For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారు బాండ్ల‌పై ప్ర‌భుత్వ ఆఫ‌ర్లు

ప్రభుత్వం ఈ ద‌ఫా ఆరోసారి బంగారు బాండ్లను అందుబాటులోకి తెచ్చింది. వీటి కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఈసారి ఒక గ్రాముపై 50 రూపాయల రాయితీని ఇవ్వాలని నిర్ణయించారు.

|

ప్రభుత్వం ఈ ద‌ఫా ఆరోసారి బంగారు బాండ్లను అందుబాటులోకి తెచ్చింది. వీటి కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఈసారి ఒక గ్రాముపై 50 రూపాయల రాయితీని ఇవ్వాలని నిర్ణయించారు. అక్టోబర్‌ 17-21 తేదీ మధ్య భారత బులియన్‌, జువెలర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించిన ధరల సగటును లెక్కిస్తే గ్రాము బంగారం ధర 3,007 రూపాయలుగా ఉంది. అయితే దీనికి బదులు ప్రభుత్వం 50 రూపాయల రాయితీ త‌ర్వాత గ్రాము బాండ్‌ విలువను 2,957 రూపాయలుగా నిర్ణయించారు. ఈ బాండ్ల సబ్‌స్ర్కిప్షన్‌ ఈ నెల 24వ తేదీ నుంచి నవంబర్‌ 2వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. నవంబర్‌ 17న బాండ్లను జారీ చేస్తారు.

gold bonds

భౌతిక రూపంలో బంగారానికి(బంగారు ఆభ‌ర‌ణాలు,క‌డ్డీలు) ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్‌లో దీన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు ఐదు విడతల్లో ఈ బాండ్లను జారీ చేశారు. ప్రభుత్వం తరఫున రిజర్వు బ్యాంకు వీటిని జారీ చేస్తోంది.

ఇది కూడా చ‌ద‌వండి బంగారంపై పెట్టుబ‌డులు ఇలా..

ప్ర‌త్యేక ఫీచ‌ర్లు

  • ఈ ప‌థ‌కంలో గ‌రిష్ట పెట్టుబ‌డి 500 గ్రాముల వ‌ర‌కూ ఉంది.
  • క‌నీస పెట్టుబ‌డి 2 గ్రాముల నుంచి మొద‌లవుతోంది.
  • డీమ్యాట్, పేప‌ర్ స‌ర్టిఫికెట్ల రూపంలో అందుబాటులో ఉంది.
  • స్టాక్ ఎక్స్చేంజీల్లో ట్రేడ్ చేయ‌వ‌చ్చు.
  • నిర్ణీత కాలంలో ప‌రిమిత వ‌డ్డీ వ‌స్తుంది.
  • బాండు కాల‌ప‌రిమితి 8 ఏళ్లు.
  • 5,6,7 ఏళ్ల నుంచి ప‌థ‌కంలో నుంచి వైదొల‌గ‌వ‌చ్చు.
  • రుణాల‌కు హామీగా(త‌న‌ఖా) వీటిని వాడుకోవ‌చ్చు.
  • బాండ్ల కోసం చెల్లింపుల‌ను చెక్కు,డ్రాఫ్ట్ లేదా ఆన్‌లైన్ ద్వారా చేయ‌వ‌చ్చు.
  • 18001800000 టోల్‌ఫ్రీ నంబ‌రులో మ‌రింత స‌మాచారం తెలుసుకోవ‌చ్చు.

English summary

బంగారు బాండ్ల‌పై ప్ర‌భుత్వ ఆఫ‌ర్లు | super offer on gold bonds

In a bid to make Sovereign Gold Bonds (SGB) more attractive, the government is offering a discount of Rs 50 per gram in the sixth tranche of the scheme which opens today.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X