For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రై చేయండి: ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా బోనస్?

By Nageswara Rao
|

సాధారణంగా ఉద్యోగులకు 'బోనస్' అనే మాట ఎంతో సంతోషానిస్తుంది. జీవితంలో మనం తీసుకునే ఇన్సూరెన్స్ పాలసీలకు కూడా బోనస్ లభిస్తుంది. చాలా మంది ఈ విషయం తెలియదు. అయితే ఈ బోనస్‌ను ఎలా లెక్కిస్తారు? ఏయే ఇన్సూరెన్స్ పథకాలకు ఈ బోనస్ వర్తిస్తుందో తెసులుకుందాం.

సాధారణంగా మనలో చాలా మంది సంప్రదాయ పథకాలనే ఎంచుకుంటారు. పెట్టుబడి రక్షణ, రాబడి హామీ ఉండాలని కోరుకుంటారు. జీవిత బీమా పాలసీలను కూడా ఇదే పద్దతిలో ఎంచుకుంటారు. బీమా రక్షణతో పాటు, బోనస్ రూపంలో కొంత మొత్తం అదనపు రాబడి కూడా వస్తుందని భావిస్తారు.

ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా బోనస్?

ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా బోనస్?

ప్రతి జీవిత బీమా పాలసీకి బోనస్ ఇవ్వరు. సంప్రదాయ పార్టిసిపేటింగ్ బీమా పాలసీ తీసుకున్న వారికే బోనస్ లభిస్తుంది. సాధారణంగా ఇవి ఎండోమెంట్, హోల్ లైఫ్, మనీ బ్యాక్ పాలసీలకు వర్తిస్తుంది. పాలసీ వ్యవధిని బట్టి, ఎంత బోనస్ వస్తుందనే విషయం ఆధారపడి ఉంటుంది. బీమా పాలసీల్లో రెండు రకాలుంటాయి. ఒకటి పార్టిసిపేటింగ్ బీమా పాలసీ కాగా, రెండోది నాన్ పార్టిసిపేటింగ్ బీమా పాలసీ.

ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా బోనస్?

ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా బోనస్?

బీమా సంస్థ జీవిత బీమా నిధిలో మిగిలిన మొత్తం నుంచి బోనస్‌లను ప్రకటిస్తారు. ఈ మిగులు మొత్తం ఆర్ధిక వ్యవస్థ, ఈక్విటీ మార్కెట్ల పనితీరుని బట్టి ఆధారపడి ఉంటుంది. బీమా సంస్థ మిగులు నిధి ప్రతి ఏడాది పెరుగుతుంటే, అధిక మొత్తంలో బోనస్‌ను ప్రకటిస్తారు.

ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా బోనస్?

ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా బోనస్?

సాధారణంగా బీమా సంస్థలు పాలసీపై ఐదు రకాల బోనస్‌లను అందిస్తున్నాయి. ప్రతి ఏటా ప్రకటించే బోనస్‌ను సింపుల్ రివర్షనరీ బోనస్ అంటారు. దీన్ని ప్రతి ఏడాదీ ప్రకటిస్తారు. పాలసీ వ్యవధి తీరిన తర్వాత లేదా పాలసీని క్లెయిం చేసుకున్నప్పుడు అప్పటి వరకూ ఎంత మొత్తం సమకూరిందో చూసి, పాలసీ మొత్తంతో పాటు దాన్ని కూడా కలిపి చెల్లిస్తారు.

ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా బోనస్?

ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా బోనస్?

ప్రతి ఏటా వచ్చే బోనస్‌ను పాలసీ మొత్తానికి కలపడానికి కాంపౌండ్ రివర్షనరీ బోనస్ అంటారు. మరుసటి ఏడాది ఆ మొత్తంపై బోనస్‌ను లెక్కిస్తారు. ఇలా ఎప్పటికప్పుడు వ్యవధి తీరడం లేదా పాలసీని క్లెయిం చేసుకునే గడువుని పరిగణిస్తారు. పాలసీ మొత్తాన్ని చెల్లించేటప్పుడు ఈ బోనస్‌ను కూడా కలిపి చెల్లిస్తారు.

ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా బోనస్?

ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా బోనస్?

పార్టిసిపేటింగ్ పాలసీ పనితీరును బట్టి చెల్లించేది టెర్మినల్ బోనస్. ఈ బోనస్‌ను ఎప్పుడు చెల్లించాలనేది బీమా కంపెనీ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఈ బోనస్‌ను సాధారణంగా పాలసీ వ్యవధి తీరిన తర్వాత లేదా పాలసీ దారుడు మరణించిన సందర్భంలో చెల్లిస్తారు. పూర్తి వ్యవధి తీరేంత వరకూ పాలసీని కొనసాగించినప్పుడు ఈ బోనస్ ద్వారా మంచి రాబడి వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది.

English summary

ట్రై చేయండి: ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా బోనస్? | Understanding reversionary bonus in Insurance

The Insurance Regulatory and Development Authority (Irda) effected changes in September 2010 that made selling of unit-linked insurance plans (Ulips) less attractive and selling traditional insurance products more attractive for agents.
Story first published: Tuesday, December 1, 2015, 11:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X