For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రికరింగ్ డిపాజిట్: ఓపెన్ చేసేందుకు ఏ బ్యాంకు ఉత్తమం?

By Nageswara Rao
|

ఓ క్రమ పద్ధతిలో నగదును దాచుకునేందుకు బ్యాంకుల వద్ద పెట్టుబడి సాధనాల్లో రికరింగ్ డిపాజిట్ ఒకటి. ఈ రికరింగ్ డిపాజిట్లలో నెలవారీ, త్రైమాసిక లేదా హాఫ్ ఇయర్లీగా నగదుని చెల్లించవచ్చు. పోస్టు ఆఫీస్‌లు, బ్యాంకులు లేదా చిట్ ఫండ్స్ లాంటి సంస్ధలను మీరు రికరింగ్ డిపాజిట్లను పెట్టుబడి పెట్టేందుకు ఎంచుకోవచ్చు.

వీటిల్లో ఎక్కడైతే అత్యధికంగా వడ్డీ వస్తుందో వాటిల్లో ఈ రికరింగ్ డిపాజిట్లను తీసుకుంటే మంచిదని ఆర్ధిక నిపుణులు తెలియజేస్తున్నారు. అన్ని బ్యాంకుల్లో కూడా రికరింగ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ సమానంగానే ఉంటుంది. కాగా, ప్రైవేట్ బ్యాంకులైన యస్ బ్యాంక్, డీసీబీ లాంటివి రికరింగ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని ఇస్తున్నాయి.

ప్రభుత్వ రంగ బ్యాంకులు రికరింగ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీని అందిస్తున్నాయి. యస్ బ్యాంకు, డీసీబీ మాత్రం 8.60 వడ్డీని అందిస్తున్నాయి. ముందుగా రికరింగ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలనుకునే వినియోగదారులు బ్యాంకులు అందించే వడ్డీని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

మీరు ఖాతా కలిగిన బ్యాంకులోనే రికరింగ్ డిపాజిట్ ఖాతా తెరవండి. ఇలా చేయడం వల్ల మీరు వాయిదాల ప్రకారం చెల్లించాల్సిన మొత్తాన్ని బ్యాంకులు ఆటోమేటిక్‌గా మీ ఖాతా నుంచి డెబిట్ చేసుకుంటాయి. మీ రికరింగ్ డిపాజిట్ మెచ్యూరిటీ పూర్తైన తర్వాత ఆటోమెటిక్‌గా నగదు మొత్తాన్ని మీ ఖాతాలోకి జమ చేస్తాయి.

Which Is The Best Bank To Open A Recurring Deposit In India?

రికరింగ్ డిపాజిట్ ఖాతా ఓపెన్ చేసే సమయంలో ఉమ్మడి నామినేషన్లు ఇవ్వడం మాత్రం మరిచిపోకండి. చిన్న మొత్తాలను గనుక రికరింగ్ డిపాజిట్ల ద్వారా పొదుపు చేయాలనుకుంటే పోస్టాఫీస్ మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పోస్టాఫీసులో నెలకు రూ. 10 నుంచి వేలల్లో మీరు పెట్టుబడులు పెట్టొచ్చు.

సరైన సమయంలో చెల్లించిన రికరింగ్ డిపాజిట్లకు జరిమానా కూడా విధిస్తారు. ఉదాహరణకు మీరు ప్రతినెలా 10వ తేదీకి రూ. 4000 రికరింగ్ డిపాజిట్ చెల్లిస్తారని అనుకుందాం. 10వ తేదీ నాటికి మీరు మీ నెలవారీ మొత్తాన్ని చెల్లింటనట్లైతే జరిమానా విధిస్తారు.

మీరు చేసిన రికరింగ్ డిపాజిట్లు అంటే నెల నెల కొంత డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. వడ్డీలో తేడాలుంటాయి. నెల నెల వచ్చే వడ్డీలో కూడా మారుతుంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో సాధారణ వడ్డీకి, చక్రవడ్డీకి జత చేరడంతో రాబడులు ఎక్కువగా ఉంటాయి.

ఇక రికరింగ్ డిపాటిట్ పెట్టుబడులపై పెట్టుబడిదారుడు చక్రవడ్డీని పూర్తిస్దాయిలో పొందలేడు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల కాల పరిమితి ఎంత ఎక్కువగా ఉంటే అన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఈ రెండు డిపాజిట్లపై వచ్చే వడ్డీకి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

English summary

రికరింగ్ డిపాజిట్: ఓపెన్ చేసేందుకు ఏ బ్యాంకు ఉత్తమం? | Which Is The Best Bank To Open A Recurring Deposit In India?

Recurring deposit is among the favorite investment avenue for those who are looking to save money in a systematic manner. This could be monthly bi-monthly, quarterly or even half yearly.
Story first published: Wednesday, August 12, 2015, 14:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X