For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో త‌రుచూ వాడే ప‌దాలు

|

మ్యూచువ‌ల్ ఫండ్స్ మీద ఇప్పుడిప్పుడే అవ‌గాహ‌న పెరుగుతూ వ‌స్తోంది. ఈక్విటీ, డెట్ మ్యూచువ‌ల్ ఫండ్లు అని మీరు చాలా చోట్లే విని ఉంటారు. అయితే ఒక్కో ఫండ్‌కు సంబంధించి కొన్ని ప్రాథ‌మిక అంశాలు ఉంటాయి. మొద‌టిసారి పెట్టుబ‌డి పెట్టేవారికి కొన్ని ప‌దాలు అర్థం కావు. అలాంటి వారి కోస‌మే త‌రుచూ వాడే ప‌దాలు, వాటి వివ‌ర‌ణ ఇక్క‌డ జ‌రిగింది.

ఎన్ఏవీ:

ఎన్ఏవీ:

షేరుకు విలువ ఉన్న‌ట్లు మ్యూచువ‌ల్ ఫండ్‌కు ఒక విలువ ఉంటుంది. ఒక పెద్ద ఫండ్‌ను కొన్ని యూనిట్లుగా విభ‌జిస్తారు. ప్ర‌తి యూనిట్ విలువ‌ను ఎన్ఏవీ అంటారు. ఈ ధ‌ర వ‌ద్ద పెట్టుబ‌డిదారులు కొన‌డం, అమ్మ‌డం చేస్తారు. దాదాపు ప్ర‌తి రోజు ఎన్ఏవీ విలువ‌ను లెక్కిస్తారు.

ఫోలియో నంబ‌రు:

ఫోలియో నంబ‌రు:

మ్యూచువ‌ల్ ఫండ్ స్కీమ్‌ను గుర్తించేందుకు ఫండ్ హౌస్ ఒక్కో ఫండ్‌కు ఒక ఫోలియో నంబ‌రును కేటాయిస్తుంది. ఒక్కో ఫండ్ హౌస్ వ‌ద్ద ఎన్ని ఫోలియోలు క‌లిగి ఉండాల‌న్న దానిపై ప‌రిమితి లేదు.

ఎంట్రీ లోడ్ అండ్ ఎగ్జిట్ లోడ్( ప్ర‌వేశ రుసుము, నిష్క్ర‌మ‌ణ రుసుము)

ఎంట్రీ లోడ్ అండ్ ఎగ్జిట్ లోడ్( ప్ర‌వేశ రుసుము, నిష్క్ర‌మ‌ణ రుసుము)

ఇంత‌కు ముందు మ్యూచువ‌ల్ ఫండ్లో పెట్టుబ‌డులు పెట్టాలంటే ప్రవేశ రుసుము ఉండేది. ప్ర‌స్తుతం సెబీ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఎటువంటి రుసుములు లేవు. లావాదేవీల రుసుములు మాత్రం ఉంటాయి.

మ‌నం పెట్టుబ‌డి పెట్టే ప‌థ‌కాన్ని బ‌ట్టి ఎగ్జిట్‌లోడ్ ఉంటుంది. నిర్దేశించిన తేదీ కంటే ముందే మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కం నుంచి నిష్క్ర‌మించినా, లేదా కొంచెం డ‌బ్బును వెన‌క్కు తీసినా ఎగ్జిట్ లోడ్ రూపంలో రుసుములు వ‌సూలు చేస్తారు.

రుసుములు

రుసుములు

మొద‌టిసారి పెట్టుబ‌డి పెట్టేవారికి సిప్ స‌బ్‌స్క్రైబ్ చేసుకునే వారికి పెట్టుబ‌డి విలువ రూ. 10 వేలు దాటితే రూ. 150 రుసుము ఉంటుంది. ఇది వ‌ర‌కూ పెట్టుబ‌డులు క‌లిగి ఉన్న‌వారికి రూ. 100 లావాదేవీ రుసుము ఉంటుంది. మ్యూచువ‌ల్ ఫండ్ అకౌంట్ స్టేట్‌మెంట్‌లో స‌బ్‌స్ర్ర్కిప్ష‌న్ అమౌంట్‌, లావాదేవీ రుసుము, నికర పెట్టుబ‌డి వివ‌రాలు ఉంటాయి. ఇంకా సెక్యూరిటీ లావాదేవీ ప‌న్ను, సేవా ప‌న్ను వంటివి సైతం ప‌రోక్షంగా పెట్టుబ‌డిదారు నుంచే వ‌సూలు చేస్తారు.

