For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అవును: పెట్టుబడి సాధనంగా జీవిత బీమా

By Nageswara Rao
|

జీవిత బీమా... ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తక్కువగా ఉండటంతో పాటు ఇతర ప్రయోజనాలు చాలా ఉంటాయి. మగవారితో పోలిస్తే, ఆడవారికి వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.

ఈ క్రమంలో జీవిత బీమా పాలసీ కూడా ఓ పెట్టుబడి సాధనమేనని అంటున్నారు. ముఖ్యంగా మహిళలు జీవిత బీమాను తప్పనిసరిగా తీసుకోవాలి. సాధారణంగా ఊహించని ప్రమాదం జరిగి కుటుంబ పెద్ద మరణించడం లేదా వికలాంగులుగా మారడం వంటివి జరిగితే, కుటుంబ ఆర్ధికంగా నిలదొక్కకునేందుకు పాలసీ తీసుకుంటారు.

Invest in life insurance is also good plan

చాలా మంది ఆ బాధ్యత తన భర్తదిగా భావిస్తుంటారు. అంతేకాదు తమకెందుకులే జీవిత బీమా అనుకుంటారు. ఒకవేళ ఎవరైనా పనిచేసే మహిళలు ఉంటే... వారు తన తల్లిదండ్రుల కోసం, తనపై ఆధారపడ్డ ఇతర కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం పాలసీ తీసుకోవాలి.

ఒకవేళ పనిచేసే మహిళకు పిల్లలుంటే... వారి చదువుని దృష్టిలో ఉంచుకొని పాలసీ తీసుకోవాలి. మన జీవితంలో ఎన్నో అంశాలు మహిళలను జీవిత బీమా పాలసీ తీసుకోవడంలో కీలకపాత్ర వహిస్తాయి. ప్రస్తుతం మహిళలు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తున్నారు.

ఈ క్రమంలో మహిళలు జీవిత బీమా వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు దానిని కూడా పెట్టుబడి మార్గాల్లో ఒకటిగా చూడాలని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. నిజానికి జీవిత బీమా అనేది జీవిత కాలం మొత్తంలో వ్యక్తిగతంగా ఎలాంటి ప్రయోజనం చేకూరదనే ఆలోచనతోనే జీవిత బీమా తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదంటున్నారు.

English summary

అవును: పెట్టుబడి సాధనంగా జీవిత బీమా | Invest in life insurance is also good plan

Invest in life insurance is also good plan.
Story first published: Monday, March 28, 2016, 15:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X