For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్థికంగా ఎదిగేందుకు మార్చుకోవాల్సిన 10 అలవాట్లు

|

బ‌తిక‌నంత కాలం రాజులాగా కాక‌పోయినా ఒక‌రి ద‌గ్గ‌ర చేయి చాచే అవ‌స‌రం లేకుండా ఉండాల‌ని అంద‌రూ భావిస్తారు. సొంత ఇల్లు చాలా మందికి జీవిత ఆశ‌యం. కొందరు దాన్ని సాధించ‌వ‌చ్చు, కొంద‌రు సాధించ‌లేక‌పోవ‌చ్చు. కొన్ని అలవాట్ల కార‌ణంగా క‌నీస స‌దుపాయాలు కూడా స‌మకూర్చుకోలేకుండా జీవితాన్ని సాగించాల్సి రావ‌చ్చు. ఎవ‌రికైనా జీవ‌నశైలే వారి వృత్తి, వ్య‌క్తిగ‌త జీవితాన్ని చాలా ప్ర‌భావితం చేస్తుంది. ఆ జీవ‌న శైలిలో డ‌బ్బు ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. ఈ కొన్ని ఆర్థిక అల‌వాట్ల వ‌ల్ల మీ భ‌విష్య‌త్తుపై ప్ర‌భావితం ప‌డుతుంది. వీటిలో ఏవైనా మీకు న‌చ్చ‌క‌పోతే వాటిని మార్చుకునేందుకు ప్ర‌య‌త్నించండి.

1. ఆదాయం కంటే ఖ‌ర్చులెక్కువ‌

1. ఆదాయం కంటే ఖ‌ర్చులెక్కువ‌

ప్ర‌ణాళిక బ‌ద్దంగా జీవితం గ‌డ‌ప‌క‌పోతే మ‌న‌కు వ‌చ్చే ఆదాయం క‌న్నా ఖ‌ర్చులెక్కువ అవుతాయి. అందుకే ప్ర‌తి నెలా మీకంటూ ఒక ఆర్థిక ప్ర‌ణాళిక‌ను ఏర్ప‌ర‌చుకోండి. మొద‌ట ప్ర‌ణాళికంటూ వేసుకునే వారు కొంచెం అన్నా ఖర్చుల‌ను నియంత్రించ‌గ‌లుగుతారు. ప్ర‌ణాళిక వేసుకున్న త‌ర్వాత మీకు అవ‌స‌ర‌మైన మార్పుల‌ను చేసుకునే వెసులుబాటు మీ చేతిలోనే ఉంటుంది. మీ ఆర్థిక వ్య‌వ‌హారాల మీద మీకు నియంత్ర‌ణ ఉండాలంటే ఇది ఎంతైనా ముఖ్యం.

2.మ‌న‌కు ఎందుకులే పొదుపు?

2.మ‌న‌కు ఎందుకులే పొదుపు?

నెల‌నెలా చాలినంత జీతం వ‌స్తుంది క‌దా ఇంక పొదుపు ఎందుకు అనే భావ‌న కొంత మందిలో ఉంటుంది. మీ భ‌విష్య‌త్తు భ‌ద్రంగా ఉండాలంటే పొదుపు చేయడం అనేది త‌ప్ప‌నిస‌రని గుర్తుంచుకోండి. చాలా మంది ఎంత జీతం వచ్చినా పొదుపు చేయ‌డంలో విఫ‌లం అవుతూ ఉంటారు. ఇదంతా వారి విప‌రీత‌మైన ఖ‌ర్చు చేసే అలవాట్ల కార‌ణంగానే. ఇది ఏదో ఒక రోజు ఆర్థికంగా ఇబ్బందుల‌ను తెచ్చిపెడుతుంది.

3.స‌మ‌యానికి బిల్లులు చెల్లించ‌క‌పోవ‌డం

3.స‌మ‌యానికి బిల్లులు చెల్లించ‌క‌పోవ‌డం

చాలా మంది యువ‌త‌రం స‌మ‌యానికి బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏముందిలే ఇంకా డ్యూ డేట్ ఉంది క‌దా అనే వాయిదా ధోర‌ణి మంచిది కాదు. ఒక‌సారి స‌మ‌యానికి బిల్లులు చెల్లించి చూస్తే ప్ర‌తిసారి అలా చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఒక్కోసారి బిల్లు చెల్లింపులు ఆల‌స్య‌మైతే పెనాల్టీ లేదా వ‌డ్డీ చెల్లించాల్సి రావ‌చ్చు. అందుకే స‌మ‌యానికి బిల్లులు చెల్లించండం నేర్చుకోండి.

4.రిస్క్ పెట్టుబ‌డులు

4.రిస్క్ పెట్టుబ‌డులు

మార్కెట్ రిస్క్‌ల‌ను అవగాహ‌న చేసుకోకుండా రిస్క్ పెట్టుబ‌డుల వైపు అడుగేయడం మంచిది కాదు. గుడ్డిగా న‌ష్ట‌భ‌యం ఉన్న వాటిలో పెట్టుబ‌డులు పెడితే త‌ర్వాత త‌గిన మూల్యం చెల్లించుకుంటారు. అన్ని తెలుసుకుని పెట్టుబ‌డుల‌ను పెడితే భ‌విష్య‌త్తు బాగుంటుంది.

