For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీ: ఈ-ఫైలింగ్ రిటర్న్ గడువు పెంపు (ఫోటోలు)

By Nageswara Rao
|

ఆదాయపు పన్ను రిటర్నులు ఈ-ఫైలింగ్ గడువును కేంద్ర ప్రభుత్వం వారం రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం ఈ నెల 7వ తేదీ వరకూ ఈ-ఫైలింగ్ చేసుకునే వీలు కలుగుతోంది. నిజానికి ఈ గడువు ఆగస్టు 31తో ముగిసింది.

చివరి రోజున ఎక్కువ మంది ఫైల్ చేయడానికి ప్రయత్నించడంతో ఈ-ఫైలింగ్‌లో పలు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు వినియోగదారులు నుంచి అభ్యర్ధనలు రావడంతో ఈ నిర్ణయం తీసుకన్నట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఫైలింగ్ రిటర్న్ గడువు పెంపు

ఈ ఫైలింగ్ రిటర్న్ గడువు పెంపు

ఆదాయపు పన్ను రిటర్నులు ఈ-ఫైలింగ్ గడువును కేంద్ర ప్రభుత్వం వారం రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం ఈ నెల 7వ తేదీ వరకూ ఈ-ఫైలింగ్ చేసుకునే వీలు కలుగుతోంది. నిజానికి ఈ గడువు ఆగస్టు 31తో ముగిసింది.
 ఈ ఫైలింగ్ రిటర్న్ గడువు పెంపు

ఈ ఫైలింగ్ రిటర్న్ గడువు పెంపు

అంతక ముందు 2015-16 సంవత్సరానికిగాను పన్ను చెల్లింపుల గడువును జూలై 31 నుంచి ఆగస్టు 31వరకు పెంచిన విషయం తెలిసిందే. గుజరాత్‌లో పటేళ్ల ఆందోళనతో ఆ ఒక్క రాష్ట్రానికి ఐటీ రిటర్న్స్ గడువును సెప్టెంబర్ 7 వరకూ పెంచుతూ ఇంతక ముందు నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఫైలింగ్ రిటర్న్ గడువు పెంపు

ఈ ఫైలింగ్ రిటర్న్ గడువు పెంపు

తాజాగా ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా అమలు చేశారు. ప్రస్తుతం దేశీయంగా నాలుగు కోట్ల మంది ఐటీ పన్నులు చెల్లిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రూ.7.98 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ఫైలింగ్ రిటర్న్ గడువు పెంపు

ఈ ఫైలింగ్ రిటర్న్ గడువు పెంపు

కాగా ఓటీపీ ఆధారిత ఐటీఆర్ ఫైలింగ్ సిస్టమ్ ద్వారా ఆగస్టు 31వ తేదీ నాటికి దాదాపు 29 లక్షల పన్ను రిటర్న్స్‌ను పరిశీలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆదాయ పన్ను రిటర్నులను మరింత సరళతరం చేయడానికి ఐటీ శాఖ మూడు పేజీల ఐటీఆర్ దరఖాస్తును రూపొందించింది.

English summary

ఐటీ: ఈ-ఫైలింగ్ రిటర్న్ గడువు పెంపు (ఫోటోలు) | Last date for filing I-T return extended to September 7

The government today extended the last date for e-filing of Income Tax return by a week to September 7. The government had received various representations that tax payers have faced difficulties in e-filing of returns across the country due to slowing down of certain e-services on August 31, 2015, the earlier due date.
Story first published: Thursday, September 3, 2015, 12:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X