For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంచి పెట్టుబ‌డి నిధిని స‌మ‌కూర్చుకునేందుకు ఉప‌క‌రించే సిప్‌లు

అందుకే 3 నుంచి 5 ఏళ్ల కాలానికి మంచి రాబ‌డుల‌నిచ్చే ఉత్త‌మ మ్యూచువ‌ల్ ఫండ్ల జాబితాను మేము మీ కోసం సేక‌రించాం.ఈ జాబితా ఎప్ప‌టిక‌ప్పుడు మారుతూ ఉండే అవ‌కాశాన్ని పూర్తిగా కొట్టిపారేయ‌లేం.అంతిమ నిర్ణ‌యంమీదే

|

ఏ మ్యూచువ‌ల్ ఫండ్ సిప్ మంచిది అనేది నిర్ణ‌యించ‌డం ఎప్పుడైనా క‌ష్ట‌మే. ఈ రోజు ఒక సిప్ బాగా ప‌ర్‌ఫార్మ్ చేస్తుంటే కొన్ని రోజుల త‌ర్వాత అది బాగా చేయ‌క‌పోవ‌చ్చు. ప్ర‌తి ఏడాది ఆ సిప్ అలానే ఉంటుంద‌నని క‌చ్చితంగా చెప్ప‌లేం.

అందుకే 3 నుంచి 5 ఏళ్ల కాలానికి మంచి రాబ‌డుల‌నిచ్చే ఉత్త‌మ మ్యూచువ‌ల్ ఫండ్ల జాబితాను మేము మీ కోసం సేక‌రించాం. ఈ జాబితా ఎప్ప‌టిక‌ప్పుడు మారుతూ ఉండే అవ‌కాశాన్ని పూర్తిగా కొట్టిపారేయ‌లేం. అంతిమ నిర్ణ‌యం పెట్టుబ‌డిదారుల‌దే.

1. ఎస్‌బీఐ బ్లూచిప్ ఫండ్‌

1. ఎస్‌బీఐ బ్లూచిప్ ఫండ్‌

లార్జ్‌క్యాప్ ఫండ్ల‌లో రాబ‌డుల ప‌రంగా చూస్తే ఎస్‌బీఐ బ్లూచిప్ దేశంలోనే అత్యుత్త‌మంగా క‌నిపిస్తోంది. వాల్యూ రీసెర్చ్ దీనికి 5 స్టార్ రేటింగ్ ఇవ్వ‌గా, క్రిసిల్ సూచించిన లార్జ్ క్యాప్ ఫండ్ల‌లో ఇదే నంబ‌ర్ వ‌న్‌.

గ‌త 3 ఏళ్ల‌లో ఈ ఫండ్ 26% రాబ‌డినిచ్చింది. 5 ఏళ్ల‌లో 18 శాతం రాబ‌డినిచ్చింది.

దీనిలో సిప్ రూ. 1000 నుంచి ప్రారంభించ‌వ‌చ్చు.

2. బిర్లా స‌న్ లైఫ్ టాప్ 100

2. బిర్లా స‌న్ లైఫ్ టాప్ 100

ఎస్‌బీఐ బ్లూచిప్ లాగే ఇది కూడా బాగానే ప‌నితీరును క‌న‌బ‌రుస్తోంది. దీని హోల్డింగ్‌లు బ్లూచిప్ కంపెనీలైన ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీల్లో ఉన్నాయి. అయితే ఎస్‌బీఐ బ్లూచిప్‌లాగే ఈ ఫండ్ కూడా రాబ‌డుల‌నిస్తుంద‌ని క‌చ్చితంగా చెప్ప‌లేం.

గ‌త 3 ఏళ్ల‌లో ఈ ఫండ్ 24.85% రాబ‌డినిచ్చింది. 5 ఏళ్ల‌లో 16% శాతం రాబ‌డినిచ్చింది. రూ. 1000 మొత్తం నుంచి సిప్‌ను ప్రారంభించ‌వ‌చ్చు. గ్రోత్ ప్లాన్‌లో ఈ ఫండ్ యొక్క నెట్ అసెట్ వాల్యూ(ఎన్ఏవీ) 47.03.

3. క్వాంట‌మ్ లాంగ్‌ట‌ర్మ్ ఈక్విటీ ఫండ్‌

3. క్వాంట‌మ్ లాంగ్‌ట‌ర్మ్ ఈక్విటీ ఫండ్‌

హ‌చ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి వాటిని టాప్ హోల్డింగ్స్‌లో క‌లిగి లేకుండా ఉన్న కొద్దిపాటి లార్జ్‌క్యాప్ ఫండ్ల‌లో క్వాంట‌మ్ లాంగ్‌ట‌ర్మ్ ఈక్విటీ ఫండ్ ఒక‌టి. టాప్ హోల్డింగ్స్‌ల్లో బ‌జాజ్ ఆటో ఉంది. అయితే క్వాంట‌మ్ లాంగ్‌ట‌ర్మ్ టాప్ హోల్డింగ్ బ‌జాజ్ ఆటో.

గ‌త 3 ఏళ్ల‌లో ఈ ఫండ్ 23.31% రాబ‌డినిచ్చింది. 5 ఏళ్ల‌లో 15.25% రాబ‌డినిచ్చింది.

