English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

పన్ను ఆదా: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ నుంచి "Click2Invest-ULIPs"

Posted by:
Published: Monday, February 8, 2016, 14:29 [IST]
 

మార్చి నెల వచ్చిదంటే చాలు... ప్రతి ఒక్కరూ ఇన్‌కమ్ ట్యాక్స్ గురించి గాబరా పడిపోతుంటారు. కొంత మంది ఈపాటికే పన్ను మినహాయింపు నిమిత్తం చేయాల్సిన పెట్టుబడులు పూర్తి చేసి ఉంటారు. మరికొందరు ఇంకా పూర్తి చేసి ఉండకపోవచ్చు. అలాంటి వారు తొందర పడాల్సిన సమయమిది.

ఇప్పటికైనా మేల్కొని వివిధ మార్గాల్లో పెట్టుబడి చేయడం వల్ల అటు పన్ను ప్రయోజనం పొందడంతో పాటు ఇటు తమ సొమ్ముకు విలువ కూడా జోడించుకోగలుగుతారు. పన్ను మినహాయింపు పొందేందుకు పొదుపు చేసే వారిలో చాలా మందికి పెట్టుబడులపై పూర్తి అవగాహన లేకుండా పెట్టుబడి చేస్తూ ఉంటారు.

Why HDFC Life

యులిప్‌ వల్ల కలిగే ప్రయోజనాలు?

1. సెక్షన్‌ 80సి

చాలా మంది పెట్టుబడులు, పన్ను ఆదా రెండూ వేర్వేరు అంశాలుగానే చూస్తారు. రెండింటిని కలగలిపి మంచి రాబడులు పొందవచ్చనే విషయం తెలియదు. దీంతో ఐటి చట్టంలోని సెక్షన్‌ 80సి కింద లభించే 1.5 లక్షల రూపాయల మొత్తాన్ని గుడ్డిగా ఏదో ఒక పథకంలో పెట్టుబడి పెట్టి పని అయిపోయిందనుకుంటారు.

అలాకాకుండా కింది పథకాల్లో మదుపు చేస్తే పన్ను మినహాయింపుతో పాటు సంపద పెరిగేలా మంచి రాబడులూ పొందవచ్చు. ఉదారహణకు పన్ను మినహాయింపు కోసం చూస్తున్న పెట్టుబడిదారుల కోసం పలు బీమా కంపనీలు అందించే యూనిట్‌ ఆధారిత బీమా పథకాలు (యులిప్స్‌) కూడా పరిశీలిస్తే మంచిది.

యులిప్‌లు మ్యూచువల్ ఫండ్ సంస్ధలు అందించే యూనిట్లు లాంటివే. కాకపోతే వీటికి బీమా కవరేజ్ ఉంటుంది. సాధారణ ప్రీమియంతో పోలిస్తే యులిప్స్‌లో 10 రెట్లు రెట్టింపు లభిస్తుంది. ఉదాహరణకు ఈ ప్లాన్ కింద రూ. 50,000 పెట్టుబడి పెట్టి, ఒకవేళ ఏదైనా జరిగి దరఖాస్తుదారుడు మరణిస్తే, రూ. 5,00,000 వరకు లభిస్తుంది.

2. పన్ను ఆదా

యులిప్స్ వల్ల కలిగే రెండో ప్రయోజనం ఏంటంటే పన్ను ఆదా. పీపీఎఫ్‌తో పోలిస్తే, యులిప్స్ వచ్చే వడ్డీకి పన్ను ఆదా లభిస్తుంది. బ్యాంకు సేవింగ్స్ ఖాతా, నేషనల్ సేవింగ్స్ స్కీం లాంటి వాటిపై పన్ను ఆదా ఉండదు.

3. యులిప్స్‌లో రిటర్న్ అధికం

యులిప్స్‌లో ఫిక్సిడ్‌గా రిటర్న్‌లు ఉండవు. సంప్రదాయ పథకాలతో భావిస్తే, యులిప్స్‌లో అత్యధిక రిటర్న్‌లు వస్తాయి. మీరు తీసుకున్న పెట్టుబడి నిర్ణయాన్ని బట్టి రిటర్న్‌లు ఉంటాయి. ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెడితే, పెద్ద మొత్తంలో యులిప్స్‌పై రిటర్న్‌లు వస్తాయి. అదే స్టాక్ మార్కెట్స్‌లో పెట్టిన పెట్టుబడులకు మార్కెట్స్ ఆధారంగా లాభ, నష్టాలు ఉంటాయి.

4. లిక్విడిటీ

పీపీఎఫ్‌లతో పోల్చి చూస్తే యూనిట్‌ ఆధారిత బీమా పథకాలు (యులిప్స్‌) చాలా ప్రయోజనాలున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్‌ను మీరు విత్ డ్రా చేసుకోవాలంటే 7 సంవత్సరాల సమయం కావాలి, అదే యులిప్స్‌ను 5 సంవత్సరాల కాలపరిమితికే విత్ డ్రా చేసుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది.

ముగింపు:

గతంలో బీమా కవరేజి, రాబడులు అంతంత మాత్రంగా ఉండేవి. అయితే 2010 తర్వాత ఐఆర్‌డిఎ యులిప్స్‌లో చాలా మార్పులు తెచ్చింది. ఇపుడు మార్కెట్‌కు వస్తున్న యులిప్స్‌పై 10 ఏళ్ల వరకు బీమా కంపెనీలు మూడు శాతానికి మించి ఖర్చులు వసూలు చేసేందుకు వీల్లేదు.

పదేళ్లు దాటితే ఖర్చులు మరింత తగ్గుతాయి. అపుడు ఈ ఖర్చులు 2.25 శాతానికి మించవు. కాకపోతే గతంలో మూడు సంవత్సరాలున్న లాక్‌ ఇన్‌ పీరియడ్‌ను ఐదేళ్లకు పెంచారు. రిస్కు తీసుకునే ధైర్యం ఉంటే ఇన్వెస్టర్లు యులిప్స్‌లో పెట్టే మొత్తం పెట్టుబడులను ఈక్విటీ షేర్ల ఆప్షన్‌ను ఎంచుకోవడం మంచిది.

మొత్తంగా యులిప్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ "Click2Invest-ULIPs" అనే కొత్త యులిప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్కువ రిటర్నులు పొందాలనుకునే వారు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు.

English summary
It's the time of the year, when individuals are deciding on various tax planning instruments. Among the many instruments, that provide you tax benefits is the Unit Linked Insurance Plans (ULIP).
మీ వ్యాఖ్య రాయండి

Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?