For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారంపై పెట్టుబ‌డులు ఇలా..

|

తాత‌ల కాలం నుంచి డ‌బ్బు అద‌నంగా ఉంటే అయితే స్థిరాస్తి లేదా బంగారం రూపంలో పెట్టుబ‌డులు పెట్ట‌డం చాలా మందికి అల‌వాటైన విష‌యం. బంగారం అన‌గానే దుకాణాల‌కు వెళ్లి మంచి బంగారం వెతికి కొనేయ‌డం ప‌రిపాటే. కాలం మారిన కొద్దీ ఆ తిప్ప‌లు కొద్దిగా త‌ప్పాయి. ఖ‌చ్చితంగా బంగారంలో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకునేవారికి ఇత‌ర మార్గాలు వ‌చ్చి చేరాయి. ద్ర‌వ్యోల్బ‌ణానికి మించిన రాబ‌డుల‌నిస్తాయ‌ని బంగారం పెట్టుబ‌డుల‌కు చాలా మంది ప్రాధాన్య‌త‌నిస్తారు. అయితే దీనివ‌ల్ల దిగుమ‌తుల భారం పెరుగుతోంద‌ని భావించిన ప్ర‌భుత్వం కొన్ని ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టింది.

సార్వ‌భౌమ బంగారు బాండ్ల‌(సావ‌రిన్ గోల్డ్ బాండ్)ప‌థ‌కం

సార్వ‌భౌమ బంగారు బాండ్ల‌(సావ‌రిన్ గోల్డ్ బాండ్)ప‌థ‌కం

భౌతిక రూపంలో బంగారాన్ని కొనే బ‌దులు ఆర్‌బీఐ బంగారు బాండ్ల‌ను జారీ చేస్తుంది. ఈ బాండ్ల‌ను గ్రాముల రూపంలో కొన‌వ‌చ్చు. వీటిపై ప్ర‌స్తుతం 2.75 శాతం వ‌డ్డీ వ‌స్తుంది. ఇందులో బంగారానికి స‌మాన‌మైన విలువ క‌లిగిన స‌ర్టిఫికెట్ల‌ను ఇస్తారు. ఈ స‌ర్టిఫికెట్ల‌ను డీమ్యాట్ లేదా పేప‌ర్ రూపంలో పొంద‌వ‌చ్చు. ఈ బాండ్ 8 ఏళ్ల కాలావ‌ధి క‌లిగి ఉంటుంది. 5,6,7 సంవ‌త్స‌రాల నుంచి పెట్టుబ‌డిని వెన‌క్కి తీసుకునే అవ‌కాశం ఉంది.

గోల్డ్ మానిటైజేష‌న్ స్కీమ్ (ప‌సిడి న‌గ‌దీక‌ర‌ణ ప‌థ‌కం)

గోల్డ్ మానిటైజేష‌న్ స్కీమ్ (ప‌సిడి న‌గ‌దీక‌ర‌ణ ప‌థ‌కం)

దేశంలో ప్ర‌జ‌ల వ‌ద్ద ఇళ్ల‌లో నిరుప‌యోగంగా ఉన్న బంగారాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు కేంద్రం ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఎవ‌రి ద‌గ్గ‌రైతే బంగారం ఉండి దాన్ని ఏదో విధంగా కొంత డ‌బ్బు రాబ‌డి రావాల‌నుకునే వారికి ఇది బాగా ఉంటుంది. ఈ ప‌థ‌కంలో బంగారు పొదుపు ఖాతాను తెరుస్తారు. అందులో మీ బంగారాన్ని డిపాజిట్ చేయాలి. మీ బంగారాన్ని ఆభ‌ర‌ణాలు, కాయిన్లు, క‌డ్డీల రూపంలో భ‌ద్ర‌ప‌రుస్తారు. బంగారు బ‌రువును బ‌ట్టి వ‌డ్డీ వ‌స్తుంది. ఇందులో స్వ‌ల్ప‌కాలిక డిపాజిట్లు 1 నుంచి 3 ఏళ్ల పాటు, మ‌ధ్య కాలిక డిపాజిట్ల‌(5-7 ఏళ్లు), దీర్ఘ‌కాలిక డిపాజిట్లు(12-15ఏళ్లు) అని మూడు ర‌కాల కాల‌పరిమితుల్లో బంగారం డిపాజిట్ చేయ‌వ‌చ్చు.

