For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెమిటెన్సుల్లో భారత్ టాప్: వరల్డ్ బ్యాంక్ వెల్లడి

By Nageswara Rao
|

రెమిటెన్స్‌ల (విదేశాల నుంచి వచ్చే నగదు) రాకలో భారత్ తన అగ్రస్థానాన్ని నిలిచింది. గతేడాది రెమిటెన్స్‌ల రూపంలో భారత్‌లోకి వచ్చిన విదేశీ మారకం నిధుల విలువ 6,900 కోట్ల డాలర్లుగా (ప్రస్తుత మారకం రేటు ప్రకారం మన కరెన్సీలో రూ.4.55 లక్షల కోట్లకుపైమాటే) నమోదైంది.

2009 తర్వాత విదేశాల నుంచి భారత్‌కు ప్రవాసుల పంపే నగదు(రెమిటెన్స్) తగ్గడం ఇదే తొలిసారి అని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఇప్పటికీ మనమే టాప్ ప్లేస్‌లో ఉన్నప్పటికీ 2014 సంవత్సరంతో పోలిస్తే రెమిటెన్స్‌ల రాక 100 కోట్ల డాలర్ల మేర(2.1 శాతం) తగ్గింది.

అయినా కూడా 2015లో మొత్తం 69 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) ప్రవాస నగదును భారత్‌ ఆకర్షించి అగ్రస్థానంలో నిలిచిందని ప్రపంచ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక వెల్లడించింది. ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లిన, బయటి దేశాల్లో స్థిరపడిన భారతీయులు స్వదేశంలోని సంబంధీకులకు రెమిటెన్స్‌ల రూపంలో డబ్బులు పంపిస్తుంటారు.

అమెరికా, బ్రిటన్, కెనడా, గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు పెద్ద ఎత్తున రెమిటెన్స్ నిధులు వస్తుంటాయి. ప్రపంచబ్యాంకు నివేదిక ప్రకారం.. 6,400 కోట్ల డాలర్ల రెమిటెన్స్‌లతో చైనా రెండో స్థానంలో నిలిచింది. ఫిలిప్పీన్స్(2,800 కోట్ల డాలర్లు), మెక్సికో (2,500 కోట్ల డాలర్లు), నైజీరియా(2,100 కోట్ల డాలర్లు) ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.

గత సంవత్సరం వర్ధమాన దేశాల్లోకి రెమిటెన్స్‌ల రూపంలో ప్రవహించిన నిధుల విలువ 43,160 కోట్ల డాలర్లుగా నమోదైంది. 2014లో నమోదైన 43 వేల కోట్ల డాలర్లతో పోలిస్తే 0.4 శాతం వృద్ధి చెందింది. 2008-09లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థికమాంద్యం తర్వాత రెమిటెన్స్‌ల రాక వృద్ధి ఇంత తక్కువగా నమోదుకావడం ఇదే మొదటిసారని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది.

 India tops the largest remittance receiver list in 2015, says World Bank

2015లో అభివృద్ధి చెందిన దేశాలకు వచ్చిన నగదు అధికారికంగా 431.6 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. 2014తో పోలిస్తే ఇది 0.4 శాతం ఎక్కువ. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత వృద్ధిలో వేగం తగ్గడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ రెమిటెన్సెస్‌ విషయానికొస్తే.. అవి 1.7 శాతం తగ్గి 581.6 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది.

చాలావరకు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లక్షలాది కుటుంబాలకు రెమిటెన్స్‌లే ప్రధానమైన, నిలకడైన ఆదాయ వనరు అని వరల్డ్ బ్యాంక్‌కు చెందిన గ్లోబల్ ఇండికేటర్స్ గ్రూపు డైరెక్టర్ అగస్టో లోపెజ్ కార్లోస్ అన్నారు. వరల్డ్ బ్యాంక్ రిపోర్టు ప్రకారం.. పాకిస్థాన్‌లోకి ప్రవహించిన రెమిటెన్స్‌ల వృద్ధి 2014లో నమోదైన 16.7 శాతం ఉంచి గత ఏడాదిలో 12.8 శాతానికి తగ్గింది.

బంగ్లాదేశ్‌లో ప్రవాసుల నుంచి వచ్చే డబ్బు 2014లో 8 శాతం పెరగ్గా.. 2015లో 2.5 శాతానికి పరిమితమైంది. నేపాల్‌లో మాత్రం ఈ పరిస్థితి భిన్నంగా ఉంది. భూకంపం నేపథ్యంలో 2014తో పోలిస్తే ప్రవాసుల నుంచి వచ్చే డబ్బు 3.2 శాతం నుంచి 20.9 శాతానికి పెరిగింది. అలాగే తిరిగి స్వదేశానికి వచ్చిన వారి సంఖ్య కూడా నేపాల్‌లో అయిదింతలు కావడం గమనార్హం.

English summary

రెమిటెన్సుల్లో భారత్ టాప్: వరల్డ్ బ్యాంక్ వెల్లడి | India tops the largest remittance receiver list in 2015, says World Bank

India was the world's largest remittance recipient in 2015 despite experiencing a $1 billion drop from the previous year, the first decline in its remittances since 2009, the World Bank said on Wednesday.
Story first published: Friday, April 15, 2016, 16:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X