For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాస్పిటల్ మెడీ‌క్లెయిమ్ కార్డు ఉపయోగించడం ఎలా?

By Nageswara Rao
|

కార్పోరేట్ వైద్యం ఖరీదుగా మారిన నేపథ్యంలో ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా తప్పనిసరిగా చేయించుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగస్తులతో పాటు సొంత వ్యాపారాలు చేసుకునే వారు, వృత్తి నిపుణులు కూడా ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకుంటున్నారు.

అయితే ఇటీవల కాలంలో ఆరోగ్య బీమా తీసుకునే వారి సంఖ్య పెరగడంతో వారిని ఆకట్టుకోవడానికి బీమా కంపెనీలు కూడా పోటీ పడుతున్నాయి. కొత్త కొత్త పథకాలతో పాటు మెరుగైన సేవలను అందిస్తున్నాయి. అంతేకాదు ఆరోగ్య బీమా తీసుకున్న కస్టమర్లకు క్లెయిమ్‌లు సమస్యగా మారకుండా జాగ్రత్త పడుతున్నాయి.

అసలు ఆరోగ్య బీమా చేయించుకోవడం కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. ఆరోగ్య బీమా తీసుకుంటే, మీ చేతిలో డబ్బు లేకున్నా వైద్య చికిత్స పొందే అవకాశం ఉంది. వీటితో పాటు ఆరోగ్య బీమాను అందిస్తోన్న కంపెనీలు వాటి నెట్‌వర్క్ ఆసుపత్రి పరిధిలో క్యాష్‌లెస్ చికిత్సను అందిస్తున్నాయి.

అసలు క్లెయిమ్ అనేది రెండు రకాలు:

1. క్యాష్‌లెస్
2. రీయింబర్స్‌మెంట్

క్యాష్‌లెస్ అంటే?

క్యాష్‌లెస్ అంటే?

క్యాష్‌లెస్ అంటే ఉచితంగా వైద్య చికిత్స చేయించుకోవడమే. ఇందులో కూడా రెండు రకాలున్నాయి. ముందస్తు ప్రణాళికతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరే కేసులు కొన్ని ఉంటే, అప్పటికప్పుడు అత్యవసరంగా చికిత్స కోసం చేరేవి మరికొన్ని. చికిత్స కోసం ఆసుపత్రిలో ముందుగానే చేరాల్సి ఉందని ముందుగానే తెలిస్తే ఉదాహరణకు డెలివరీ, కొన్ని శస్త్రచికిత్సల క్లెయిమ్ విషయంలో బీమా కంపెనీని ముందే సంప్రదించడం ఉత్తమం.

 క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ కోసం నెట్‌వర్క్ పరిధిలోని ఆసుపత్రిని ఎంచుకోండి?

క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ కోసం నెట్‌వర్క్ పరిధిలోని ఆసుపత్రిని ఎంచుకోండి?

క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ కోసం నెట్‌వర్క్ ఆసుపత్రిని ముందుగానే ఎంపిక చేసుకోసుకోండి. ఆసుపత్రిలో చేరాలనుకుంటున్న రోజు కంటే కనీసం రెండు మూడు రోజుల ముందే ఆసుపత్రిలో అపాయింట్‌మెంట్ తీసుకోవటం మంచిది. ఇందుకోసం మీ వివరాలు, చికిత్స కోసం చేరుతున్న వ్యక్తి ఐడీ కార్డు వంటి వివరాలు ఆసుపత్రికి ఇవ్వండి. అప్పుడు హాస్పిటల్ సిబ్బంది ఆ చిక్సితకు ఎంత ఖర్చవుతుందో లెక్కించి క్లెయిమ్ కోసం బీమా కంపెనీ లేదా టీపీఏని సంప్రదిస్తారు.

 బీమా పరిధిలోకి వస్తుందా రాదా?

బీమా పరిధిలోకి వస్తుందా రాదా?

ఆసుపత్రి నుంచి రిక్వెస్ట్ వచ్చాక బీమా కంపెనీ అన్ని వివరాలనూ పరిశీలిస్తుంది. మీరు తీసుకునే చికిత్స బీమా పరిధిలోకి వస్తుందా.. రాదా? వస్తే బీమా పరిహారంపై ఏమైనా పరిమితులున్నాయా? అన్న విషయాలను పరిశీలిస్తుంది. ఈ పరిశీలన కార్యక్రమాన్ని గరిష్టంగా 2 నుంచి 4 గంటలలోపే కంపెనీలు పూర్తి చేస్తాయి. అన్నీ సక్రమంగా ఉంటే క్యాష్‌లెస్ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి అనుమతిస్తాయి.

రీయింబర్స్‌మెంట్

రీయింబర్స్‌మెంట్

కొన్నిసార్లు నెట్‌వర్క్ పరిధిలో లేని ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవాల్సి వస్తుంది. అలాంటి కేసులకు కూడా బీమా పరిహారం లభిస్తుంది. కానీ, క్యాష్‌లెస్ ఫెసిలిటీ లభించదు. ఇలాంటప్పుడు ముందుగా చికిత్సా వ్యయాన్ని మనమే భరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ మొత్తాన్ని రీయింబర్స్‌మెంట్ విధానంలో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఏడు రోజుల్లోగా క్లెయిమ్ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. క్లెయిమ్ ఫారంతో పాటు డిశ్చార్జి కాగితాలు, ఆసుపత్రి బిల్లులు తదితర రిపోర్టులు సమర్పించాలి.

English summary

హాస్పిటల్ మెడీ‌క్లెయిమ్ కార్డు ఉపయోగించడం ఎలా? | How to use a mediclaim card?

In case of emergency treatment admit the patient in any hospital, after the treatment is over. Claim can be done by submitting the original bills and other relevant documents.
Story first published: Monday, August 3, 2015, 13:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X