For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సేవింగ్స్ ఖాతాతో పాటే ఉచితంగా డీమ్యాట్ అకౌంట్

By Nageswara Rao
|

త్వరలోనే బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ తెరిచిన వారికి దానితో పాటే ఉచితంగా డీమ్యాట్ అకౌంట్ ఇచ్చేవిధంగా కేంద్రం సన్నాహాలు చేస్తున్నాయి. కేవైసీ నిబందనల వల్ల డీమ్యాట్ అకౌంట్ జారీ విధానంలో ఉన్న సంక్లిష్టతను తగ్గించి, సేవింగ్స్ అకౌంట్‌తో పాటే డీమ్యాట్ అకౌంట్‌ను జారీ చేయాలని భావిస్తున్నారు.

ఇటీవలే జరిగిన ఓ సమావేశంలో ఈ విషయాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆర్ధిక శాఖకు చెందిన ఉన్నాతాధికారు ఒకరు తెలిపారు. దేశంలోని ప్రజల సేవింగ్స్‌ను పెద్ద మొత్తంలో ఈక్విటీల్లోకి మళ్లించాలనేది కేంద్రం ఆలోచన.

Soon, you may get a demat account free with your savings account

ఇందులో భాగంగా సేవింగ్స్ అకౌంట్‌తో పాటు డీమ్యాట్ అకౌంట్‌ను ఉచితంగా కస్టమర్లకు జారీ చేస్తే ఈక్విటీల్లో పొదుపు చేసే అవకాశాలు మరింతగా మెరుగుపడతాయన్నారు. డీమ్యాట్ అకౌంట్‌కు కనీస నిల్వ అనే నిబంధన లేదు. ప్రస్తుతం బ్యాంకులు జారీ చేసిన డీమ్యాట్ అకౌంట్లలో 45 శాతం వినియోగంలో లేవు.

అయితే డీమ్యాట్ అకౌంట్‌ను ఉచితంగా జారీ చేసినా దీని ద్వారా లావాదేవీలు జరిపినప్పుడు మాత్రం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. షేరు మార్కెట్, సెక్యూరిటీలు, బాండ్ల క్రయవిక్రయాలు లాంటి లావాదేవీలు జరిపేందుకు డీమ్యాట్ ఖాతా ఉపయోగపడుతుంది.

English summary

సేవింగ్స్ ఖాతాతో పాటే ఉచితంగా డీమ్యాట్ అకౌంట్ | Soon, you may get a demat account free with your savings account

The government is considering whether to allow a proposal that people opening savings bank accounts be automatically given a demat account, required for buying and selling shares, to reduce complications arising from stringent know your customer (KYC) norms.
Story first published: Wednesday, November 25, 2015, 13:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X