For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిటైర్ అవుతున్నారా: మీరు చేయాల్సిన పనులు?

By Nageswara Rao
|

ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఒక వ్యక్తి తన సంపాదనను ఏం చేయాలి? ఎలా ఆ డబ్బుని వృద్ధి చెందించాలి? వచ్చిన ఆదాయాన్ని తన లక్ష్యాలుగా అనుగుణంగా ఎలా మదుపు చేయాలి? ఇలాంటి విషయాలతో సతమతమవుతుంటారు.

సొంతిల్లు, పిల్లల చదవులు, వారికి వివాహాలు, జీవితంలోని ఇతర సరదాలు. ఇలా ఎన్నో ఆర్ధిక లక్ష్యాలుంటాయి. ఇవన్నీ రిటైర్మెంట్ ముందు. కానీ రిటైర్మెంట్ తర్వాత జీవితంలో ఉరుకులు పరుగులు ఉండవు. వచ్చిన జీతాన్ని ఏం చేయాలి అని కాకుండా వచ్చే మొత్తాన్ని ఎలా వినియోగించుకోవాలి అనే ఆలోచన మాత్రమే ఉంటుంది.

వీటన్నింటితో పాటు పదవీ విరమణ అనంతరం ఆర్ధికంగా కూడా కచ్చితమైన ప్రణాళికలు వేసుకుంటేనే విశ్రాంత జీవితం ప్రశాంతంగా సాగుతుంది. అందు కోసం ముందుగా ఏం చేయాలో తెలుసుకుందాం?

పదవీ విరమణ: మీరు చేయాల్సిన పనులు?

పదవీ విరమణ: మీరు చేయాల్సిన పనులు?

పదవీ విరమణ చేసిన తర్వాత నెలవారీగా జీతం రాదు. అంతేకాదు అప్పటి వరకు మీరు పెడుతున్న ఖర్చలు కూడా తగ్గవు. కాబట్టి మీ వ్యక్తిగత ఆర్ధిక విషయాలపై దృష్టి సారించండి. పదవీ విరమణ ప్రయోజనాలు అంటే గ్రాట్యూటీ, పీఎఫ్, ఇతర మార్గాల నుంచి మీకు అందిన మొత్తం ఎంతో చూసుకోండి.

 పదవీ విరమణ: మీరు చేయాల్సిన పనులు?

పదవీ విరమణ: మీరు చేయాల్సిన పనులు?

బీమా పాలసీల నుంచి ఏమైనా డబ్బు రావాల్సి ఉందా? నగదు రూపంలో అంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచవల్ ఫండ్స్ రూపంలో ఎంత వస్తుందో చూసుకోండి. మీకు గనుకు సొంతిల్లు ఉండి, దాని ద్వారా అద్దెలు వస్తుంటే గృహరుణం ఈఎంఐలు వెంటనే తీర్చకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ, వ్యక్తిగత, క్రెడిట్ కార్డు రుణాలను మాత్రం ముందుగా వదిలించుకోవడం ఉత్తమం.

 పదవీ విరమణ: మీరు చేయాల్సిన పనులు?

పదవీ విరమణ: మీరు చేయాల్సిన పనులు?

మీరు సంపాదిస్తున్న వయసులో ఉంటే ఏదైనా నష్టం వచ్చినా దాన్ని తట్టుకునే సామర్ధ్యం ఉంటుంది. కానీ రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం రాదు కాబట్టి మీరు పెట్టే పెట్టుబడుల్లో ఎలాంటి నష్టం రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

పదవీ విరమణ: మీరు చేయాల్సిన పనులు?

పదవీ విరమణ: మీరు చేయాల్సిన పనులు?

అంతేకాదు రిటైర్మెంట్ తర్వాత వచ్చే నగదు మొత్తాన్ని స్ధిరమైన ఆదాయం వచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది. ముఖ్యంగా ఈక్విటీల్లో మదుపు చేసే ఫండ్లకు చాలా దూరంగా ఉండాలి. మీ రిటైర్మెంట్ తర్వాత వచ్చిన మొత్తాన్ని ఇలాంటి ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ఎంత మాత్రం మంచిది కాదు.

 పదవీ విరమణ: మీరు చేయాల్సిన పనులు?

పదవీ విరమణ: మీరు చేయాల్సిన పనులు?

ఇక పోస్టాఫీసు పెద్దల పొదుపు పథకంలో రూ. 1000 నుంచి రూ. 15,00,000 వరకూ మదుపు చేసుకోవచ్చు. ఇందులో పెట్టిన పెట్టుబడులకు సంవత్సరానికి వడ్డీ 9.3 శాతం అందుతుంది. అంతేకాదు ప్రతి మూడు నెలలకొకసారి వడ్డీని చెల్లిస్తారు.

 పదవీ విరమణ: మీరు చేయాల్సిన పనులు?

పదవీ విరమణ: మీరు చేయాల్సిన పనులు?

కాలపరిమితి ముగిసిన వెంటనే ఈ ఫథకాన్ని మరో మూడేళ్ల పాటు కొనసాగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీలో భాగంగా కూడా ఇందులో మదుపు చేసిన మొత్తానికి పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.

 పదవీ విరమణ: మీరు చేయాల్సిన పనులు?

పదవీ విరమణ: మీరు చేయాల్సిన పనులు?

రిటైర్మెంట్ తర్వాత

మీ డబ్బు అధిక రాబడి ఇవ్వడం కన్నా వీలైనంత వరకూ సురక్షితంగా ఉండేలా చేసుకోవడమే మేలు. అందుకోసం మీరు వీలైనంత వరకూ పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. కొంత మొత్తాన్ని సురక్షిత పెట్టుబడి పథకాల్లో మదపు చేయాలి.

పదవీ విరమణ: మీరు చేయాల్సిన పనులు?

పదవీ విరమణ: మీరు చేయాల్సిన పనులు?

వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు అధికం అవుతుంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు వైద్య ఖర్చులు ఎలా ఉన్నాయో, భవిష్యత్తులో ఇంకా పెరుగుతూనే ఉంటాయి. జీవితంలో ఏ దశలో ఉన్న ఒక మంచి బీమా పాలసీ తీసుకోవడం మంచిది.

English summary

రిటైర్ అవుతున్నారా: మీరు చేయాల్సిన పనులు? | 8 Must Do Things Before You Retire

Getting ready to retire? The moves you make in the months before you call it quits can smooth the way to a secure future.
Story first published: Tuesday, September 8, 2015, 14:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X