For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొద‌టి సారి ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు స‌మ‌ర్పిస్తున్నారా? అయితే ఈ విష‌యాలు తెలుసుకుని చేయండి

|


జీవితంలో సంపాద‌న పెరిగే కొద్దీ ప‌న్ను సందేహాలు అంద‌రికీ ఉంటాయి. అయితే మొద‌టిసారి సంపాద‌న మొద‌లెట్టిన త‌ర్వాత ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు స‌మ‌ర్పించాలంటే మ‌దిలో ఎన్నో సందేహాలు ఉంటాయి. ఎన్నో ర‌కాల ప్ర‌శ్న‌ల‌కు ఇక్క‌డ స‌మాధానాలు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం.
రిట‌ర్నులు స‌మ‌ర్పించేముందు తెలుసుకోవాల్సిన కనీస విష‌యాల‌ను ఇక్క‌డ చూద్దాం.
ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు స‌మ‌ర్పించేందుకు కావాల్సిన ప‌త్రాలు
ఒక్కో వ్య‌క్తిని బ‌ట్టి, వారి వృత్తి , ఆదాయ మార్గాల ఆధారంగా స‌మ‌ర్పించాల్సిన ప‌త్రాలు మారుతూ ఉంటాయి.
సాధార‌ణంగా వ్య‌క్తులు స‌మ‌ర్పించాల్సిన ప‌త్రాలు:

  • పాన్ సంఖ్య‌
  • సంస్థ జారీ చేసే ఫారం-16
  • బ్యాంక్ స్టేట్‌మెంట్లు / వ‌డ్డీకి సంబంధించి పాస్‌బుక్‌
  • బ్యాంక్ డిపాజిట్ల‌పై వ‌చ్చే ఆదాయం
  • బ్యాంక్ డిపాజిట్ల ద్వారా కాకుండా ఇత‌ర వ‌డ్డీల ద్వారా వ‌చ్చే ఆదాయం
  • టీడీఎస్ స‌ర్టిఫికెట్‌
  • ఫారం 26ఏఎస్- టీడీఎస్‌కు సంబంధించి క్రెడిట్ అయిన సొమ్మును ఆదాయ‌పు ప‌న్ను శాఖ తెలియ‌జేస్తుంది.
first time tax payers

ఎవ‌రు ప‌న్ను చెల్లించాలి?
ఏప్రిల్ 1, 2015 నుంచి మార్చి 31,2016 మ‌ధ్య ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 2,50,000 మించి ఆదాయం ఉన్న‌వారు ఆదాయ‌పు ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఈ-ఫైలింగ్ ఎవ‌రికి త‌ప్ప‌నిస‌రి?
. రీఫండ్‌ను కోరుకునే వ్య‌క్తులు
. మొత్తం ఆదాయం రూ. 5 ల‌క్ష‌ల‌కు మించిన వారు
. ఐటీఆర్‌-3, 4, 5, 6, 7ల‌ను క‌చ్చితంగా ఈ-ఫైలింగ్ చేయాలి.

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు ఫైల్ చేయ‌క‌పోతే ఉండే పెనాల్టీలు?
తుది గ‌డువులోగా రిట‌ర్నుల‌ను ఫైల్ చేయ‌క‌పోతే ప‌న్ను లెక్కింపు అధికారి(అసెసింగ్ ఆఫీస‌ర్‌) రూ. 5 వేల పెనాల్టీ విధిస్తారు.

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌ను ఆల‌స్యంగా స‌మ‌ర్పిస్తే ఏమ‌వుతుంది?
వ్య‌క్తులు ఎవ‌రైనా ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌ను జులై 31లోపు స‌మ‌ర్పించాలి. ట్యాక్స్ రిట‌ర్నులో స‌వ‌ర‌ణ‌లు చేయాలంటే త‌ర్వాత కుద‌ర‌దు.

బ‌కాయి ఉన్న ఆదాయ‌పు ప‌న్నును ఎలా చెల్లించాలి?

ఏ ఆదాయ‌పు ప‌న్ను బ‌కాయినైనా ప‌న్ను చెల్లింపు చ‌లాను 280ని ఉప‌యోగించి చెల్లించ‌వ‌చ్చు.
వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకుని గ‌డుల‌ను పూరించి ఆఫ్‌లైన్‌లో సైతం చెల్లించ‌వ‌చ్చు. స‌ద‌రు ఫారంను సంబంధిత ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు పంపాలి. డ‌బ్బును న‌గ‌దు లేదా చెక్కు రూపంలో చెల్లించే వీలుంది.
క్రితం ఏడాది ప‌న్ను రిట‌ర్నుల‌ను స‌మర్పించ‌ని వ్య‌క్తులు మార్చి 31లోగా స‌మ‌ర్పించ‌వ‌చ్చు.

ఫారం 26ఏఎస్‌ను ఎందుకు సరిచూసుకోవాలి?
ఆదాయ‌పు ప‌న్ను చెల్లించే వ్య‌క్తులు ఫారం 26ఏఎస్‌ను త‌ప్ప‌నిస‌రిగా చూసుకోవాలి.
దీని ద్వారా వ‌డ్డీ చెల్లింపు, వేత‌న చెల్లింపు, టీడీఎస్ వివ‌రాల‌ను క‌చ్చిత‌త్వంతో తెలుసుకోవ‌చ్చు.

English summary

మొద‌టి సారి ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు స‌మ‌ర్పిస్తున్నారా? అయితే ఈ విష‌యాలు తెలుసుకుని చేయండి | First time tax payers should know about these things

If you have recently joined the work force, you may need to pay Salaries Tax on your employment income. This article help you in answering some of the questions you may have concerning income Tax
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X