For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గడువు ముగిసినా ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయలేదా?

By Nageswara Rao
|

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లు దాఖలు చేసేందుకు పొడిగించిన తుది గడువు సెప్టెంబర్ 7వ తేదీతో పూర్తయింది. అయినా సరే మనలో చాలా మంది ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లు దాఖలు చేసి ఉండకపోవచ్చు. దీంతో ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి ఎలాంటి పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందోనని భయపడుతుంటారు.

గడువులోగా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లు దాఖలు చేయనందుకు జరిమానా విధిస్తూ ఏమైనా లేఖలు అందుకోవాల్సి వస్తుందనే భయం చాలా మందిలో ఉంది. అయితే ఇప్పుడు ఈ భయాలు అక్కర్లేదు. ఇలాంటి వారెవరైనా ఉంటే ఎలాంటి జరిమానా లేకుండా వచ్చే ఏడాది మార్చి 31లోగా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లు దాఖలు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.

ఆ తేదీ కూడా దాటిపోతే మాత్రం 2017 మార్చి 31లోగా 5,000 రూపాయల జరిమానాతో రిటర్న్‌ దాఖలు చేసే వెసులుబాటు ఉంది. కాకపోతే ఆలస్యానికి గల కారణాన్ని దానిపై స్పష్టంగా రాయాల్సి ఉంటుంది. అయితే జరిమానా విధించడం అసెస్‌మెంట్‌ అధికారి విచక్షణాధికారానికి లోబడి ఉంటుంది. అన్ని పన్నులు సక్రమంగా చెల్లించి ఉంటే అసెస్‌మెంట్‌ అధికారుల జరిమానా విధించకపోయే అవకాశం కూడా ఉంటుంది.

ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయలేదా?

ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయలేదా?

మొదటి గడువు దాటి రిటర్న్‌లు దాఖలు చేసినప్పటికీ సరైన సమయంలో రిటర్న్‌లు దాఖలు చేసిన వారితో పోల్చితే కొన్ని ప్రాథమిక హక్కులు కోల్పోతారు. ముఖ్యంగా గడువు లోగా రిటర్న్‌ దాఖలు చేసిన వారికి పై ఏడాది మార్చి 31వ తేదీ లోగా లేదా రిటర్న్‌ అసె్‌సమెంట్‌ పూర్తయ్యేలోగా ఎన్నిసార్లైనా దానిలో సవరణలు చేసుకునే అవకాశం ఉంటుంది.

 ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయలేదా?

ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయలేదా?

పన్ను రాయితీలు, మినహాయింపులేవైనా పాత రిటర్న్‌లో క్లెయిమ్‌ చేసుకోలేకపోయి ఉంటే సవరణల్లో అవి క్లెయిమ్‌ చేసుకోవచ్చు. రిటర్న్‌లో పొరపాట్లు ఏవైనా దొర్లినా వాటిని దిద్దుకోవచ్చు. కాని ఆలస్యంగా రిటర్న్‌ దాఖలు చేస్తే ఆ వెసులుబాటు కోల్పోవాల్సి వస్తుంది.

 ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయలేదా?

ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయలేదా?

గడువులోగా రిటర్న్‌ దాఖలు చేసిన వారు పెట్టుబడులపై స్వల్పకాలిక, దీర్ఘకాలిక నష్టాలేవైనా వాటిల్లినా వాటిని భవిష్యత్తులో ఆర్జించే ప్టెబడి లాభాల్లో సర్దుబాటు చేసుకునే వీలుంటుంది. రాబోయే ఎనిమిది ఆర్థిక సంవత్సరాల వరకు ఇలాంటి సర్దుబాటు అవకాశం ఉంది.

ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయలేదా?

ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయలేదా?

ఉదాహరణకి 2014-15లో ఇలాంటి నష్టాలేవైనా ఏర్పడి ఉండే 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసే రిటర్న్‌ వరకు వీటిని సద్దుబాటు చేసుకోవచ్చు. ఆలస్యంగా రిటర్న్‌ దాఖలు చేసిన వారికి ఈ ప్రయోజనం కూడా వర్తించదు.

English summary

గడువు ముగిసినా ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయలేదా? | Worry If Your Tax Refund Is Delayed

The April 15 income tax filing deadline is just around the corner, but many taxpayers decided not to wait until the last minute to file. Those who opted against procrastination and are entitled to a refund may have already received it. But for those anxiously awaiting a check in the mail or a sum deposited directly into their bank account, the wait can be fraught with worry.
Story first published: Monday, October 5, 2015, 11:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X