంగా గమనిస్తూ అవసరమైన విధంగా పెట్టుబడులు పెట్టుకోవటం మంచిది. ఆర్థిక ప్రణాళికకు అనుగుణంగా పెట్టుబడుల లక్ష్యాలను ఎంపిక చేసుకోవాలి. గాల్లో లెక్కలు వేయకుండా ప్రతి ఒక్క అంశాన్ని నిశితంగా పరిశీలించాలి. భవిష్యత ప్రణాళిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు పెడితే లాభాలు వాటంతట అవే వస్తాయి. వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సరైన వాటిల్లో పెట్టుబడులను పెట్టాలి. ఉదాహరణకు మీరు ఎప్పటినుంచో రియల్ ఎస్టేట్లో మంచి రాబడులు సాధిస్తూ ఉండి, దానిపైన అవగాహన ఉంటే కొంత మొత్తాన్ని అక్కడే పెట్టుబడులు పెడుతూ ఉండండి. అయితే మొత్తం స్థిరాస్తిపై పెట్టుబడులు పెట్డడం మంచిది కాదు. కొంచెం బంగారం, కొంచెం స్థిరాస్తి, ఎక్కువ శాతం ఈక్విటీ పెట్టుబడుల్లో పెట్టడం దీర్ఘకాలంలో మీకు లాభిస్తుంది.

 కేవ‌లం ఫిక్స్‌డ్ డిపాజిట్లే కాదు...

కేవ‌లం ఫిక్స్‌డ్ డిపాజిట్లే కాదు...

దేశీయంగా అనేక దశాబ్దాలుగా రిటైల్ ఇన్వెస్టర్లు స్థిరమైన రాబడులనిచ్చే సురక్షితమైన ఫిక్సిడ్ ఇన్కమ్ సాధనాలవైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తూ వచ్చారు. కానీ అలా చేస్తే మీ పెట్టుబడి, ఆర్థిక ప్రణాళికలు సమగ్రంగా ఉన్నట్లు కాదు. పోర్ట్ఫోలియో సమతౌల్యంగా ఉండాలంటే ఒకే సాధనానికి పరిమితం కాకుండా వైవిధ్యం పాటించాలి. ఆర్థిక ప్రణాళికలు వేసుకునేటప్పుడు, పెట్టుబడులు పెట్టేటప్పుడు కేవలం ఒక సాధనానికి ఫిక్సయిపోతే పెద్దగా ప్రయోజనాలు రాకపోవచ్చు. అదే వివిధ రకాల సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే... ఒకటి తగ్గినా.. రెండోది కాస్త మెరుగ్గా రాణిస్తే ఆ మేరకు బ్యాలెన్స్ అవుతుంది.

దీన్నే అసెట్ అలొకేషన్ వ్యూహంగా వ్యవహరిస్తారు. అరుుతే, ఇలా పెట్టుబడులకు వివిధ సాధనాలను ఎంపిక చేసుకోవాలన్న సంగతి తెలిసినా కూడా మనలో చాలా మంది దాన్ని ఆచరణలో పెట్టడంలో విఫలమవుతుంటారు. కానీ, ఇప్పుడిప్పుడే ఈ ధోరణి క్రమంగా మారుతోంది. మనవాళ్లు ఇతర పెట్టుబడి సాధనాల వైపు కూడా చూస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పెట్టుబడి సాధనాల సంగతి తీసుకుంటే షేర్లు, బాండ్లు, రియల్ ఎస్టేట్, బంగారం లేదా కమొడిటీ(లోహాలు, చమురు, సహజ వాయువు) మొదలైనవి అనేకం ఉన్నాయి. రిటైల్ ఇన్వెస్టర్ల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్న వాటిలో మ్యూచువల్ ఫండ్లు ఉంటున్నాయి.

 బ్యాలెన్స్డ్ ఫండ్ల వల్ల ప్రయోజనాలు

బ్యాలెన్స్డ్ ఫండ్ల వల్ల ప్రయోజనాలు

ఇన్వెస్టరు క్రియాశీలకంగా ఉన్నా, లేకపోరుునా ప్రస్తుత పరిస్థితుల్లో తగు రీతిలో వివిధ పెట్టుబడి సాధనాలకు కేటారుుంపులు జరపడం కొంచెం కష్టమైన పనే. అందుకే రిటైల్ ఇన్వెస్టర్ల కోసం బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్లు మొదలైనవి అందుబాటులో ఉన్నారుు. ఇవి ఈక్విటీలు, డెట్ సాధనాల్లో తగు పాళ్లలో (సాధారణంగా 65 శాతం ఈక్విటీల్లో, 35 శాతం డెట్లో) ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మరో విధంగా చెప్పాలంటే అటు ఈక్విటీల రిస్క్ని, ఇటు డెట్ సాధనాల స్థిరత్వాన్ని మేళవించి ఇవి క్రమమైన మంచి రాబడులను అందిస్తాయి. ఈ బ్యాలెన్స్డ్ ఫండ్లలోనే అడ్వాంటేజి ఫండ్లు సైతం ఉన్నాయి. ఈ తరహా ఫండ్లు.. ప్రధానంగా మార్కెట్లు చవకగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసి, పెరుగుతున్నప్పుడు లాభాలకు అమ్మేసి రాబడులు అందజేస్తుంటాయి. తద్వారా రిస్కును తగ్గించి, దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులు అందించే అవకాశాలు ఉంటాయి.

