For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ధన్‌తేరస్: ఆభరణాలకు తగ్గిన గిరాకీ, మెరిసిన నాణేలు

By Nageswara Rao
|

బంగారం, వెండి కొనుగోళ్లకు శుభప్రదమైన దినంగా భావించే ధనత్రయోదశి (సోమవారం) నాడు బంగారం, వెండి నాణేల కొనుగోళ్లకు ఎక్కువ మంది వినియోగదారులు మొగ్గుచూపారు.
అమ్మకాలు సైతం సంతృప్తికరంగా జరిగాయని విక్రయదార్లు తెలిపారు.

అయితే ఆభరణాల కొనుగోళ్లు మాత్రం మందగించాయని, ఆశోకచక్రతో కూడిన నాణేలు సహా పసిడి, వెండి నాణేల కొనుగోళ్లు దేశవ్యాప్తంగా భారీగా అమ్ముడైనట్లు ఎంఎంటీసీ-పీఏఎంపీ ఇండియా, ఆభరణాల వర్తకులు తెలిపారు.

సౌత్ ఇండియాలో బెంగుళూరు, చెన్నై సహా కోస్తా తీరంలో భారీ వర్షాలు పడుతున్నందున, ఈ ప్రభావం అమ్మకాలపై పడిందని చెబుతున్నారు. గతేడాది ధన త్రయోదశి నాడు జరిగిన విక్రయాల కంటే ఈ ఏడాది 25 శాతం అధికంగా బంగారం, వెండిన నాణేల అమ్మకాలు జరిగాయని ఎంఎంటీసీ-పీఏఎంపీ అధ్యక్షుడు తెలిపారు.

 ధన్‌తేరస్: ఆభరణాలకు తగ్గిన గిరాకీ, మెరిసిన నాణేలు

ధన్‌తేరస్: ఆభరణాలకు తగ్గిన గిరాకీ, మెరిసిన నాణేలు

‘10 గ్రాముల వరకూ పసిడి, వెండి నాణాలకు డిమాండ్ కనబడింది. గత ధన్‌తేరస్‌తో పోల్చి 10 గ్రాముల పసిడి ధర రూ.1,000 తక్కువగా ఉన్నా, ఆభరణాల డిమాండ్ భారీగా కనిపించలేదు' అని బొంబాయి బులియన్ అసోసియేషన్, మాజీ ప్రెసిడెంట్ సురేష్ హూండియా పేర్కొన్నారు.

 ధన్‌తేరస్: ఆభరణాలకు తగ్గిన గిరాకీ, మెరిసిన నాణేలు

ధన్‌తేరస్: ఆభరణాలకు తగ్గిన గిరాకీ, మెరిసిన నాణేలు

పసిడి, వెండి నాణేలకే అధిక డిమాండ్ కనపడిందని జీజేఎఫ్ చైర్మన్ జీవీ శ్రీధర్ చెప్పారు. మొత్తంగా గత ఏడాది తరహాలోనే ఇంచుమించు కొనుగోళ్ల పరిమాణం ఉంది. తక్కువ ధర ఉండడం కొనుగోళ్లకు ఊపునిచ్చిన పరిణామమని ఆయన పేర్కొన్నారు.

 ధన్‌తేరస్: ఆభరణాలకు తగ్గిన గిరాకీ, మెరిసిన నాణేలు

ధన్‌తేరస్: ఆభరణాలకు తగ్గిన గిరాకీ, మెరిసిన నాణేలు

10 గ్రాముల పసిడి ధర రూ.22,000 వరకూ పడిపోతుందన్న ఊహాగానం వల్ల భారీ ఆభరణాలకు పసిడి కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. వెరసి పసిడి ఆభరణాల డిమాండ్ 30 శాతం వరకూ పడిపోతుందని భావిస్తున్నా. ఆభరణాలకు ఉన్న డిమాండ్‌ను నాణాల డిమాండ్ ఈ దఫా దాటిపోయిందని సన్వీ జ్యూవెల్స్ ఎండీ సంతోష్ శ్రీవాస్తవ తెలిపారు.

ధన్‌తేరస్: ఆభరణాలకు తగ్గిన గిరాకీ, మెరిసిన నాణేలు

ధన్‌తేరస్: ఆభరణాలకు తగ్గిన గిరాకీ, మెరిసిన నాణేలు

బంగారు ఆభరణాలకన్నా పసిడి, వెండి నాణేలకు డిమాండ్ బాగా కనిపించిందని ఎంఎంటీసీ-పీఏఎంపీ ఇండియా ప్రెసిడెంట్ (మార్కెటింగ్) విపిన్ రైనా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నెల 5వ తేదీన ఆవిష్కరించిన అశోకచక్ర నాణేలకు కూడా డిమాండ్ భారీగా ఉందన్నారు.

English summary

ధన్‌తేరస్: ఆభరణాలకు తగ్గిన గిరాకీ, మెరిసిన నాణేలు | Boom in market on the eve of Dhanteras

Boom in market on the eve of Dhanteras.
Story first published: Tuesday, November 10, 2015, 12:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X