5.రుణాలు

5.రుణాలు

ప్ర‌స్తుత రోజుల్లో క్ర‌మ‌మైన ఆదాయం ఉంటే రుణం తీసుకోవడం సులువైంది. రుణం తీసుకున్న త‌ర్వాత నెల‌నెలా ఈఎమ్ఐలు క‌ట్టేందుకు డ‌బ్బును స‌ర్దుబాటు చేసుకుంటూ ఉండాలి. విలాసాల‌కు లేదా ఖ‌రీదైన వ‌స్తువుల‌ను కొనేందుకు మ‌న స్తోమ‌త‌కు మించి అప్పు చేయ‌క‌పోవ‌డం మీ ఆర్థిక వ్య‌వ‌హారాల‌కు మంచిది. మీరు కోరిక‌లను తీర్చుకునేందుకు అప్పులు చేస్తూ పోతే త‌ర్వాత క‌నీస అవ‌స‌రాల‌ను తీర్చుకునేందుకు సైతం చేతిలో డ‌బ్బు ఉండ‌దు. దాని బ‌దులు కొన్ని ఆర్థిక ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకుని ఆ దిశ‌గా పొదుపు చేయ‌డం అల‌వాటు చేసుకోండి.

6.వాయిదా వేసే అల‌వాటు

6.వాయిదా వేసే అల‌వాటు

నిమిషం దాకా వాయిదా వేసే అలవాటు మ‌న‌లో చాలా మందికి ఉంటుంది. స్థ‌లం, ఇల్లు కొన‌డం, ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయ‌డం, మ్యూచువ‌ల్ ఫండ్స్ పెట్టుబ‌డులు వంటి ముఖ్య‌మైన వాటిని వాయిదా వేయ‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడే ప్రారంభించండి.

7.ఖ‌రీదైన జీవ‌న‌శైలి

7.ఖ‌రీదైన జీవ‌న‌శైలి

త‌ర‌చూ పార్టీలంటూ తాగడానికి ఎక్కువ డ‌బ్బు ఖ‌ర్చుపెట్ట‌డం మీ బ‌డ్జెట్‌కు మంచిది కాదు. ఏదో కార‌ణంతో రెస్టారెంట్ల‌కు వెళ్లే అల‌వాటు ఉంటే భ‌విష్య‌త్తు కోసం పొదుపు చేయ‌లేరు. వీట‌న్నింటినీ వ‌దిలిపెట్ట‌మ‌ని కాదు. ఏదైనా ప‌రిమితిలో ఉండాలి.

8.పెట్టుబ‌డి పెట్టేందుకు భ‌యం

8.పెట్టుబ‌డి పెట్టేందుకు భ‌యం

మామూలుగా చాలా మంది న‌ష్ట‌భ‌యం ఉన్న‌వాటిలో పెట్టుబ‌డి పెట్టేందుకు భ‌య‌ప‌డుతూంటే, కొంత మంది అస‌లు పెట్టుబ‌డులు పెట్టే విష‌యంలో కాస్త జంకుతూ ఉంటారు. సంశ‌యిస్తూ ఉంటారు. ఏ పెట్టుబ‌డిలోనైనా ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. అయితే మీకు బాగా న‌మ్మ‌కం ఉన్న పెట్టుబ‌డుల‌తోనే మ‌దుపు ప్రారంభించండి.

9.ప‌న్ను ప్ర‌యోజ‌నాలు

9.ప‌న్ను ప్ర‌యోజ‌నాలు

ప్ర‌స్తుతం ఉద్యోగాల్లో చేరిన వెంట‌నే స‌రైన ఆర్థిక ప్ర‌ణాళిక లేక కొంత మంది ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను అందుకోలేక‌పోతున్నారు. ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిక్లరేష‌న్లు స‌మ‌యానికి స‌మ‌ర్పించి, ట్యాక్స్ సేవింగ్ సాధ‌నాల్లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా త‌క్కువ ప‌న్నుల‌తో డ‌బ్బును మిగుల్చుకోవ‌చ్చు. ఇది దీర్ఘ‌కాలంలో బాగా ఉప‌క‌రిస్తుంది.

10. బీమా విష‌యంలో

10. బీమా విష‌యంలో

చాలా మంది సంపాద‌న‌ప‌రులు బీమా విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తారు. అంతే కాకుండా అత్య‌వ‌స‌ర నిధి(ఎమ‌ర్జెన్సీ ఫండ్‌)ని ఏర్ప‌రుచుకోరు. బీమా పాల‌సీ తీసుకోకుండా మీరు మిమ్మ‌ల్నే కాకుండా మీ కుటుంబాన్ని సైతం ఆర్థికంగా అభ‌ద్ర‌త‌లోకి నెట్టుతున్నారు. సంపాద‌న మొద‌లుపెట్టిన కొద్ది రోజుల‌కే బీమా పాల‌సీని త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవ‌డం సూచ‌నీయం.

మీకు న‌చ్చిన సూచ‌న‌ల‌ను పాటించి ఆర్థికంగా జీవితాన్ని బ‌ల‌ప‌రుచుకోండి.

English summary

ఆర్థికంగా ఎదిగేందుకు మార్చుకోవాల్సిన 10 అలవాట్లు | These financial habits you have to change to make life happier

If you are financially strong many mention tensions will keep away from you. Most of us like to live in the present. While we are all game for it, planning for your future is something that cannot be ignored.Financial habits are worrisome for some people. try to change these and make life happier
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X