For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోంలోన్ ముందుగా చెల్లిస్తున్నారా?

By Nageswara Rao
|

రాము మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇంటి కోసం ఓ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు. సాధారణంగా హోం లోన్ అనేది ఒక్క ఏడాదితో తీరిపోయేది కాదు. చాలా సంవత్సరాల పాటు బ్యాంకుకు ఆ రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రతి నెలా బ్యాంకుకు ఈఎంఐ కట్టడం రాముకి కాస్తంత కష్టంగా మారింది.

ఇలాంటి సందర్భంలో అనుకోకుండా రాముకి పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వచ్చింది. వెంటనే బ్యాంకులోని హోం లోన్‌ని ప్రీ-పేమెంట్ చేసి కొంతైనా భారం తగ్గించుకోవాలనుకున్నాడు. ఇలాంటి సందర్భంలో రాము అయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటే మంచిదో చూద్దాం.

హోంలోన్ ముందుగా చెల్లిస్తున్నారా?

హోంలోన్ ముందుగా చెల్లిస్తున్నారా?

అనుకోకుండా పెద్ద మొత్తంలో వచ్చిన డబ్బును గృహ రుణానికి ప్రీ-పేమెంట్‌గా చెల్లించే ముందు గమనించాల్సిందేమిటంటే ఒక్కసారి బ్యాంకులో ఆ మొత్తాన్ని చెల్లించిన తర్వాత తిరిగి మళ్లీ వెనక్కి తీసుకోవడం కుదరదు. ఎప్పుడైనా ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినా, ఆ డబ్బు అందుబాటులో ఉండదని గుర్తుంచుకోవాలి.

 హోంలోన్ ముందుగా చెల్లిస్తున్నారా?

హోంలోన్ ముందుగా చెల్లిస్తున్నారా?

ఇంకో విషయం ఏమిటంటే, రాబడినిచ్చే పెట్టుబడి సాధనాలు ఏమైనా అందుబాటులో ఉంటే, అందులో పెట్టుబడి చేయడం వల్ల వచ్చే రాబడులను, ప్రీ పేమెంట్ వల్ల కలిగే ప్రయోజనాలను బేరీజు వేసుకోవాలి. హోం లోన్ తీర్చేయడం కంటే

ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రాబడి ఎక్కువగా ఉన్న పక్షంలో అటువైపు మొగ్గుచూపడం ఉత్తమం.

హోంలోన్ ముందుగా చెల్లిస్తున్నారా?

హోంలోన్ ముందుగా చెల్లిస్తున్నారా?

దీనివల్ల ఆర్థిక ప్రయోజనంతో పాటు ఇతరత్రా అవసరాలేమైనా తలెత్తినప్పుడు ఉపయోగించుకోవడానికి మన డబ్బు కూడా మనకు అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు ఫిక్స్‌డ్ రేటుపై తీసుకున్న రుణాన్ని ముందస్తుగా చెల్లించేస్తే, ప్రీపేమెంట్ పెనాల్టీ కట్టాల్సి రావొచ్చు. కనుక దీనిని కూడా ఒకసారి ఆలోచించండి.

 హోంలోన్ ముందుగా చెల్లిస్తున్నారా?

హోంలోన్ ముందుగా చెల్లిస్తున్నారా?

ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నాక కూడా రుణాన్ని ప్రీపేమెంట్ చేయదల్చుకున్న పక్షంలో రీషెడ్యూలింగ్‌కి సంబంధించి మీ ముందు రెండు మార్గాలున్నాయి. మొదటిది నెలవారీ ఈఎంఐ మొత్తాన్ని ఇప్పుడు ఎంతైతే కడుతున్నారో దానిని తగ్గించుకోవడం. దీనివల్ల ముందుగా నిర్దేశించుకున్న గడువుకన్నా ముందే మీ హోం లోన్ తీరుతుంది.

హోంలోన్ ముందుగా చెల్లిస్తున్నారా?

హోంలోన్ ముందుగా చెల్లిస్తున్నారా?

రెండోది ప్రతి నెలా కట్టే ఈఎంఐ పరిమాణాన్ని కొంత మేరకు తగ్గించుకోవడం. తద్వారా ముందుగా పెట్టుకున్న గడువు నాటికి రుణం తీరుతుంది. అయితే, కట్టాల్సిన ఈఎంఐ భారం కొంత తగ్గుతుంది. పెరిగే నెలవారీ ఖర్చుల కోసం మరింత డబ్బు అవసరమవుతుంటే రెండో మార్గాన్ని ఎంచుకోండి.

English summary

హోంలోన్ ముందుగా చెల్లిస్తున్నారా? | Should you use your surplus funds to prepay home loan?

Generally when a person takes home loan, he takes into account his current income and accordingly applies for the loan based on the then eligibility. However with income going up, the borrower generally accumulates some surplus.
Story first published: Tuesday, October 13, 2015, 16:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X