అప్పుల విషయంలో జాగ్రత్త

అప్పుల విషయంలో జాగ్రత్త

చిన్నపాటి అవసరాలకు అప్పు చేసే విధంగా మీ ఆర్థిక జీవన శైలి ఉంటే దీర్ఘకాలంలో ఇది చాలా ప్రమాదకరం. అప్పులు చేయడమంటే కేవలం డబ్బు రూపంలో ఇతరుల నుంచి తీసుకోవడం అనే అర్థమే కాదు. తరుచూ క్రెడిట్ కార్డుల్లాంటి వాటిపై ఆధారపడటం కూడా ఒక విధంగా అప్పు చేయడం లాంటిదే. అడగ్గానే కొద్దిపాటి కనీస డాక్యుమెంట్లతో అప్పులిచ్చే సంస్థలు ఉంటున్నాయి. ఒక్క క్లిక్తో క్రెడిట్ కార్డు నుంచి రుణం తీసుకోవచ్చు. వ్యక్తిగత రుణం పొందడం అంత కష్టమేమీ కాదు. అప్పు చేయడం అనేది మనలోని ఒక చెడు అలవాటే. దీనిపై విజయం సాధించడం అంత తేలికేమీ కాదు. ఎంతో ఆర్థిక క్రమశిక్షణ ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది. ఇప్పుడు కొత్త కొత్త సంస్థలు, ఆప్లు కూడా క్షణాల్లో రుణం ఇవ్వడానికి సిద్ధం అంటూ ముందుకు వస్తున్నాయి. ఇలాంటి వాటి నుంచి రుణం తీసుకునే ముందు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వడ్డీ రేట్ల విషయంలోనూ, రుసుములు తదితర వాటిని క్షుణ్నంగా పరిశీలించాలి. ఎంత అవసరంలోనైనా ఎవరినీ చేయిచాచి, అర్థించకుండా.. అప్పులు చేయకుండా ఉండాలంటే... సంపాదించిదంతా.. వెంట వెంటనే ఖర్చు చేయాలన్న ఆలోచన నుంచి ముందుగా బయటపడాలి. కొన్ని మంచి పనులకు మనలోని కొన్ని గుణాలను త్యాగం చేయాల్సిందే. పొదుపు విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. ఇలా చేయగలిగినప్పుడు మీ ఆర్థిక భవిష్యత్తు పటిష్టంగా ఉంటుంది.

ప‌రిమితిలో ఖ‌ర్చులు

ప‌రిమితిలో ఖ‌ర్చులు

ఏ వ్య‌క్తి ఖ‌ర్చులైనా వారి ఆదాయానికి త‌గ్గ‌ట్లుగా ఉండాలి. సంపాదించే ప్ర‌తి పైసా ప్ర‌ణాళిక‌తో కూడుకుని ఉండాలి. కంపెనీల ప్ర‌చారం, రాయితీల‌పై మోజుప‌డి అన‌వ‌స‌ర‌మైన‌వి కొన‌కూడ‌దు. అవ‌స‌రం ఉన్నా, లేక‌పోయినా ఆఫ‌ర్లు ఉన్నాయ‌ని కొనేస్తే చివ‌రికి అప్పుల పాల‌వుతారు. దీంతో పొదుపు, పెట్టుబ‌డులూ దెబ్బ‌తింటాయి. ఆర్థిక భ‌విష్య‌త్తూ ప్ర‌మాదంలో ప‌డుతుంది. ముందుగానే నెల‌వారీ ప్ర‌ణాళిక సిద్దం చేసుకుని మీ సంపాద‌న‌ను ఆ ప్ర‌కార‌మే ఖ‌ర్చు చేస్తే మంచిది. వీలైనంత వ‌ర‌కూ మొద‌ట పొదుపు, పెట్టుబ‌డుల కోసం కొంత మొత్తం తీసి ప‌క్క‌న పెట్టిన త‌ర్వాతే ఖ‌ర్చుల గురించి ఆలోచించాలి.

పెట్టుబ‌డిదార్లు ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి

పెట్టుబ‌డిదార్లు ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి

మ‌దుప‌ర్లు త‌మ పెట్టుబ‌డుల‌ను ఉప‌సంహ‌రించుకునేందుకు స‌రైన స‌మ‌యం కోసం ఓపిక‌తో ఎదురు చూడాలి. మార్కెట్ టైమింగ్‌ను స‌రిగా ప‌సిగ‌ట్టాలి. కొన్ని షేర్ల‌లో త్వ‌రిత‌గ‌తిన రాబ‌డులు వ‌స్తే మ‌రికొన్నింటిలో ఏళ్ల స‌మ‌యం ప‌డుతుంది. మూలాలు మంచిగా ఉన్న‌ప్ప‌టికీ కొన్ని సంస్థ‌ల షేర్లు లాభాల‌ను ఆర్జించేందుకు ఒక్కోసారి ఎక్కువ ఏళ్లు ప‌డుతుంది. కొంత మంది ఇన్వెస్ట‌ర్లు దీన్ని గ‌మ‌నించ‌కుండా పెట్టుబ‌డుల ప్ర‌ణాళిక‌లు, న‌ష్ట భ‌యాన్ని త‌ట్టుకునే సామ‌ర్థ్యం, ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకుంటారు. దీర్ఘ‌కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగితే మార్కెట్ల‌లో ఆటుపోటులు ఎదురైనా ఆక‌ట్టుకునే రీతిలో రిట‌ర్నులు పొంద‌వ‌చ్చు.

Read more about: investment
English summary

కొత్త సంవత్సరం ఆర్థిక ప్రణాళిక ఏ విధంగా ఉండాలి? | 2017 Is Coming these are the Financial Decisions For The New Year

The new year is fast approaching. Here are some simple changes you can make when 2017 starts that will add a significant thrust to your overall portfolio over time. Understanding your values and attitudes about your finances will bring clarity to the decision-making process. It will help you identify your values and make resolutions based on those values.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X