అశోక చ‌క్ర గోల్డ్ కాయిన్లు

అశోక చ‌క్ర గోల్డ్ కాయిన్లు

గోల్డ్ మానిటైజేష‌న్‌లో భాగంగా బంగారు కాయిన్ల‌ను జారీ చేస్తున్నారు. ప్ర‌స్తుతానికి 5,10 గ్రాముల కాయిన్లు ఉన్నాయి. 20 గ్రాముల బార్లు సైతం ఉన్నాయి. ఈ కాయిన్ల స్వ‌చ్చ‌త 24 క్యారెట్‌. బీఐఎస్ ప్ర‌మాణాలు క‌లిగిన హాల్ మార్క‌డ్ కాయిన్లివి. దేశంలోని ఎమ్ఎమ్‌టీసీ(మెట‌ల్స్ అండ్ మిన‌ర‌ల్స్ ట్రేడింగ్ కార్పొరేష‌న్‌) కేంద్రాల ద్వారా అమ్ముతున్నారు.

గోల్డ్ ఫ్యూచ‌ర్లు

గోల్డ్ ఫ్యూచ‌ర్లు

బంగారాన్ని కొని ఫ్యూచ‌ర్స్‌ మార్కెట్లో అమ్మొచ్చు. గోల్డ్ ఫ్యూచ‌ర్స్ ద్వారా భ‌విష్య‌త్తులో బంగారం ధ‌ర‌ల‌ను ట్రాక్ చేస్తూ ఉంటారు. ముందుగా నిర్ణ‌యించిన కాల‌పరిమితిలోపు కాంట్రాక్టుల‌ను సెటిల్ చేయాల్సి ఉంటుంది. గోల్డ్ ఫ్యూచ‌ర్స్ న‌ష్ట‌భ‌యంతో కూడిన పెట్టుబ‌డి. న‌ష్టం వ‌చ్చినా స‌రే కాంట్రాక్టును పెట్టుబ‌డిదారు పూర్తిచేయాల్సి ఉంటుంది. అదే గోల్డ్ కాయిన్లు, బార్ల విష‌యంలో మీకు న‌ష్టం వ‌స్తే వాటిని అలాగే కొన‌సాగించ‌వ‌చ్చు. గోల్డ్ ఫ్యూచ‌ర్లు అంటే స్టాక్ మార్కెట్‌లో షేర్ల‌ను ఎలా ట్రేడ్ చేస్తామో అలాగే బంగారాన్ని కొన‌డం అమ్మ‌డం లాంటిది. క‌మొడిటీ మార్కెట్లో ట్రేడ్ చేసేందుకు బ్రోక‌ర్ వ‌ద్ద ఖాతా తెర‌వాల్సి ఉంటుంది.

గోల్డ్ ఈటీఎఫ్

గోల్డ్ ఈటీఎఫ్

స్టాక్ ఎక్స్చేంజీలో షేర్ల‌ను ట్రేడ్ చేసిన‌ట్లే ఎక్స్చేంజీ ట్రేడెడ్ ఫండ్లు ఓపెన్ ఎండెడ్ ఫండ్లు. ఒక్కో యూనిట్ కొన్నిషేర్ల‌తో స‌మానంగా ఉంటుంది. రెగ్యుల‌ర్ షేర్ల మాదిరే గోల్డ్ ఈటీఎఫ్‌ల‌ను ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో కొన‌వ‌చ్చు. ఇందుకోసం డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతా అవ‌స‌రం. కొంత కాలానికి నిర్ణీత మొత్తంలో బంగారాన్ని సొంత చేసుకునేందుకు ఈ ఈటీఎఫ్‌లు అవ‌కాశం ఇస్తాయి.ఈ పెట్టుబ‌డుల‌కు ఫండ్ హౌస్‌లు కొంత మొత్తంలో అసెట్ మేనేజ్‌మెంట్ రుసుముల‌ను వ‌సూలు చేస్తాయి.

