For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పన్ను ఆదా ఇలా: సెక్షన్ 80సి, 80డి

By Nageswara Rao
|

ఫిబ్రవరి మొదటి వారం వచ్చేస్తుందంటే చాలు పన్నుల సీజన్ వచ్చినట్లే. ఏ సెక్షన్‌ కింద ఎంతమొత్తం రాయితీ క్లెయిమ్‌ చేయాలి, ఎక్కడ పొదుపు చేస్తే ఏ సెక్షన్‌ వర్తిస్తుంది, ఎటువంటి ఖర్చులకు పన్ను రాయితీలు వర్తిస్తాయి. ఆదాయం పన్ను పరిధిలో ఉన్నవారు దృష్టి సారించే విషయాలివే.

గరిష్ఠ స్థాయిలో పన్ను రాయితీలను క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే పక్కా ప్లానింగ్‌ ఉండాలి. ఇప్పటి వరకు మీరు చేసిన పొదుపు, వ్యయాల్లో సెక్షన్‌ 80సి, 80డి కింద మినహాయింపులు వర్తించేవి ఏమైనా ఉన్నాయా, ఇతరత్రా మినహాయింపులకు అవకాశం ఉన్న వాటిని అన్వేషించి పన్ను బారి నుంచి తప్పించుకోండి.

సెక్షన్‌ 80సి:
సెక్షన్‌ 80సి కింద గరిష్ఠంగా 1.5 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు పరిధిలోకి వస్తుంది. గృహ రుణాలపై తిరిగి చెల్లించే అసలు మొత్తానికి, కొత్త ఇళ్లు కొనుగోలు సందర్భంగా స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద చేసిన ఖర్చులకు, పిల్లల (ఇద్దరు మాత్రమే) స్కూలు, కాలేజీలకు సంబంధించిన ట్యూషన్‌ ఫీజు.. ఇవన్నీ సెక్షన్‌ 80సి కిందకు వస్తాయి.

Use deductions to reduce your tax bill

వీటితో పాటు ఎల్‌ఐసి ప్రీమియం చెల్లింపులు, ఇపిఎఫ్‌ చందాలకు కూడా ఈ సెక్షన్‌ కింద పన్ను పరిమితి నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే ఈ అన్ని మార్గాల్లోనూ గరిష్ఠంగా పన్ను మినహాయింపు వర్తించే మొత్తం మాత్రం 1.5 లక్షల రూపాయలు మాత్రమే.

దీంతో మీరు లెక్కలన్నీ కరెక్ట్‌గా చూసుకుని పెట్టుబడులు, వ్యయాలు 1.5 లక్షల రూపాయల కంటే తక్కువబడితే మిగిలిన మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా సెక్షన్‌ 80సి వర్తించే పథకాల్లో పెట్టుబడి పెట్టాలి.

సెక్షన్ 80డి:
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80డి ప్రకారం వ్యక్తిగతంగా కుటుంబం మొత్తానికి మీపై ఆధారపడిన లేదా ఆధారపడని తల్లిదండ్రుల కోసం తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియానికి పన్ను మినహాయింపు లభిస్తుంది.

2015-16 ఆర్ధిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారుడి వయసు 60 ఏళ్లలోపు ఉంటే రూ. 25వేలు, అదే 60 ఏళ్లకు దాటిన వృద్ధులకు ఈ పరిమితిని రూ. 30వేలు. దీంతో పాటు తల్లిదండ్రులకు తీసుకున్న పాలసీకి కూడా రూ. 25వేలు, తల్లిదండ్రులు వృద్ధులైతే రూ. 30వేల వరకు మినహాయింపు క్లైయిమ్ చేసుకోవచ్చు.

వీటితో పాటు భారత ఆదాయపు పన్ను చట్ట ప్రకారం పన్ను చెల్లింపుదారులకు కొన్ని రకాల ఖర్చులకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అవేమిటంటే:

* సెక్షన్‌ 80జి కింద ఐటి చట్టం ప్రకారం గుర్తింపు పొందిన సంస్థలకు ఇచ్చే విరాళాలకు కూడా పన్ను మినహయింపు ఉంటుంది.
* పన్ను చెల్లింపుదారునకు లేదా ఆయనపై ఆధారపడిన వారికి అంగవైకల్యం ఉంటే, సెక్షన్‌ 80డిడి కింద గరిష్ఠంగా రూ. 75 వేల వరకు పన్ను మినహాయింపు ఉంది.
* విద్యా రుణాలపై చెల్లించే వడ్డీలకు గరిష్ఠ పరిమితి లేకుండా పన్ను రాయితీ వర్తిస్తుంది.
* ఇంటి రుణాలకు సంబంధించి చెల్లించే వడ్డీపై గరిష్ఠంగా 2 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

English summary

పన్ను ఆదా ఇలా: సెక్షన్ 80సి, 80డి | Use deductions to reduce your tax bill

Use deductions to reduce your tax bill.
Story first published: Tuesday, January 19, 2016, 15:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X