డివిడెండ్ ఆప్ష‌న్‌:

డివిడెండ్ ఆప్ష‌న్‌:

ఫండ్ కంపెనీ డివిడెండును డిక్లేర్ చేసిన‌ప్పుడు మీరు దీన్ని అందుకోవ‌చ్చు. ఫండ్ ఫేస్ వాల్యూను బ‌ట్టి డివిడెండ్ చెల్లింపు జరుగుతుంది. ఫండ్ ఎన్ఏవీ రూ. 30 ఉన్న సంస్థ 30% డివిడెండును ప్ర‌క‌టిస్తే మీకు రూ. 3 అందుతుంది. డివిడెండు చెల్లింపు త‌ర్వాత ఎన్ఏవీ విలువ త‌గ్గుతుంది. క్ర‌మ‌మైన ఆదాయం కావాల‌నుకునే వారు ఈ ఆప్ష‌న్ ఎంచుకోవ‌చ్చు.

గ్రోత్ ఆప్ష‌న్‌:

గ్రోత్ ఆప్ష‌న్‌:

డివిడెండు అనేది మీకు వ‌చ్చే అద‌న‌పు ఆదాయంలా క‌నిపించినా అలా ఏమీ జ‌ర‌గ‌దు. మీ పెట్టుబ‌డి రాబ‌డిలోంచే కొంత భాగాన్ని మీకు చెల్లిస్తారు. గ్రోత్ ఆప్ష‌న్ ఎంచుకుంటే మీకు వ‌చ్చే డివిడెండును సైతం పెట్టుబ‌డిలో క‌లిపి ఎన్ఏవీ లెక్కిస్తారు. ఎక్కువ ఆదాయం దీర్ఘ‌కాలంలో మంచిద‌నుకునే వారు ఈ ఆప్ష‌న్‌ను ఎంచుకోవ‌డం మంచిది. యుక్త వ‌య‌సులో ఉన్న‌వారు పెట్టుబ‌డులు పెట్టేటప్పుడు గ్రోత్ ఆప్ష‌న్ సూచ‌నీయం.

సిప్‌:

సిప్‌:

బ్యాంకు రిక‌రింగ్ డిపాజిట్‌లో క్ర‌మంగా ఇన్వెస్ట్ చేసిన‌ట్టే సిప్‌లో సైతం కొంచెం కొంచెం డ‌బ్బు పెట్టుబ‌డి పెడ‌తాం. మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కంలో రెగ్యుల‌ర్ ఇంట‌ర్వెల్స్‌లో ఒక నిర్ణీత సొమ్మును జ‌మ చేస్తూ ఉంటారు. ఇది రోజువారీ, వారం వారీ, నెల‌వారీ, త్రైమాసికానికి ఒక‌సారి ఎలాగైనా మీ అనుకూల‌త‌ను బ‌ట్టి ఎంచుకోవ‌చ్చు. మీ బ్యాంకు ఖాతా నుంచి ఆయా తేదీల్లో డ‌బ్బు ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతుంది.

సిస్ట‌మ్యాటిక్ ట్రాన్స్‌ఫ‌ర్ ప్లాన్‌(ఎస్టీపీ)

సిస్ట‌మ్యాటిక్ ట్రాన్స్‌ఫ‌ర్ ప్లాన్‌(ఎస్టీపీ)

మీరు క్ర‌మంగా ఒక డెట్ ఫండ్‌లో పెట్టుబ‌డులు పెడుతున్నారు. అందులో నుంచి వేరే ఫండ్‌లోకి పెట్టుబ‌డులు మార్చాల‌నుకుంటున్నారు. అప్పుడు మీకు ఎస్టీపీ ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌తి నెలా ఒక తేదీలో కొంత సొమ్మును ఒక ఫండ్ నుంచి మ‌రో ఫండ్‌లోకి మార్చుకునే ఏర్పాటు ఎస్టీపీ. ఎక్కువ డ‌బ్బును ఒకేసారి పెట్టుబ‌డి పెట్టాల‌నుకున్న‌ప్పుడు మొద‌ట ఒక డెట్ ఫండ్లో మొత్తాన్ని ఉంచి, అందులోంచి ఎస్టీపీ ద్వారా కావాల‌నుకున్న ఫండ్లోకి డ‌బ్బును బ‌ద‌లాయించుకోవ‌చ్చు.

Read more about: mf mutual funds
English summary

మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో త‌రుచూ వాడే ప‌దాలు | Mutual fund terms for first time investors

As you probably know, a mutual fund is an investment that pools together money from a number of investors. It then uses professionals to manage and invest this money with the aim of achieving a return.
Story first published: Thursday, September 29, 2016, 10:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X