గోల్డ్ సేవింగ్ ఫండ్స్

గోల్డ్ సేవింగ్ ఫండ్స్

మ‌నం స్టాక్ బ్రోకింగ్‌, మ్యూచువ‌ల్ ఫండ్ కంపెనీల ద్వారా ఈ ఫండ్ల‌ను కొన‌వ‌చ్చు. ఈ గోల్డ్ సేవింగ్ ఫండ్ల ద్వారా సేక‌రించిన మొత్తాన్ని ఆయా కంపెనీలు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబ‌డులుగా పెడ‌తాయి. ఒక ర‌కంగా గోల్డ్ సేవింగ్ ఫండ్స్‌ను ఫండ్ ఆఫ్ ఫండ్స్‌గా పిల‌వ‌చ్చు. ఇప్ప‌టివ‌ర‌కూ ఇవి ప్ర‌భుత్వ నియంత్ర‌ణ క‌లిగి మంచి రాబ‌డుల‌ని ఇస్తున్నాయి. బంగారు కంపెనీల ఈక్విటీ నిధుల్లో పెట్టుబ‌డులు పెట్టేందుకు సైతం వీరికి ప్ర‌పంచ స్వ‌ర్ణ మండ‌లి(వ‌ర‌ల్డ్ గోల్డ్ కౌన్సిల్‌) అనుమ‌తించింది.

ఈ-గోల్డ్

ఈ-గోల్డ్

నేష‌న‌ల్ స్పాట్ ఎక్సేంజీ లిమిటెడ్ ఈ గోల్డ్ ఆప్ష‌న్‌ను అందిస్తోంది. అంటే మీరు డ‌బ్బు పెట్టుబ‌డి పెడితే అందుకు బ‌దులుగా ఎక్స్చేంజీ బంగారాన్ని కొని వేర్‌హౌస్‌ల్లో స్టోర్ చేస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఉండే ప్ర‌యోజ‌నాల‌న్నీ ఇందులో ఉంటాయి.

జీఎస్ గోల్డ్ బీఇఈఎస్‌(GS Gold BeES)

జీఎస్ గోల్డ్ బీఇఈఎస్‌(GS Gold BeES)

దేశంలో అతిపెద్ద గోల్డ్ ఈటీఎఫ్ ఇదే. యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్ త‌ర్వాత గ‌త ఏడాది కాలంలో ఉత్త‌మ రాబ‌డుల‌నిచ్చిన ఈటీఎఫ్‌గా దీనికి పేరుంది. దీర్ఘకాల పెట్టుబ‌డి ప్ర‌ణాళిక ఉండే వారికి ఇది బాగా ఉంటుంది.

బంగారు ఈటీఎఫ్‌ల‌కు మామూలు బంగారం కొనేట‌ప్పుడు ఉన్న‌ట్లే ప‌న్నులు ఉంటాయి. ఇవి ప్ర‌ముఖ స్టాక్ ఎక్స్చేంజీలైన బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ల‌భ్య‌మ‌వుతాయి. షేర్ల‌ను కొన్న‌మాదిరే వీటిని కొన‌చ్చు. అధిక స‌మాచారం కొర‌కై మీ బ్రోక‌ర్ల‌ను అడిగి స‌ల‌హా తీసుకోవ‌డం మంచిది.

Read more about: gold gold investments gold scheme
English summary

బంగారంపై పెట్టుబ‌డులు ఇలా.. | types of gold investments in India

India has an estimated 20,000 tonnes of gold lying idle with Indian households and institutions. The following schemes are aimed at bringing the gold lying with citizens into the economy, and at reducing India’s dependence on gold imports.Instead of Physical gold you can go for alternatives
Story first published: Saturday, September 24, 2016, 10:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X