గ్రోత్ ప్లాన్‌లో నెట్ అసెట్ వాల్యూ రూ. 45.07. మిగిలిన మ్యూచువ‌ల్ ఫండ్ స్కీముల‌తో పోల్చి చూస్తే ఎగ్జిట్ లోడ్ ఎక్కువ‌.

4. ఎస్‌బీఐ మ్యాగ్న‌మ్ ఈక్విటీ ఫండ్‌

4. ఎస్‌బీఐ మ్యాగ్న‌మ్ ఈక్విటీ ఫండ్‌

ఎస్‌బీఐ ప్ర‌వేశ‌పెట్టిన ఫండ్ల‌లో మ‌రో బ‌ల‌మైన ఫండ్ ఇది. బాగా ప‌నితీరును క‌న‌బ‌రుస్తోంది.

3 ఏళ్ల‌లో 21.42%, 5 ఏళ్ల‌లో 14 శాతం రాబ‌డినిచ్చింది. ఈ ఫండ్ నెట్ అసెట్ వాల్యూ 82.78.

ఈ ఫండ్ దీర్ఘ‌కాలంలో మంచి రాబడుల‌నిస్తుంది. బ్యాంకు డిపాజిట్ల లాంటి పెట్టుబ‌డి సాధ‌నాల‌తో పోలిస్తే ప‌న్ను మిన‌హాయింపుల దృష్ట్యా మ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్స్ చాలా ఉత్త‌మ‌మైన‌వి.

5. రిల‌య‌న్స్ టాప్ 200 రిటైల్ ప్లాన్‌

5. రిల‌య‌న్స్ టాప్ 200 రిటైల్ ప్లాన్‌

గ‌త 3-5 ఏళ్ల‌లో మంచి రాబ‌డులిచ్చిన మరో ఫండ్ రిల‌య‌న్స్ టాప్ 200 రిటైల్ ప్లాన్‌.

3 ఏళ్ల‌లో 24.25%, 5 ఏళ్లలో 15 శాతం రిట‌ర్నుల‌ను ఈ ఫండ్ రాబ‌ట్ట‌గ‌లిగింది.

నెట్ అసెట్ వాల్యూ 25.23. సిప్‌ను క‌నీస పెట్టుబ‌డి 100 మొత్తాల్లో చేయ‌వ‌చ్చు.

లార్జ్‌క్యాప్ ఫండ్ల‌లో దీనికి క్రిసిల్ ర్యాంకు 3గా ఉంది.

6. ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ ఫోక‌స్‌డ్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్‌

6. ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ ఫోక‌స్‌డ్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్‌

3 ఏళ్ల‌లో 21%, 5 ఏళ్ల కాలంలో 14% రాబ‌డులనిచ్చిన ఈ ఫండ్ సైతం బాగానే ఉంది. క‌నీసం రూ. 500 తో సిప్‌ను ప్రారంభించ‌వ‌చ్చు. గ్రోత్ ప్లాన్‌లో నెట్ అసెట్ వాల్యూ రూ.31.66.

7. కొట‌క్ క్లాసిక్ ఈక్విటీ రెగ్యుల‌ర్ ప్లాన్

7. కొట‌క్ క్లాసిక్ ఈక్విటీ రెగ్యుల‌ర్ ప్లాన్

ఈ ప్లాన్‌లో గ‌త మూడేళ్ల కాలంలో 19.25% రాబ‌డులు వ‌చ్చాయి. దీని పోర్ట్‌ఫోలియోను గ‌మ‌నిస్తే భ‌విష్య‌త్తులో రాబడులు వ‌చ్చేలా క‌నిపిస్తోంది.

గ్రోత్ ప్లాన్‌లో ఈ ఫండ్ నెట్ అసెట్ వాల్యూ 37.41. రూ. 1000 నుంచి మొద‌లుకొని పెట్టుబ‌డుల‌ను ప్రారంభించ‌వ‌చ్చు.

8. డిస్‌క్లెయిమ‌ర్‌

8. డిస్‌క్లెయిమ‌ర్‌

ఈ క‌థ‌నం కేవ‌లం స‌మాచారం కోసం మాత్ర‌మే. ఫండ్ కొనేందుకు లేదా అమ్మేందుకు స‌లహా ఇచ్చేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భ‌రోసా ఇవ్వ‌లేం. దీని ఆధారంగా మీరు నిర్ణ‌యం తీసుకొని న‌ష్ట‌పోతే గ్రేనియం ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీస్ ప్రైవేట్ లిమిటెడ్‌, దాని అనుబంధ సంస్థ‌లు, ఈ క‌థ‌నం రాసిన‌వారు ఎవ‌రు బాధ్య‌త వ‌హించ‌రు. అన్ని విచారించి నిర్ణ‌యం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.

Read more about: sip mutual fund investment
English summary

మంచి పెట్టుబ‌డి నిధిని స‌మ‌కూర్చుకునేందుకు ఉప‌క‌రించే సిప్‌లు | best sips to build a solid corpus for a investor

It is always difficult to highlight which is the best SIP that an investor should bet on. If today one SIP has yielded good results, tomorrow it could be down. No SIP has been the best performer year after year.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X